Rehydration Drinks । మండే వేసవిలో మీరు రిఫ్రెష్ అవడానికి ఈ డ్రింక్స్ తప్పకుండా తాగండి!
Rehydration Drinks: తీవ్రమైన వేడితో శరీరంలో ఉన్న నీరు, నీటి ద్వారా ఎలక్ట్రోలైట్స్ ఆవిరైపోతాయి. వడదెబ్బకు దారితీసే ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు. నివారించడానికి రెండు ఎలక్ట్రోలైట్ పానీయాల గురించి తెలియజేస్తున్నాం.
Summer Health Care: ప్రస్తుతం ఎండాకాలం మండుతుంది. తీవ్రమైన వేడితో జనం అల్లాడిపోతున్నారు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎండవేడి మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. రానున్న రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికలు వెల్లడించాయి. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేసవి వేడి ప్రస్తుతాని కంటే 30 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఉష్ణోగ్రతలు 40-49 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. వాతావరణ నివేదికలలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ప్రమాదకరమైన కేటగిరీలో ఉంచడమైనది. 55 డిగ్రీల సెల్సియస్ అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదయినపుడు మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. బయటవేడిని తట్టుకునేందుకు శరీరంలోని వ్యవస్థ ఎక్కువ చెమటలు కక్కుతూ శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో శరీరంలో ఉన్న నీరు, నీటి ద్వారా ఎలక్ట్రోలైట్స్ ఆవిరైపోతాయి. నీరసం, అలసట ఆవహిస్తుంది, పెరుగుతున్న వేడితో వడదెబ్బకు దారితీసే ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు.
అందుకే ఈ ఎండాకాలంను తక్కువ అంచనావేయకండి హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, వీలైనంత ఎక్కువ నీరు, పండ్ల రసాలు, ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ తాగుతూ ఉండాలి. ఇక్కడ రెండు ఎలక్ట్రోలైట్ పానీయాల గురించి తెలియజేస్తున్నాం. ఇలాంటి డ్రింక్స్ (Rehydration Drinks) వేసవిలో చాలా అవసరం.
నిమ్మకాయ షికంజీ
నిమ్మకాయ షికంజీలో నిమ్మ, నల్ల ఉప్పు, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ శరీరాన్ని హైడ్రేట్ చేసి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇందులోని బ్లాక్ సాల్ట్ కడుపుకు మంచిది , ఉప్పు శరీరంలో సోడియం స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. లోబిపిని నివారిస్తుంది. ఇది కాకుండా, జీలకర్ర పొడి జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది, శరీరానికి శక్తిని ఇవ్వడానికి చక్కెర పనిచేస్తుంది. ఇవన్నీ ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
పుదీనా లస్సీ
లస్సీ సాధారణంగా ఎలక్ట్రోలైట్స్‌లోని అన్ని సుగుణాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. అలాగే పుదీనాను కలిపినప్పుడు, అది శరీరంలో మరింత చల్లదనాన్ని కలిగిస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు డీహైడ్రేషన్ లక్షణాలను తగ్గిస్తుంది.
వేసవిలో ఎలక్ట్రోలైట్ లోపం, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నివారించడానికి ఈ 2 పానీయాలను ఇంట్లో సిద్ధంగా ఉంచుకోండి, నీరసంగా అనిపించినపుడు తాగుతుండండి.
సంబంధిత కథనం