Breastfeeding: పాలిచ్చే తల్లులు తీపి ఎక్కువ తింటే పిల్లలకు షుగర్ వస్తుందా?-high sugar diet for breastfeeding mother can lead to diabetes in child know reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breastfeeding: పాలిచ్చే తల్లులు తీపి ఎక్కువ తింటే పిల్లలకు షుగర్ వస్తుందా?

Breastfeeding: పాలిచ్చే తల్లులు తీపి ఎక్కువ తింటే పిల్లలకు షుగర్ వస్తుందా?

Breastfeeding: ప్రెగ్నెన్సీ సమయం నుంచి పాలిచ్చే దాకా తల్లీ తీసుకునే ఆహారం ప్రభావం శిశువు మీద ఉంటుందట. అదెలాగో తెల్సుకోండి.

శిశువు ఆరోగ్యం మీద తల్లి పోషకాహార ప్రభావం (Unsplash)

శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రసవించిన తర్వాత కూడా తల్లి తినే ఆహారం ప్రభావం శిశువు మీద ఉంటుంది. హెచ్‌టీ లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గైనకాలజిస్టు డాక్టర్ నీతిక ఈ విషయాల్ని పంచుకున్నారు.

ప్రెగ్నెన్సీ నుంచి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏం తినాలి, ఏం తినకూడదు? ఎంత తినాలి? ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోవాలి ? అనే విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడుపుతో ఉన్నవాళ్లు, కొత్తగా తల్లయిన వాళ్లు ఆహారానికి సంబంధించి పూర్తి మెలకువలు తెల్సుకోవడానికి వైద్యులను సంప్రదించాలి. వీటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందోనని డాక్టర్ వివరించారు.

కడుపుతో ఉన్నప్పుడు ఆహారం:

ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాహారం లేని ఆహారం తీసుకుంటే దాని ప్రభావం శిశువు మీద పడుతుంది. ఐరన్, ఐయోడిన్, ఫోలేట్, జింక్, క్యాల్షియం లాంటివి ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు. వాటి లేమి వల్ల ప్రి ఎక్లాంప్సియా, ఎదుగుదలలో ఆలస్యం అవ్వడం, కాగ్నిటివ్ సమస్యలు, శిశువు మరణించి పుట్టడం లాంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు.

గర్భదారణ సమయంలో పోషకాలు సరిగ్గా తీసుకోవాలి. తల్లితో పాటూ కడుపులో ఉన్న శిశువుకు సరిపడా రెట్టింపు పోషకాహారం తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఒమేగా 3, జింక్ లాంటి పోషకాలుండాలి. వీటి లోపం వల్ల పిల్లల కాగ్నిటివ్ ప్రవర్తనా తీరు మెరుగుపడదు. అలాగే ఎలర్జీలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

తల్లి ఇలాంటి ఆహారం తింటే..:

తల్లి గనక ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, షుగర్ ఎక్కువున్న ఆహారాలు తీసుకుంటే శిశువుకు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తల్లి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

పాలిచ్చే సమయంలో:

పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారం ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది. అది పాల నాణ్యతను మారుస్తుంది. తల్లిపాలే శిశువుకు ప్రాథమిక పోషకాలిచ్చే ఆహారం. తల్లి గనక సరైన పోషకాలున్న ఆహారం తీసుకోకపోతే శిశువు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శారీరక ఎదుగుదల ఉండదు. ఆహారం జీర్ణం అవ్వడంలో సమస్యలు, పోషకాహార లోపాలు రావచ్చు.