ఇంటిని అందంగా, ఆకర్షణీంగా అలంకరించుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. కానీ అద్దె ఇంట్లో మనకి నచ్చినట్టు మనం చేయలేం కదా అని కొందరు, ఇదెలాగూ మన సొంతిల్లు కాదు కదా అని మరికొందరు ఇంటిని అందంగా అలంకరించాలనే తమ ఆశను పక్కన పెట్టేస్తున్నారు. భారతీయ పరిశోధన సంస్థ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం దాదాపు 59 శాతం మంది భారతీయులు తమ సొంత ఇంటి కల ఎప్పటికీ నెర్చుకోలేకపోతున్నారట. ప్రాపర్టీ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి కాబట్టి ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదనుకోండి.
మీరు కూడా అద్దె ఇంట్లో ఉంటుంటే.. ఇంటి అలంరణ అంటే మీకు ఇష్టమైతే మీ ఆశను పక్కకు పెట్టేయకండి. ఈ చిట్కాలతో మీ డబ్బు, శ్రమ వృథా కాకుండా, మీరు ఇళ్లు మారినా మీ అలంకరణ సామాగ్రి మీతోనే తీసుకెళ్లేలా సృజనాత్మకతతో మీ ఇంటిని అలంకరించుకోండి. అది కూడా చాలా తక్కువ ధరతో. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
ఇంటి అలంకరణలో లైటింగ్‌ను గురించి చాలా మంది పట్టించుకోరు. కానీ లాంతర్లు, లాంప్‌లు, సీలింగ్ లైట్ల సహాయంతో మీ ఇంటి రూపాన్నే మార్చుకోవచ్చు. మంచి లైటింగ్ ఉన్న ఇళ్ళు తక్కువ లైటింగ్ ఉన్న ఇళ్ల కంటే ఎల్లప్పుడూ అందంగా ఉంటాయి. కాబట్టి మీ ఇంటి మూలల్లో, వార్డ్‌రోబ్ ఉన్న ప్రాంతంలో లేదా లివింగ్ రూమ్‌లో లైటింగ్‌ను సరిగ్గా ఉపయోగించండి. రాత్రి సమయానికి మీ ఇంట్లో మంచి వాతావరణం సృష్టించడానికి చిన్న ఫెయిరీ లైట్లు వాడండి.
సోఫాలు లేదా మంచం మీద చిన్న చిన్న కుషన్‌లు అమర్చండి. రంగు, రంగుల కుషన్‌లు ఇంటికి మంచి అందాన్ని ఇస్తాయి. చూపరుల మనసులు కట్టిపడేస్తాయి.
మీ కుటుంబ సభ్యుల ఫోటోల కంటే మంచి ఆర్ట్ పీస్ ఏమీ ఉండదు. మీకు ఫోటోలు తీయడం, చూడటం ఇష్టమైతే ఇది మీకు అనువైన ఆలోచన. గోడపై ఫోటోలను అతికించండి, ఫోటో ఫ్రేమ్‌లు అమర్చండి లేదా ఫోటోలతో కొలేజ్ చేయండి. ఇది మీ జ్ఞాపకాలను తాజాగా ఉంచుతుంది. మీరు ఇళ్లు మారినా వీటితో సమస్య ఉండదు.
ఇంట్లో చిన్న చిన్న మొక్కలను పెంచడం ఇంటిని చాలా అందంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. చక్కని వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతేకాదు ఇవి ఇంట్లోని గాలిని శుద్ధి చేసి పాజిటివిటీని పెంచుతాయి.
ఫ్యాబ్రిక్ లేదా బట్టలతో గోడ పై చిన్న డెకరేషన్స్ పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంటి రూపం చక్కగా మారుతుంది. రూం మారినా ఈజీగా క్యారీ చేసుకునే వీలు ఉంటుంది.
ఇంటి అలంకరణలో పరదాలు అంటే కర్టెన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఎప్పుడూ అందంగా మంచి ఆకర్షణీయమైన రంగుల్ోల ఉండేలా చూసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇవి ఇంటిని మరింత అందంగా చేస్తాయి.
మీ ఇంట్లో ఉన్న పాత ఫర్నిచర్ పై కొంచెం పెయింట్ వేసి లేదా కొత్త కవర్ వేసి వాటిని కొత్తగా మార్చుకోండి. వీటిని రకరకాల డిజైన్లతో అమర్చారంటే అద్దె ఇళ్లైనా అందంగా మెరిసిపోతుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్