Glowing Skin : వేసవిలో మెరిసే చర్మ కోసం నేచురల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి-homemade summer face packs for glowing skin natural beauty tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Glowing Skin : వేసవిలో మెరిసే చర్మ కోసం నేచురల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Glowing Skin : వేసవిలో మెరిసే చర్మ కోసం నేచురల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Anand Sai HT Telugu

Summer Face Packs : వేసవిలో మీ చర్మాన్ని మెరిసేలా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. హోంమేడ్ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయెుచ్చు.

తేనె ఫేస్ ప్యాక్ (Unsplash)

వేసవి మొదలైంది. చర్మంపై మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్‌లో చర్మంపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖంపై నల్లటి మచ్చలు, లైన్స్ కనిపిస్తాయి. కొందరికి ఎండలో ఎక్కువగా ముడతలు కూడా వస్తాయి. ఫలితంగా ముఖం ఎప్పుడూ నీరసంగా, అలసటగా కనిపిస్తుంది. అంతే కాకుండా వేడి ప్రభావం వల్ల రకరకాల చర్మ సమస్యలు మొదలవుతాయి.

ఇలాంటప్పుడు మన ముఖాన్ని నిత్యం హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే ఏ రకమైన చర్మ సమస్యలు దరిచేరవు. దాని కోసం మనం పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో కూడా మీ ఇంట్లో నుంచి కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ తయారు చేసి వాడుకోవచ్చు. మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.. ఇది చేయడం చాలా సులభం, మీ చర్మాన్ని పోషణ, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది అన్ని చర్మ రకాలకు మంచిది.

తేనె , పాలు ఫేస్ ప్యాక్

తేనె - 2 చెంచాలు, పాలు - 2 చెంచాలు తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలంటే ముందుగా పాలను అవసరమైన మోతాదులో తీసుకుని అందులో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది మీ ముఖాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. వేసవిలో ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.

బాదం, అరటిపండు ఫేస్ ప్యాక్

అరటిపండు- 1/2, బాదం పొడి - 1/2 tspని తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేయడానికి, ముందుగా అరటిపండును పేస్ట్‌లా అయ్యే వరకు మెత్తగా చేయాలి. ఇప్పుడు దానికి బాదం పొడి వేయాలి. బాదం పొడి లేకపోతే ఓట్స్ వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే వేసవిలో పొడిబారకుండా ముఖం మెరిసిపోతుంది.

నిమ్మరసం, బంగాళదుంప ఫేస్ ప్యాక్

బంగాళదుంప రసం - 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో రెండు రసాలను కలుపుకోవాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి, మీ చేతులతో తేలికగా మసాజ్ చేయండి. 30 నిముషాల పాటు అలానే వదిలి పెట్టండి. అనంతరం మీ ముఖం కడగాలి. మెరిసే చర్మానికి ఇది ఉత్తమమైనది. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే సూర్యరశ్మి వల్ల చర్మం పొడిబారదు, నల్లగా మారదు. అంతే కాకుండా ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై మచ్చలు, నల్లటి వలయాలను పోగొట్టడంలో సహాయపడుతుంది.

వేసవిలో సరైన చర్మ సంరక్షణ తీసుకోవాలి. ఎందుకంటే సన్ టాన్ తో చర్మం పాడైపోతుంది. బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. మరో విషయం ఏంటంటే.. కచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయండి.