లీటరు పెట్రోల్‌తో 83 కి.మీ మైలేజ్.. అదరహో అనిపిస్తున్న Hero HF డీలక్స్ ఫీచర్స్-hero hf deluxe long mileage bike know full details here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Hero Hf Deluxe Long Mileage Bike Know Full Details Here

లీటరు పెట్రోల్‌తో 83 కి.మీ మైలేజ్.. అదరహో అనిపిస్తున్న Hero HF డీలక్స్ ఫీచర్స్

Rekulapally Saichand HT Telugu
Dec 28, 2021 02:08 PM IST

పెరుగుతున్న ఇంధన ధరలను ఆపడం మన చేతుల్లో లేకపోయినప్పటికీ, తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకోవడమే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్. అందుకు తగ్గట్టుగా దేశీయ ద్విచక్ర కంపెనీలు కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లకు తయారుచేస్తున్నాయి. అందులో Hero HF డీలక్స్ ఒకటి.

Hero HF డీలక్స్
Hero HF డీలక్స్

ఇంధన ధరలు మండిపోతున్నాయి. నానాటికి పెరుగుతున్న ఇంధన ధరలను చూసి సామాన్యుడు విలవిలాడుతున్నాడు. వివిధ పనుల కోసం ఉపయోగించే ద్విచక్ర వాహనాలలో పెట్రోల్ పోసి.. పోసి సామాన్యుడి నడ్డి విరుగుతుంది. వారి సగం సంపాదన ఇంధన ఖర్చులకే పోతుంది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలను ఆపడం మన చేతుల్లో లేకపోయినప్పటికీ, తక్కువ ఇంధనంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకోవడమే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్. అందుకు తగ్గట్టుగా ద్విచక్ర కంపెనీలు కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను తయారుచేస్తున్నాయి. అందులో Hero HF డీలక్స్ ఒకటి. ఈ బైక్ అందుబాటు ధరకే లభించడమే కాక, ఎక్కువ మైలేజ్‌ ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ అయిన హీరో మోటోకార్ప్‌కి చెందిన 'Hero HF డీలక్స్' లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బైక్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది? స్పెసిఫికేషన్లు ఏంటి? ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!

Hero HF డీలక్స్‌ బైక్ స్పెసిఫికేషన్లు:

 

Hero HF డీలక్స్‌ను 'ఎక్స్‌సెన్స్' టెక్నాలజీతో రూపొందించిన సింగిల్ సిలిండర్ ఫ్యుఎల్ ఇంజెక్ట్ ఇంజన్‌తో అందిస్తున్నారు. ఇది 97.2cc సామర్థ్యం కలిగి BS-VI మోడెల్‌లో లభిస్తుంది. దీనిలోని ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజన్‌ 8000 rpm సామర్థ్యంతో వేగ వంతమైన పనితీరును కనబరుస్తుంది.  ఇది 8.24 bhp వద్ద 8.05Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇక ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం దీని మైలేజ్. ఇది ఒక లీటర్ పెట్రోల్‌లతో గరిష్ఠంగా 83 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది. దీని ఇంజన్ లోని XSens టెక్నాలజీ  9 శాతం ఇంధనాన్ని అదనంగా ఆదా చేయడంలో ఉపకరిస్తుందని తెలిపింది. Hero HF డీలక్స్ 5 వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌‌ను బట్టి ఎక్స్ షోరూం వద్ద ధరలు రూ. 50,900 ప్రారంభమవుతున్నాయి.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్