డయాబెటిస్‌ మాత్రలు కిడ్నీలపై ప్రభావం చూపుతాయా?-how do diabetes pills affect your kidneys know from experts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How Do Diabetes Pills Affect Your Kidneys Know From Experts

డయాబెటిస్‌ మాత్రలు కిడ్నీలపై ప్రభావం చూపుతాయా?

HT Telugu Desk HT Telugu
Aug 04, 2023 09:25 AM IST

మధుమేహం ఉన్నవారిలో కిడ్నీ దెబ్బతింటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కిడ్నీ బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులే.

షుగర్ మాత్రలు కిడ్నీపై ప్రభావం చూపుతాయా.
షుగర్ మాత్రలు కిడ్నీపై ప్రభావం చూపుతాయా.

మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ వ్యాధి కంటే కిడ్నీ దెబ్బతినడం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. డాక్టర్ శివప్రకాష్ దీనిపై ఓ వీడియో సందేశం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

‘నిరంతరంగా మాత్రలు వేసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయా అనే ప్రశ్న చాలా మంది రోగులు అడుగుతుంటారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ సందేహం తలెత్తుతుంది. అందరికీ ఈ సందేహం రావడానికి ఒక ప్రాథమిక కారణం ఉంది. మధుమేహం ఉన్నవారిలో కిడ్నీ దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కిడ్నీ బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులే. ఒక భారతీయ అధ్యయనం ప్రకారం ప్రతి ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఒకరికి కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు..’ అని వివరించారు.

మాత్ర మూత్రపిండాలను ప్రభావితం చేయగలదా?

కొన్ని మందులు, మాత్రల వల్ల శరీరంపై దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉంటాయని అందరికీ తెలిసిందే. అధిక మోతాదు గల యాంటీబయాటిక్ మందులు. యాంటీవైరల్ మందులు, యాంటీబయాటిక్స్ మందులు శరీర అవయవాలపై, కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఈ మందులు రాస్తారు. వారు రాసిన డోసు ప్రకారమే వేసుకోవాలి. సరైన మోతాదును తక్కువ రోజులలో ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని ఉండదు.

దీర్ఘకాలిక ఉపయోగం దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అదేవిధంగా, వైద్యులు సాధారణంగా రాసే కొన్ని మందులలో నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అని పిలువబడే నొప్పి నివారణలు ఉంటాయి. అవి చేతి నొప్పి, కాళ్ల నొప్పులు, తుంటి నొప్పికి మందులు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీపై కూడా ప్రభావం పడుతుంది.

అదేవిధంగా కొన్ని క్యాన్సర్ నిరోధక మందులు, రక్త సంబంధిత సమస్యలకు తీసుకునే కొన్ని మందులు కిడ్నీ సమస్యలకు కారణం కావచ్చు. ఇవేవీ షుగర్ మాత్రలు కావు.

మూత్రపిండాలపై ప్రభావం?

మధుమేహంలో చిన్న రక్తనాళాలు దెబ్బతినడం చాలా సాధారణం. రక్తాన్ని శుద్ధి చేయడమే కిడ్నీ పని. అధిక చక్కెర స్థాయిలు ఉన్నవారికి శుద్దీకరణ సమయంలో మూత్రపిండాల లోపల రసాయన ప్రతిచర్య జరుగుతుంది. అందుకే కిడ్నీ సమస్య వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండే వ్యక్తులకు, నిరంతరం హెచ్చు తగ్గులు ఉన్నవారికి ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు మొదట్లో తెలియవు.

షుగర్ మాత్రలు ఖచ్చితంగా కిడ్నీపై ప్రభావం చూపవు. అనేక దశల పరిశోధన తర్వాత మందులు కనిపెడతారు. ఆ అధ్యయనంలో సైడ్ ఎఫెక్ట్స్ మొదట పరీక్షిస్తారు. షుగర్ మాత్రలు కిడ్నీలపై ప్రభావం చూపవని, గుండెపై ప్రభావం చూపదని ఇప్పటివరకు అధ్యయనాలు చెబుతున్నట్టు డాక్టర్ శివప్రకాష్ వీడియోలో వివరించారు.

WhatsApp channel