Hiccups Remedies: నీళ్లు తాగినా కూడా ఎక్కిళ్లు ఆగడం లేదా? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు
Hiccups Remedies: ఎక్కిళ్ళు రావడం సాధారణం. కొద్దిగా నీళ్లు తాగితేనే వాటంతట అవే ఆగిపోతాయి. కొంత మందిలో నీరు తాగినా కూడా ఎక్కిళ్లు ఆగవు. ఎక్కిళ్ళను వెంటనే ఆపే సులభమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి.
ఎక్కిళ్ళు రావడం చాలా సాధారణం. ఇవి ఎప్పుడైనా రావచ్చు. ఇది కొంచెం నీరు తాగితే చాలు వెంటనే ఆగిపోతాయి. కొందరిలో ఎక్కిళ్లు ఒకంతట ఆగవు. చాలా అసౌకర్యంగా అనిపిస్తాయి. దీని వల్ల పొట్ట కూడా ఇబ్బంది పడుతుంది. మీకు తరచూ ఎక్కిళ్ళు వస్తూ ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక్కడ మేము మీకు కొన్ని ఇంటి చిట్కాలు చెప్పాము. వీటి వల్ల మీకు వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి.
ఎక్కిళ్లు వస్తున్నప్పడు నీరు తాగిన తర్వాత కూడా మీకు సౌకర్యంగా అనిపించకపోతే, ఖచ్చితంగా మీ శ్వాసను కొద్దిసేపు ఆపడానికి ప్రయత్నించండి. ఇందుకోసం ఒకచోట కూర్చొని కొన్ని సెకన్ల పాటూ శ్వాస ఆపడానికి ప్రయత్నించండి. పది నుంచి 20 సెకన్ల పాటూ అలాఉంచి తిరిగి ఊపిరి పీల్చుకోండి. ఇలా కొన్నిసార్లు కొనసాగించండి. కొద్ది సేపటికే మీ ఎక్కిళ్లు తగ్గుతాయి.
ఎక్కిళ్ళను ఆపడానికి మరో పద్ధతి కూడా ఉంది. మీరు చేయాల్సిందల్లా ఒక గ్లాసు నీరు త్రాగాలి. కానీ సాధారణ పద్ధతిలో కాకుండా ముక్కును చేత్తో మూసుకుని నీటిని సిప్ చేయాలి. అలా చేస్తే మీ ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీ ఎక్కిళ్ళు ఆగకపోతే, నిమ్మకాయ మీకు సహాయపడుతుంది. నిమ్మకాయ ముక్కను కట్ చేసి దానికి కొద్దిగా ఉప్పు కలిపి పీల్చుకుంటూ ఉండాలి. కొద్ది సేపటికే ఎక్కిళ్లు రావడం ఆగిపోతాయి. ఎక్కిళ్ళు ఆపడానికి పంచదారతో కూడా ప్రయత్నించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా పంచదార తినడం. కొద్ది సేపటికే మీ ఎక్కిళ్లు ఆగిపోతాయి. కావాలనుకుంటే ఒక గ్లాసు చల్లటి నీటిలో పంచదార కరిగించి షుగర్ సిరప్ లా చేసుకుని తాగొచ్చు.
మీరు ఇంటి వెలుపల ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా ఎక్కిళ్లను ఆపే అవకాశం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఒక చేత్తో మరో అరచేతి మధ్యలో లైట్ ప్రెజర్ అప్లై చేయాలి. మరీ గట్టిగా నొక్కే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే కొద్ది సేపట్లోనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.