HMPV Virus Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం-hmpv virus alert symptoms and precautions for children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hmpv Virus Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం

HMPV Virus Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం

Haritha Chappa HT Telugu
Jan 06, 2025 11:47 AM IST

HMPV Virus Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ భారత్ లో ప్రవేశించింది. దీని లక్షణాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రాణాంతక వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) చైనాలో పుట్టింది. ఇది ఇతర దేశాలకు చేరే అవకాశం ఎక్కువగానే ఉంది. దీని లక్షణాలపై అవగాహన ఉండడం వల్ల పిల్లలకు త్వరగా చికిత్స అందించవచ్చు.

మనదేశంలో హెచ్ఎంపీవీ కేసులు
మనదేశంలో హెచ్ఎంపీవీ కేసులు (Pixabay)

కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్నీ ఎప్పటికీ మర్చిపోలేము. ఐదేళ్ల వరకు ఇప్పటికీ కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ఇప్పుడు చైనాలో మరొక అలాంటి ప్రాణాంతక వైరస్ పుట్టింది. దాని పేరే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. దీన్ని హెచ్ఎంపివి (HMPV) అని పిలుస్తారు. ఈ కొత్త వైరస్ కు చెందిన కేసులు ఉత్తర చైనాలో అధికంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో కూడా కోవిడ్ 19 లక్షణాలే కనిపించడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడు మలేషియాకు ఈ వైరస్ చేరుకుంది. తాజాగా మన దేశంలో కూడా ఒక చిన్నారిలో హెచ్ఎంపీవీ లక్షణాలు బయటపడ్డాయి. బెంగుళూరులోని ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు.

yearly horoscope entry point

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాలో పుట్టిన ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలను హెచ్చరించింది. సోషల్ మీడియాలో చైనాలో ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్న వారి వీడియోలు వైరల్ గా మారాయి. ఫ్లూ వంటి లక్షణాలు ఈ రోగుల్లోనూ కనిపిస్తున్నాయి.

తొలిసారి చైనాలో డిసెంబర్ మూడో వారంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చైనా ప్రభుత్వం గుర్తించింది. వారిలో హ్యూమన్ మెటానిమో వైరస్, రైనో వైరస్ కేసులు అధికంగా ఉన్నట్టు గుర్తించింది. ముఖ్యంగా 14 లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్ అధికంగా ఉన్నట్టు కనుగొన్నారు.

దీంతో చైనా సరిహద్దు దేశాల్లో ఆందోళన పెరిగిపోయింది. చైనా నుంచి కరోనా వైరస్ అన్ని దేశాలకు ప్రయాణించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాకముందే ఇప్పుడు చైనాలో మరొక వైరస్ పుట్టడం ఆరోగ్య వ్యవస్థను భయపడుతోంది.

HMPV వైరస్ లక్షణాలు, చరిత్ర

  1. హెచ్ఎంపీవీ వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒక శ్వాసకోశ వ్యాధి.
  2. ఇది తీవ్రంగా మారి బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి వాటి బారిన కూడా పడతారు. ఈ ఇన్ఫెక్షన్ స్వల్పకాలం ఉండవచ్చు, లేదా దీర్ఘకాలం ఉండవచ్చు. ఇది కూడా ఒక మనిషి నుంచి ఒక మనిషికి చాలా సులువుగా సోకుతుంది.
  3. దగ్గు, ముక్కు ద్వారా, లాలాజలం ద్వారా కణాలు గాలిలో ప్రయాణించి ఇతరులకు చేరుకుంటాయి.
  4. షేక్ హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, ఒకరినొకరు తాకినప్పుడు...ఇది మనిషి నుండి ఇంకో మనిషికి సులువుగా చేరుతాయి.
  5. ముఖం, ముక్కు, కన్ను, నోటి ద్వారా ఈ వైరస్ శరీరంలో చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్లీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎవరీ షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలి. మాస్క్ పెట్టుకోవడం మొదలుపెట్టాలి.

హెచ్ఎంపీవీకి చికిత్స ఏంటి?

  1. చాలా కేసుల్లో తగిన విశ్రాంతి, డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం ద్వారా నయమవడం గుర్తించారు. కొన్ని కేసుల్లో మాత్రం హాస్పిటల్ లో చికిత్స అవసరమవుతుంది. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
  2. హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేం కాదు. 2001లో నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ను గుర్తించినట్టు అమెరికన్ లంగ్ అసోసియేషన్ పేర్కొంది.
  3. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వాటికి అనుగుణంగా మసులుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం