Honda Gold Wing Tour | విలాసవంతమైన టూరింగ్ మోటార్‌సైకిల్, ధర రూ. 39 లక్షలు!-honda gold wing tour 2022 motor cycle features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Honda Gold Wing Tour 2022 Motor Cycle Features

Honda Gold Wing Tour | విలాసవంతమైన టూరింగ్ మోటార్‌సైకిల్, ధర రూ. 39 లక్షలు!

HT Telugu Desk HT Telugu
Apr 20, 2022 07:13 PM IST

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తాజాగా ఒక విలాసవంతమైన టూరింగ్ మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక ప్రీమియం కారులో ఎన్ని రకాల ఫీచర్లు ఉంటాయో ఈ ద్విచక్ర వాహనంలోనూ అన్ని ఫీచర్లు ఉన్నాయి. వివరాలు చూడండి..

Honda Gold Wing Tour
Honda Gold Wing Tour (Honda BingWing)

హోండా మోటార్‌సైకిల్ ఇండియా తమ బ్రాండ్ నుంచి టూరింగ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో 2022 ఎడిషన్ 'గోల్డ్ వింగ్ టూర్‌' ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ జపాన్ నుండి పూర్తిగా బిల్ట్-అప్ (CBU) యూనిట్‌గా ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది.  ఆసక్తిగల కస్టమర్‌లు రాబోయే కొన్ని రోజుల్లో ఈ మోటార్‌సైకిల్ ను కొనుగోలుచేయవచ్చు. ఇండియాలో ఈ సరికొత్త హోండా గోల్డ్ వింగ్ టూర్‌ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 39.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఒకే వేరియంట్‌ అందుబాటులో ఉంటుంది.

ఇంత ధర ఉన్న ఈ మోటార్ సైకిల్‌లో విశేషాలు కూడా చాలానే ఉన్నాయి.  కార్లలో ఉన్నట్లుగా ఇందులోనూ ఎయిర్‌బ్యాగ్‌ ఉంటుంది. ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో తెలుసుకోండి.

విలాసవంతమైన రైడింగ్ అనుభూతి

2022 హోండా గోల్డ్ వింగ్ టూర్‌పైన రైడింగ్ ఎంతో విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఫీచర్లను పరిశీలిస్తే.. దీనిలో 16 నుండి 23 డిగ్రీల వరకు సర్దుబాటు చేయగల బ్యాక్‌రెస్ట్ సీటు, వెనక కూర్చునే వారి కోసం ప్రత్యేక సీటు ఉంది. రైడింగ్ చేసే వారికి సౌకర్యంగా ఉండేలా పూర్తి డిజిటల్ LCD కలర్ డిస్‌ప్లే, సొరంగ మార్గాల్లోనూ సమాచారం ఇచ్చే నావిగేషన్ సిస్టమ్‌, నడిపేవారికి చల్లటి గాలిని ప్రసరింపజేసే వ్యవస్థ, Apple CarPlay ఇంకా Android Autoకు కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్షన్ కోసం రెండు USB టైప్-C పోర్ట్‌లు, ప్యాసింజర్ ఆడియో కంట్రోల్‌లతో కూడిన శక్తివంతమైన స్పీకర్లుఉన్నాయి

ఇంజన్ కెపాసిటీ

2022 హోండా గోల్డ్ వింగ్ టూర్‌లో 1,833cc లిక్విడ్-కూల్డ్ 4-స్ట్రోక్ 24-వాల్వ్ SOHC ఫ్లాట్-సిక్స్ ఇంజన్ అమర్చారు. ఇది 5,500rpm వద్ద 124bhp శక్తిని, అలాగే 4,500rpm వద్ద 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఇంజన్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో టూర్, స్పోర్ట్, ఎకానమీ ఇంకా రెయిన్ - ఇంజిన్ అనే 4 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

పూర్తి-LED లైటింగ్, ఆటో-క్యాన్సల్ అయ్యే టర్న్ ఇండికేటర్‌లు, ఎలక్ట్రానిక్‌గా అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్ ఉన్నాయి.  ఎయిర్‌బ్యాగ్‌, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌, క్రూయిజ్ కంట్రోల్, థొరెటల్ బై వైర్ సెటప్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, లాంటి ఫీచర్లూ ఉన్నాయి.

2022 హోండా గోల్డ్ వింగ్ టూర్ సింగిల్ కలర్ ఆప్షన్ గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్‌లో అందింస్తున్నారు. ఈ మోటార్‌సైకిల్ గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, ఇండోర్, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలలోని హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమైనాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్