HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస వ్యవస్థతో పాటు కిడ్నీలపైన కూడా ప్రభావం చూపిస్తుందా?, ఎలా బయటపడాలి?-hmpv and kidney health is there a link between the conditions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hmpv Virus: హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస వ్యవస్థతో పాటు కిడ్నీలపైన కూడా ప్రభావం చూపిస్తుందా?, ఎలా బయటపడాలి?

HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస వ్యవస్థతో పాటు కిడ్నీలపైన కూడా ప్రభావం చూపిస్తుందా?, ఎలా బయటపడాలి?

Ramya Sri Marka HT Telugu
Jan 17, 2025 10:30 AM IST

HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస వ్యవస్థ మీదే ప్రభావం చూపిస్తుందని అనుకోవద్దు. శరీరంపై పలు రకాలుగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయట. మరి కిడ్నీలపై ఎంత వరకూ ప్రమాదమో తెలుసుకోవాలంటే చదవండి.

హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస వ్యవస్థతో పాటు కిడ్నీలపైన కూడా ప్రభావం చూపిస్తుందా
హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస వ్యవస్థతో పాటు కిడ్నీలపైన కూడా ప్రభావం చూపిస్తుందా (Pixabay)

హెచ్ఎంపీవీ వైరస్ గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఇదేమీ కొత్త వైరస్ కానే కాదు. గతేడాదిలో చాలా మంది ఈ వైరస్ బారిన పడిన వారున్నారు. ఇండియాలో మాత్రమే రీసెంట్‌గా హ్యుమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) కేసులు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వెంటనే ముందుగా శ్వాసకోస వ్యవస్థపైనే ప్రభావం చూపిస్తుందట. కొన్ని కేసులలో మాత్రమే పరోక్షంగా కిడ్నీలకు కూడా ముప్పు తీసుకొస్తుందట. వైరస్ బారిన పడిన వారికి కలిగే జ్వరం, డీ హైడ్రేషన్‌లు రావడం శ్వాసకోస వ్యవస్థ కారణంగా జరిగితే, శరీరంలో ద్రవాల కొరత సంభవించడం మాత్రమే కిడ్నీల వల్లనేనని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటుగా కొందరిలో సెప్సిస్ (Sepsis) అనే సమస్య కలిగి ఇన్‌ఫ్లమ్మేషన్‌కు కూడా గురి అవుతారట.

yearly horoscope entry point

హెచ్ఎంపీవీ వైరస్ అనేది పూర్తిగా రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే కిడ్నీలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అంతటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే, హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ తొలిదశలో ఉన్నప్పుడే తెలుసుకుని కిడ్నీలను కాపాడుకోవచ్చు.

హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏమిటి?

HMPV లేదా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ అనేది న్యూమోవిరిడే అనే కుటుంబానికి చెందినది. తుమ్ముల ద్వారా వచ్చే తుంపరలు, లాలాజలం ద్వారా, క్లోజ్ కాంటాక్ట్ ద్వారా వ్యాప్తి చెందుతున్న వైరస్ బారినపడి చైనాలో చాలా మంది సతమతమవుతున్నారు. ఇది ముకోసా (నాసికా కుహరం అంటుకుని ఉండే తేమ భాగం). దీనికి అంటుకునే వైరస్ క్రమంగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందట. అలా వెళ్లిన వైరస్ 3 నుంచి 6 రోజుల్లో దాని ప్రభావం చూపించి శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మరి, హెచ్ఎంపీవీకి కిడ్నీలకు ఏంటి సంబంధం?

HMPV వల్ల కిడ్నీల ఆరోగ్యం అనేది కచ్చితంగా పాడవుతుందని చెప్పలేరు. కానీ, కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం ఈ ప్రభావం కనిపించిందట. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి లేదా కిడ్నీ ఆరోగ్యం ముందుగానే బలహీనంగా ఉన్నవారిలో ఈ మార్పు కనిపించిందట. ఈ విధంగా వైరస్ బారిన పడి యాక్యుట్ కిడ్నీ ఇంజురీ (AKI), సైటికిన్ స్టార్మ్ వంటి ప్రమాదాలకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు.

కిడ్నీలకు ప్రమాదం కలగకుండా ఉండేందుకు ఏమేం చేయాలి?

హెచ్ఎంపీవీ వైరస్ వల్ల మూత్రపిండాల ఆరోగ్యం చెడిపోకుండా ఉండాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల డీహైడ్రేషన్, సెప్సిస్, ఇన్‌ఫ్లమ్మేషన్ కలుగుతుంది. కాబట్టి ఆ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్ గా ఉండగలం. సెప్సిస్ (ఇన్పెక్షన్ కలిగినట్లుగా) లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడ్ని కలవాలి. వైద్యుడు సూచించిన మందులను తప్పనిసరిగా వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు కంటికి సరిపడా నిద్రపోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను బలపరుచుకోగలం. తద్వారా కిడ్నీలు డ్యామేజ్ కు గురయ్యే అవకాశాలు క్రమంగా తగ్గుతాయి.

వైద్యులు వద్దకు వెళ్లినప్పుడు ఇది మర్చిపోకండి:

మీకు ఇన్ఫెక్షన్ సోకిందనే అనుమానంతో వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు, మూత్రపిండాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే తెలియజేయండి. రక్త పరీక్షలు చేయడం ద్వారా మూత్రపిండాలలో ఉన్న క్రియాటినైన్, బ్లడ్ యూరియా నైట్రోజన్ స్థాయిలు తెలుసుకోవచ్చు. వైద్యుడు సూచనలను బట్టి అవసరమైతే మిగిలిన పరీక్షలు చేయించుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం