నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందం నుంచి ఆరోగ్యం వరకూ, ఫ్యాషన్ నుంచి పేరెంటింగ్ వరకూ ప్రతి విషయానికి అక్కడ సలహాలు, చిట్కాలు దొరుకుతున్నాయి. అంతేకాదు నెట్టింట్లో చెప్పే చాలా చిట్కాలు ట్రెండింగ్ గా మారి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ప్రజలు వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే వాటిని అనుసరించడం కూడా మొదలు పెడుతున్నారు. ఇది ఎంతవరకూ సరైనదీ అనే విషయాన్ని పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) అంటే నోట్లో నూనె పోసుకుని పుక్కలించడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగవుతుందని సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది పోస్టులు, వీడియోలు చేసి పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య పొతుందనీ తాజా శ్వాసతో పూర్తి నోటి, దంతాల ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పకుంటున్నారు. మీరు కూడా ఆయిల్ పుల్లింగ్ గురించి వినడమో, చూడటమో చేసే ఉంటారు. నోట్లో నూనె పోసుకుని పుక్కలించే ముందు ఈ ట్రెండ్ వెనకున్న వాస్తవాలను వివరంగా తెలుసుకోండి.
"ఆయిల్ పుల్లింగ్(నూనె నోట్లో పోసుకుని పుక్కలించడం) ఇప్పుడు ట్రెండ్ అవుతున్నప్పటికీ ఇది కొత్తగా మొదలైన పద్ధతి ఏమీ కాదు. ఇది పురాతన ఆయుర్వేద పద్ధతి. నోటిని శుభ్రం చేయడానికి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నోట్లో నూనె పోసుకుని కొన్ని నిమిషాల పాటు పుక్కలించడం దీని నియమం.
నూనె అనేది సహజమైన శుద్ధి గుణాలు కలిగిన పదార్థం. దీన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం నోటి కుహరంలోని బ్యాక్టీరియా, విషపదార్థాలు, ప్లాక్ లను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్రక్రియ హానికరమైన సూక్ష్మజీవులు, విషపదార్థాలను దంతాలు, చిగుళ్ల నుండి "బయటకు లాగడం" కోసం పని చేస్తుంది. ఇది నోట్లో పేరుకుపోయి ఉన్న హాని కారకాలన్నింటినీ తొలగించి మెరుగైన దంతాలు, నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడం: ఇది నోటి కుహరాలకు కారణమయ్యే ప్రధాన బ్యాక్టీరియా అయిన స్ట్రెప్టోకాకస్ మ్యుటాన్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చెడు శ్వాసను నివారించడం: నోట్లో పేరుకుపోయి ఉండే విషపదార్థాలు, ఆహారం తాలుకా బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా ఇది శ్వాసను సహజంగా తాజాగా ఉంచుతుంది.
చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం: నూనెతో పుల్లింగ్ చేయడం వల్ల చిగుళ్లలో వాపు తగ్గి, గింగైవిటిస్ ప్రమాదం తగ్గుతుంది.
పళ్ళను తెల్లగా చేయడం: ఈ చిట్కా ఉపరితల మచ్చలను తొలగించడం వల్ల కాలక్రమేణా తెల్లటి దంతాలను, ప్రకాశవంతమైన నవ్వును పొందవచ్చని వేదికలు చెబుతున్నాయి.
మొత్తం ఆరోగ్యాన్ని మద్దతు ఇవ్వడం: నోటి ఆరోగ్యం శరీర వ్యవస్థలకు సంబంధించినది కాబట్టి నోటి బ్యాక్టీరియాను తగ్గించడం వల్ల మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది.
నారింజ నూనె: నారింజ నూనెలొ యాంటీమైక్రోబయల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. అలాగే దీంట్లో లారిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున్న ఆయిల్ పెల్లింగ్ కోసం ఇది ఉత్తమమైనది అని నిపుణులు చెబుతారు. ఇది బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా నోట్లో పోసుకుని పుక్కిలించడానికి అనువైన ఎంపికలు.
ఆయిల్ పుల్లింగ్ కోసం మీరు ఉదయం లేవగానే నారింజ నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ నోరంతా నూనె వ్యాపించేలా చేయండి. అంత కాన్నా తక్కువ సమయం చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదని నిపుణుల అభిప్రాయం.
రెండు నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత నూనెను బయటకు ఊసేసి శుభ్రంగా బ్రష్ తో మీ పళ్లను తోముకోండి. (ఈ నూనె పొరపాటున కూడా మింగకండి, ఇలా చేస్తే బ్యాక్టీరియా అంతా తిరిగి మీ కడుపులోకి పోతుంది).
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం