Hero Splendor Plus XTEC | అదిరిపోయే ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్‌తో స్ల్పెండర్ బైక్
ఇండియాలో పాపులర్ ద్విచక్రవాహనం అయిన హీరో హోండా స్ల్పెండర్ ప్లస్ మోడెల్‌లో ఇప్పుడు మరింత కొత్తగా అప్‌డేట్ అయింది. ఏ 100సిసి బైక్‌లో లేని విధంగా ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.. అదిరిపోయే ఫీచర్లు.. ఆకర్షణీయమైన లుక్‌తో సరికొత్తగా స్ల్పెండర్ బైక్
మార్కెట్లో ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా, యూటూబ్‌లో బుల్లెట్ బండి మీద ఎన్ని పాటలు వచ్చినా ప్రజల్లో హీరో హోండా 100సిసి స్ల్పెండర్ బైక్ మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు. మన దేశంలో మైలేజీని ఇచ్చే బైక్‌లనే ఎక్కువ మంది జనం కోరుకుంటారు. అందులో చాలా మందికి హీరో హోండా స్ల్పెండర్ బైకే ఫస్ట్ చాయిస్. ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, తక్కువ ఖర్చు అవుతుంది, చాలా కాలం పాటు మన్నికగా ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా హీరో మోటార్ కార్ప్ స్ల్పెండర్ మోడల్‌లో సరికొత్త ఎడిషన్ 'Hero Splendor Plus XTEC' ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. సాధారణంగా 100cc కేటగిరీలో ఏ బైక్‌లలో అందించని ఫీచర్లను ఈ సరికొత్త XTEC మోడల్‌లో అందిస్తున్నారు. ఈ ద్విచక్ర వాహనంలో పూర్తి డిజిటల్ మీటర్‌ను ఇచ్చారు. అందులో ఇంధనం ఎంత శాతం ఉందో చెక్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ ద్వారా రైడర్ తన స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకొని నేరుగా కాల్స్ తీసుకోవడం, చేయడం చేయవచ్చు, మెసేజులు చదవచ్చు.
అంతే కాకుండా ఈ మోటార్‌సైకిల్‌లో కచ్చితమైన మైలేజ్ తెలుసుకునేలా RTMI (రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్)తో పాటు రెండు ట్రిప్ మీటర్లు కూడా ఉన్నాయి. బైక్‌కి ఇచ్చిన USB పోర్ట్ ద్వారా రైడర్‌లు ప్రయాణంలో ఉన్నప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు వీటితో పాటు అనేక ప్రాక్టికల్ ఫంక్షన్‌లను ఆపరేట్ చేయవచ్చు.
డిజైన్
ఈ బైక్‌కు ఇతర స్ల్పెండర్ బైక్‌లతో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన లుక్ కల్పించారు. బైక్ ముందు భాగంలో LED స్ట్రిప్‌తో పాటు LED హై-ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్ (HIPL) ఇచ్చారు. ఈ ఎల్‌ఈడీ స్ట్రిప్ ఉండటం వల్ల బైక్ మరింత స్పోర్టివ్‌గా కనిపిస్తుంది.
ఇంజన్ కెపాసిటీ
Hero Splendor Plus XTECలో 7.9 PS శక్తిని ఉత్పత్తి చేసే 97.2cc BS-VI ఇంజిన్ అమర్చారు. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
ఈ మోటార్‌సైకిల్‌ను సాంకేతికపరంగా i3s టెక్నాలజీతో రూపొందించారు. ఇది బైక్‌కు మెరుగైన మైలేజీని అందించడంలో సహాయపడుతుంది.మోటార్‌సైకిల్‌కు సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజిన్ ఆన్ అవ్వదు.
సస్పెన్షన్ విషయానికొస్తే, మోటార్‌సైకిల్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది.
Splendor Plus XTEC ఎక్స్-షోరూమ్ ధర, రూ. 72,900/- ఈ బైక్‌పై 5 సంవత్సరాల వారంటీని కూడా హీరో మోటోకార్ప్ అందిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్