Bath | వింటర్‌లో వేడి నీటితో స్నానం చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది?-hot or cold water bath in winter which is better ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Hot Or Cold Water Bath In Winter Which Is Better

Bath | వింటర్‌లో వేడి నీటితో స్నానం చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది?

Himabindu Ponnaganti HT Telugu
Dec 16, 2021 05:25 PM IST

వింటర్‌లో వేడి నీటితో కాకుండా చన్నీళ్లతో ఎందుకు స్నానం చేస్తారు అనే కదా మీ సందేహం. నిజమే.. చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వేడి నీళ్ల‌తో స్నానం చేస్తుంటారు. కానీ వేస‌వి కాలంలో చ‌న్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది.

చలికాలం వేడినీటితో స్నానం చేయవచ్చా?
చలికాలం వేడినీటితో స్నానం చేయవచ్చా? (pexel)

వింటర్‌లో వేడి నీటి స్నానం శ‌రీరానికి వెచ్చ‌దనాన్ని ఇస్తుంది. అలసట తగ్గి హాయిగా అనిపిస్తుంది. అయితే వేడి నీటితో స్నానం వల్ల కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని అంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువ సేపు వేడి నీటి స్నానం చేయడం కూడా సరికాదు. చ‌ర్మం, శిరోజాల‌పై ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెలు దెబ్బతిని చ‌ర్మం పొడిగా మారి ప‌గిలి దుర‌ద‌ పెడుతుంది. శిరోజాలు పొడిగా మారి రాలిపోతాయి. గోరు వెచ్చటి నీళ్ల‌తోనే స్నానం చేయాలి. అది కూడా పది నిమిషాల‌లోపే స్నానం ముగించాలి. 

ఈ టిప్స్ పాటించాలి..

- పొడి చర్మం ఉంటే లిక్విడ్ సోప్ వాడడం ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ బాక్టీరియల్ సబ్బులు, షాంపూలు చర్మాన్ని సంరక్షిస్తాయి.

- వింటర్‌లో రోజూ తలస్నానం అవసరం లేదు. తలస్నానం చేస్తే జుట్టు పొడిగా ఉంటుంది. వారానికి రెండు సార్లు తలకి గోరు వెచ్చని నూనెతో మర్దనా చేసుకొని 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

- వ్యాయామం చేస్తున్న వారు రోజుకు రెండుసార్లు తలస్నానం చేయాలని భావిస్తే.. ఒకసారి సాధారణ స్నానం చేసి మరొకసారి తలస్నానం చేస్తే మంచిది.

చన్నీటి స్నానం మంచిదే..

- చలికాలంలో చన్నీటి స్నానం మంచిదే. చల్లని నీరు రక్తప్రసరణ అధికం చేసి రోగ నిరోధకత పెంచుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. 

- సహజంగా వచ్చే జలుబునుఉదయం చేసే చన్నీటి స్నానం వల్ల నివారించవచ్చని తేలింది. కారణం ఏంటంటే శరీరం లోపల నుంచి హాట్ రేడియేషన్ ప్రారంభమవుతుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్