క్యాన్సర్ వ్యాధి వ్యక్తి రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?-how cancer affects the immune system and coping strategies know full details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  క్యాన్సర్ వ్యాధి వ్యక్తి రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

క్యాన్సర్ వ్యాధి వ్యక్తి రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Ramya Sri Marka HT Telugu

క్యాన్సర్ వ్యాధి రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడే రోగనిరోధక వ్యవస్థను ఇది దెబ్బతీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

రోగనిరోధక వ్యవస్థపై క్యాన్సర్ ప్రభావం

క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. శరీరంలోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతూ, ఆరోగ్యకరమైన కణాలను చనిపోవడం వల్ల వచ్చే సమస్యే క్యాన్సర్. క్యాన్సర్ కణాలు ఒకే చోట పరిమితం కాకుండా, శరీరంలోని ఇతర భాగాలకి కూడా వ్యాపిస్తాయి. మన శరీరానికి కనిపించని కవచం లాంటి రోగనిరోధక వ్యవస్థపై కూడా ఈ కణాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌లు వంటి హానికర సూక్ష్మజీవులను నుంచి శరీరాన్ని రక్షించే బాధ్యతను రోగనిరోధక వ్యవస్థ నిర్వహిస్తుంది. ఇది బలంగా ఉంటేనే మనం చిన్న చిన్న జలుబు వంటి సమస్యల నుండి పెద్ద వ్యాధుల దాకా తట్టుకోగలుగుతాం.లేదంటే ప్రతి చిన్న దానికి డీలా పడిపోతాం.

క్యాన్సర్ ఇమ్యూనిటీ సిస్టమ్‌ను ఎలా దెబ్బ తీస్తుంది?

1. క్యాన్సర్ కణాలు దాగి ఉండి కనిపించవు

సాధారణంగా మన శరీరం ప్రమాదకరమైన కణాలను గుర్తించి వాటిని తొలగిస్తుంది. కానీ క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కణాల్లా నటించి రోగనిరోధక వ్యవస్థను మోసం చేస్తాయి. దీని వల్ల శరీరం వాటిపై చర్య తీసుకోలేకపోతుంది.

2. రక్త కణాల తయారీ నిలిచిపోతుంది

మన రోగనిరోధక శక్తి చాలా భాగం వైట్ బ్లడ్ సెల్స్ (WBC) మీద ఆధారపడి ఉంటుంది. వీటిని శరీరం "బోన్ మారో" అనే ఎముకల లోపల ఉండే భాగంలో తయారు చేస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్ రకాలూ (లీక్మియా వంటి రక్త క్యాన్సర్) బోన్ మారోను నాశనం చేస్తాయి. ఫలితంగా, కొత్త రక్షణ కణాలు రావడం ఆగిపోతుంది.

3. క్యాన్సర్ చికిత్సల వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది

క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసుకునే కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ శరీరంలోని మంచి కణాలనూ తొలగించేస్తాయి. ముఖ్యంగా WBCల సంఖ్య తక్కువవడం వల్ల, రోగికి చిన్న ఇన్ఫెక్షన్లే పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది న్యూట్రోపీనియా అనే స్థితికి దారి తీస్తుంది. దీనివల్ల రక్తంలో రక్షణ కణాలు చాలా తక్కువగా ఉండడం.

4. శరీరం కొత్త ఇన్ఫెక్షన్లను తట్టుకోలేకపోతుంది

క్యాన్సర్ సమయంలో లేదా చికిత్స సమయంలో జలుబు, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్, చర్మపు గాయాలు వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ఇవి కొన్ని సార్లు ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రమవుతాయ. కొన్నిసార్లు చిన్న గాయం కూడా పెద్ద ఇన్ఫెక్షన్‌కు కారణమవచ్చు.

రోగనిరోధక వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి?

1. పౌష్టికాహారం తీసుకోవాలి

రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ C కలిగిన ఉసిరికాయ, నిమ్మరసం వంటివి వాటిని ఎక్కువగా తినాలి. అలాగే జింక్ కలిగిన బాదం, వేరుసెనగ, గింజలు ప్రొటీన్లు కలిగిన పప్పులు, పాల పదార్థాలు. ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయి.

2. శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే శుభ్రతకు ప్రాధ్యాన్యత ఎక్కువగా ఇవ్వాలి.ఇందుకోసం చేతులు తరచూ కడుక్కోవాలి. బాహ్య వ్యక్తులతో శారీరక స్పర్శ తగ్గించాలి. ఎప్పుడూ శుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో ఉండాలి.

3. విశ్రాంతి, నిద్ర తప్పనిసరి

రోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం, తగినంత నిద్ర పోవడం అనేవి రోగనిరోధక వ్వవస్థకు చాలా ముఖ్యమైనవి.ఇవి శరీరానికి శాంతి, ఆరోగ్యాన్ని తిరిగి తీసుకొచ్చే అవకాశం కలుగుతుంది.

4. ధైర్యంగా ఉండాలి

క్యాన్సర్ వ్యాధి కన్నా భయం మరీ ప్రమాదకరమైనది. శారీరంగా బలంగా ఉండాలంటే మానసికంగా ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్ధతు చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం, సంగీతం లాంటివి ఉపయోగపడతాయి. అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం