2024 అక్టోబర్‌లో విద్యా బాలన్ తన బరువు తగ్గింపు గురించి మాట్లాడుతూ, తన కొత్త డైట్ గురించి వెల్లడించింది. జిమ్‌కు వెళ్ళకుండానే ఆమె ఎలా బరువు తగ్గిందో చెప్పింది. ఇప్పుడు, మార్చి 22న హీరోయిన్ జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల్ తన డైట్ సీక్రెట్ గురించి రివీల్ చేసింది. ఇందుకు కారణం విద్యా బాలన్ అంటూ చెప్పుకొచ్చింది. జ్యోతిక బరువు తగ్గడానికి విద్యాబాలన్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా ఆగండి.
గతంలో జ్యోతిక తాను ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా శరీర బరువును తగ్గించలేకపోతున్నాని అన్నారు. దీంతో విద్యా బాలన్ తనను పోషకాహార నిపుణులు, ఫిట్‌నెస్ నిపుణుల బృందాన్ని జ్యోతికకు పరిచయం చేసిందట. విద్యా బాలన్ లాగే ఈమె కూడా తన డైట్, ఫిట్‌నెస్‌లో మార్పులు చేసుకుని కేవలం '3 నెలల్లోనే 9 కిలోల బరువు తగ్గారట.ఈ విషయాన్ని జ్యోతిక తన సోషల్ మీడియా ఖాతాలు పోస్టు చేశారు.
తన ట్రైనర్, చెన్నైకు చెందిన పోషకాహార నిపుణులైన అమురా హెల్త్ బృందంతో కలిసి దిగిన ఫోటోలతో పాటు జ్యోతిక ఇలా రాసింది, “అమురా, 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గించడానికి, నా అంతర్గత స్వీయతను మళ్లీ కనుగొనడానికి సహాయపడినందుకు ధన్యవాదాలు! మీ అందరూ మ్యాజిక్ లాంటివారు.” అంటూ పోస్ట్ చేసింది.
45 ఏళ్లు పైబడిన జ్యోతిక తన వెయిట్ లాస్ జర్నీ వివరాలను సోషల్ మీడియాతో పంచుకుంటూ ఇలా రాసింది: “ముందుగా, నన్ను అమురా మ్యాజికల్ టీంకు పరిచయం చేసిన నటి విద్యా బాలన్‌కి ధన్యవాదాలు. బరువు తగ్గడం అనేది ఎల్లప్పుడూ నాకు కష్టమైన పనిగా ఉండేది. భారీ వ్యాయామాలు, కఠినమైన డైట్లు, అపరిమితమైన ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ఇవేవి నా అదనపు బరువును తగ్గించడంలో సహాయపడలేదు. చివరికి ఇది అమురా టీం కారణంగా సాధ్యమైంది.”
అదనపు బరువును ఆమె ఎలా తగ్గించిందో చెప్పుకుంటూ “నేను నా గట్, జీర్ణక్రియ, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. ముఖ్యంగా, నా శ్రేయస్సు, మానసిక స్థితిపై వీటి ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, నేను నేడు చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.”
జ్యోతిక బరువు శిక్షణ మహిళల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనదని, ఇది తనకు అందజేసిన తన ట్రైనర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. “ఆరోగ్యకరమైన జీవితం అంటే సమతుల్యత; బరువు తగ్గడం, డైట్లు అవసరమే అయినప్పటికీ, బలాన్ని పక్కన పెట్టకూడదు. అంటే శరీరానికి శక్తి అందేలా చూసుకోవడం చాలా అసవరం. ఇది మహిళల స్వతంత్ర భవిష్యత్తుకు చాలా కీలకమైనది అని నాకు నేర్పినందుకు, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించినందుకు నా ట్రైనర్ మహేష్‌కు నేను ఎంతో కృతజ్ఞురాలిని.
తాను ఎన్నో వ్యాయామాలు, డైట్లు చేసినా బరువు తగ్గకపోవడానికి తన శరీర తీరు తనకి తెలియకపోవడమే అని చెప్పకుంటూ జ్యోతిక ఇలా అన్నారు.. “మన ఆలోచనలు, అలవాట్లు, మానసిక స్థితిలను నియంత్రిడంతో పాటు సెల్ఫ్ లవ్, ఒత్తిడిని తగ్గించుకోవడం మన ప్రధాన లక్ష్యం కావాలి. అప్పుడు బరువు తగ్గడమనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది.” అంటూ ఆమె అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. “నా శరీరం, దాని పనితీరును అర్థం చేసుకోవడం, వాటికి తగినట్టుగా వ్యాయామాలు చేయడం అనేవి నాకు మంచి అనుభవాన్ని కలిగించాయి” అన్నారు.
జ్యోతిక బరువు తగ్గిన విధానాన్ని బట్టి మీ శరీరం, మీ జీవనశైలి, మీ ఆలోచనలను బట్టి మీ వ్యాయామాలు, డైట్ ను ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పొందగలరు. ఇంకెందుకు ఆలస్యం మీ శరీర తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టేయండి మరీ.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం