Skin Tightening Remedies। మీ ముఖంలో యవ్వనపు మెరుపు ఎప్పటికీ ఉండాలా? ఇవిగో మార్గాలు!
Skin Tightening Remedies: చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, యవ్వనపు మెరుపును తిరిగి పొందడానికి సులభమైన చిట్కాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని ఇక్కడ చూడండి.
Skin Tightening Remedies: వయసు పెరిగే కొద్దీ ముఖంలో సహజ కళ అనేది తగ్గిపోతుంది. ముఖంపై ముడతలు రావడం, చర్మం సాగిపోవడం, పిగ్మెంటేషన్ సమస్యలు బయటపడతాయి. మారిన ముఖచిత్రంతో మీకు కొంత ఆందోళన, దిగులు ఉండటం సహజం. అయినప్పటికీ, చింతించకండి మనం మన చర్మాన్ని, ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకుంటామో, అది మిమల్ని అంత అందంగా కనిపించేలా చేస్తుంది. పెరిగే వయసును ఆపలేం కానీ, ఆ వయసు ప్రభావ ఛాయలను తగ్గించవచ్చు, మీరు ఎంత వయసు పెరిగినా, నవయవ్వనంగా కనిపించవచ్చు.
చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, యవ్వనపు మెరుపును తిరిగి పొందడానికి సులభమైన చిట్కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని మీకు మీరుగా మీ ఇంటి వద్దనే ప్రయత్నించి నిర్జీవంగా మారుతున్న మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయవచ్చు.
ఎలాస్టిన్ అనే ప్రొటీన్ మీ చర్మానికి స్థితిస్థాపకతను అందిస్తుంది, వయసు పెరిగే కొద్దీ చర్మంలోని ఎలాస్టిన్ పరిమాణం తగ్గుతుంది, దీనివల్ల చర్మం దాని సహజ మృదుత్వం, వశ్యతను కోల్పోతుంది. ఫలితంగా చర్మం వదులుగా మారుతుంది. ఇంకా, కొల్లాజెన్‌లో తగ్గుదల, చర్మాంతర్గత కొవ్వు కోల్పోవడం, శరీర నిర్మాణ సంబంధమైన మార్పులు కూడా చర్మం సాగిపోవడానికి దోహదం చేస్తాయి. గురుత్వాకర్షణ కూడా కొంతమేర కారణమవుతుంది. ఏదేమైనప్పటికీ, మీ చర్మం మళ్లీ బిగుతుగా మారడానికి ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఇక్కడ చూడండి.
చర్మ సంబంధిత నూనెలు
* ఆర్గాన్ ఆయిల్ మీ చర్మంలోని హైడ్రేషన్, స్థితిస్థాపకతను పెంచుతుంది, ఫలితంగా మీ చర్మం యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుంది.
* ఆల్మండ్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుందియ్, UV రేడియేషన్ వల్ల కలిగే చర్మ నష్టాన్ని నివారిస్తుంది.
* అవకాడో ఆయిల్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
ఎలా ఉపయోగించాలి: ఏదైనా నూనెను ఉపయోగించే ముందు మీ చర్మాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోండి. తడి ఆరాక మీ చేతిలో తగినంత మొత్తంలో నూనెను తీసుకోండి, చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా నూనెను అలాగే ఉంచి, నిద్ర లేవగానే గోరువెచ్చని నీటితో కడిగేయండి.
అరటిపండు పేస్ట్
జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఈస్తటిక్ డెర్మటాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అరటిపండ్లలో పొటాషియం, విటమిన్లు, సహజ నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.
ఎలా ఉపయోగించాలి: నాల్గవ వంతు పండిన అరటిపండును మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను శుభ్రమైన ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి, మెత్తని టవల్ తో తుడవండి.
దోసకాయ రసం
ఫిటోటెరాపియా జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, దోసకాయ ఎలాస్టిన్, హైలురోనిక్ యాసిడ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది . ఇది మీ చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది, మృదువైన ప్రభావాలను కలిగి ఉంటుంది.
ఎలా ఉపయోగించాలి: దోసకాయను తొక్క తీసి, ముక్కలుగా చేసి బ్లెండర్లో వేసి రసం తీయండి. శుభ్రమైన కాటన్ బాల్‌ని ఉపయోగించి, దోసకాయ రసాన్ని తీసుకొని ప్రభావిత చర్మంపై అద్దండి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి.
అలోవెరా జెల్
కలబంద ఆకులో ఉండే జెల్ చర్మం స్థితిస్థాపకతను పెంచతుంది, చర్మంను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది కొల్లాజెన్, హైలురోనిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: కలబంద ఆకు నుంచి జెల్‌ను తీయండి. దీన్ని నేరుగా చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
కాఫీ పేస్ట్
కాఫీలో ఉండే కెఫిన్, వయస్సు-సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడి నుండి చర్మాన్ని రక్షిస్తుంది, తద్వారా చర్మానికి రక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ మెడిసిన్ అండ్ సెల్యులార్ లాంగేవిటీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కాఫీలోని కెఫిన్ సమ్మేళనం UV ప్రేరిత చర్మ వృద్ధాప్యం నుండి కాపాడుతుంది.
ఎలా ఉపయోగించాలి: కాఫీ గింజలకు కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ చేయండి. ఆపై ఈ పేస్టును వదులుగా ఉన్న చర్మంపై వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేయండి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి.
సంబంధిత కథనం