Winter Sickness । చలికాలంలో తరచుగా జబ్బుపడుతుంటే.. ఈ చిట్కాలు పాటించండి!-home remedies to prevent winter sickness and boost immunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Home Remedies To Prevent Winter Sickness And Boost Immunity

Winter Sickness । చలికాలంలో తరచుగా జబ్బుపడుతుంటే.. ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 06:48 PM IST

Winter Sickness: చలికాలంలో తరచుగా దగ్గు, జలుబు, జ్వరం బారినపడుతుంటే, దీనిని నివారించేందుకు ప్రతిరోజూ ఈ చిట్కాలను పాటించండి.

Home Remedies for Common Cold and Flu
Home Remedies for Common Cold and Flu

Winter Sickness: చలికాలంలో కొంతమందికి తరచుగా దగ్గు, జలుబు, జ్వరం ఇబ్బంది పెడుతుంటాయి. వివిధ రకాల ఔషధాలు వాడిన తర్వాత కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మళ్లీ కొన్నాళ్లకు వైరల్‌ ఫీవర్‌, ఫ్లూ లాంటివి సోకి మళ్లీ మంచాన పడతారు. దీనికి కారణం వారిలో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండటమే. ఇలాంటి వారు ఈ శీతాకాలం సీజన్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. బయట చేసే తినిబండారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంట్లోనే వేడివేడిగా ఆహారాన్ని స్వీకరించాలి. అధిక మసాలాతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి, నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినకూడదు. రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు, తాజా పండ్లు తింటూ ఉండాలి. మితమైన వ్యాయామం, నడక, యోగా వంటివి ఆచరించడం మంచిది.

రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, తరచుగా జ్వరం, దగ్గు అనుభవిస్తున్నవారు వారి రోజువారీ ఆహారంలో కొన్ని మూలికలను చేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలు అందిస్తున్నాం, వాటిని ప్రతిరోజూ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఇవి వారిని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

1) అల్లం

చలికాలంలో అల్లం తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలో సహజంగా వేడిని పుట్టిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అల్లం టీ తాగుతుండాలి. లేదా మీరు అల్లం ద్వారా చేసే కషాయాలను కూడా తీసుకోవచ్చు. అల్లంను రసంగా చేసి, గోరు వెచ్చని నీటిలో కలిపి కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగాలి.

2) వాము

వాము చాలా విధాలుగా శరీరానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వేడి నీళ్లలో వాము మిక్స్ చేసి సిప్ బై సిప్ తాగాలి

3) తులసి ఆకులు

తులసి అనేక ఔషధ గుణాలకు ప్రసిద్ధి. దగ్గు, జలుబు వంటి ఔషధాలలో తులసిని కూడా ఒక పదార్థంగా కలుపుతారు. కొన్ని తులసి ఆకులను రోజూ ఉదయాన్నే నమలడం వలన ఒత్తిడి తగ్గుతుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగడం వలన సీజనల్ ఫ్లూల నుంచి ఉపశమనం లభిస్తుంది.

4) దాల్చిన చెక్క

దాల్చినచెక్క వేడి గుణాలను కలిగి ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ వల్ల కలిగే గొంతు నొప్పి లేదా గొంతు నొప్పిని వదిలించుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క రుచి కొద్దిగా తీపిగా ఉంటుంది, కాబట్టి దాని పొడిని వేడి నీటిలో కలుపుకొని త్రాగవచ్చు. టీలో కూడా వేసుకోవచ్చు.

ఇక్కడ అందించిన సమాచారం మీ జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే. మీకు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

WhatsApp channel

సంబంధిత కథనం