Heartburn Quick Relief: హఠాత్తుగా ఛాతీలో మంట వచ్చిందా? త్వరగా ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఉండే వీటిని వాడండి-home remedies for quick relief from heartburn ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heartburn Quick Relief: హఠాత్తుగా ఛాతీలో మంట వచ్చిందా? త్వరగా ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఉండే వీటిని వాడండి

Heartburn Quick Relief: హఠాత్తుగా ఛాతీలో మంట వచ్చిందా? త్వరగా ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఉండే వీటిని వాడండి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2024 02:00 PM IST

Heartburn Quick Relief Tips: ఛాతీ మంట ఒక్కోసారి హఠాత్తుగా వస్తుంది. ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే, ఛాతీమంట నుంచి వెంటనే ఉపశమం పొందేందుకు కొన్ని టిప్స్ ఫాలో కావొచ్చు. ఇంట్లో ఉండే వాటితో రిలీఫ్ పొందొచ్చు.

Heartburn Quick Relief: హఠాత్తుగా ఛాతీలో మంట వచ్చిందా? త్వరగా ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఉండే వీటిని వాడండి
Heartburn Quick Relief: హఠాత్తుగా ఛాతీలో మంట వచ్చిందా? త్వరగా ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఉండే వీటిని వాడండి

ఛాతీలో మంట చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇది వచ్చినప్పుడు ఛాతిలో ఎక్కువ నొప్పిగా.. మండినట్టుగా అనిపిస్తుంది. చాలా సమస్యగా బాధిస్తుంది. ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అనే ఆందోళన నెలకొంటుంది. జంక్ ఫుడ్, కారం, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, ఫ్రైడ్స్ ఫుడ్స్ అతిగా తినడం వల్ల ఛాతీ మంట (యాసిడ్ రిఫ్లక్స్) సాధారణంగా వస్తుంది. కొందరికి ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అవుతుంది. అయితే, ఛాతీ మంట నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఇంట్లోని కొన్ని పదార్థాలు సహకరిస్తాయి.

బేకింగ్ సోడా

సాధారణంగా.. బేకింగ్ సోడా (వంట సోడా) అందరి వంటింట్లో ఉంటుంది. ఛాతీ మంట వచ్చినప్పుడు ఓ గ్లాస్ నీటిలో ఓ టీస్పూన్ బేకింగ్ సోడా వేసి దాన్ని తాగాలి. ఇది సహజమైన అంటాసిడ్‍ను సృష్టించి.. ఛాతీ మంట నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం

మంటను తగ్గించే యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు అల్లంలో మెండుగా ఉంటాయి. నీటిలో అల్లాన్ని ఉడికించుకొని అల్లం టీలా చేసుకొని తాగొచ్చు. దీనివల్ల ఛాతీలో మంట త్వరగా తగ్గుతుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా కూడా అల్లం చేయగలదు.

అరటి పండు

ఛాతీ మంటను అరపండు కూడా తగ్గించగలదు. ఈ పండులో సహజమైన యాంటాసిడ్ గుణాలు ఉంటాయి. పొటాషియం, కూడా ఎక్కువగానే ఉంటుంది. స్టమక్ యాసిడ్‍లను అరటి నిరోధించగలదు. అందుకే అరటి తిన్నా.. ఛాతీ మంట నుంచి ఉపశమనం కలుగుతుంది.

కలబంద జ్యూస్

కలబందలోనూ యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఛాతీ మంటను కలబంద జ్యూస్ తగ్గించేస్తుంది. అరకప్పు కలబంద (అలోవెరా) జ్యూస్‍ను గ్లాసు నీటిలో కలిపి తాగాలి.

ప్రోబయాటిక్స్

పేగుల్లోని మెక్రోబయోమ్‍లకు ప్రోబయోటిక్స్ మేలు చేస్తాయి. దీనివల్ల ఛాతీ మంట నుంచి ఉపశమనం కలిగించగలవు. యగర్ట్, కెరిఫ్, పెరుగు లాంటి ప్రోబయోటిక్స్ ఛాతీ మంట తగ్గించగలవు.

ఓట్‍మీల్

ఓట్ మీల్ తినడం వల్ల కడుపుకు సౌఖ్యంగా ఉండటంతో పాటు అదనంగా ఉన్న యాసిడ్లను ఇది శోషించుకుంటుంది. ఓట్‍మీట్‍లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు యాసిడ్ రీఫ్లక్స్‌ను నివారించగలదు. ఛాతీమంటను తగ్గించగలదు.

సోంపు

సోంపు గింజల్లో యాంటీమైక్రోబయల్, యాంటీఇన్‍ఫ్లమేటరి గుణాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తేపులను తగ్గించగలవు. అలాగే ఛాతీ మంట నుంచి ఉపశమనాన్ని కల్పించగలవు. సోంపును నేరుగా నమలవచ్చు. లేకపోతే సోంపుతో టీ కూడా చేసుకోవచ్చు. జీర్ణక్రియకు కూడా సోంపు చాలా మేలు చేస్తుంది.

యాపిల్ సిడెర్ వెనిగర్

జీర్ణానికి సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు యాపిల్ సిడెర్ వెనిగర్ తోడ్పడుతుంది. ఛాతీ మంట కూడా తగ్గేందుకు ఉపసరిస్తుంది. కడుపులో యాసిడ్లను ఇది నియంత్రించగలదు. నీటిలో యాపిల్ సిడెర్ వెనిగర్ కలుపుకొని తాగొచ్చు.

Whats_app_banner