Pigmentation: ముఖంపై ఉన్న మొటిమల సమస్యను తొలగించి సహజమైన మెరుపును అందించే రహస్యం ఇదిగొ
Pigmentation: ఒత్తిడితో కూడిన జీవితం, పెరుగుతున్న కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ముఖం కాంతి విహీనంగా మారుతుంది. అలాగే ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
మచ్చలేని, అందమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసంసీరం, ఫేస్ ప్యాక్ లను విరివిగా కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ మనిషికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమవుతాయి. రసాయనాలు నిండిన ఉత్పత్తులు వాడే కన్నా ఆయుర్వేద పద్ధతుల్లో ముఖాన్ని మెరిపించుకోవచ్చు. సాంప్రదాయ మందులతో నిండిన కేరళ స్పెషల్ కుంకుమాది తెల్లం ప్రయత్నించండి. ఆయుర్వేదంలో దీన్ని కుంకుమపువ్వు నూనె అంటారు. కుంకుమాది నూనెలో ఎన్నో అద్భుత లక్షణాలు ఉన్నాయి.
కుంకుమపువ్వుతో పాటు మంజిస్తా, గంధం, గులాబీ, బహెరా, లైకోరైస్, మైరోబాలన్, పసుపు వంటి మూలికలను ఈ నూనె తయారీలో ఉపయోగిస్తారు. ఇది చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది. కుంకుమాది నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. దాన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మానికి మెరుపు వస్తుంది.
కుంకుమాది తైలంతో లాభాలు
కుంకుమాది తైలం ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషదం. ఇది మొటిమలు, రోసేసియా, సోరియాసిస్, తామర, మచ్చలు, ముడతలు, వృద్ధాప్య సంకేతాలు వంటివి రాకుండా అడ్డుకునే శక్తి దీనికి ఉంది. కుంకుమాది తైలం మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది, అలాగే చర్మంలో మంటను తగ్గిస్తుంది. గాయాలు నయం చేయడంలో ముందుంటుంది.
సమృద్ధిగా పోషకాలు
కుంకుమాది తైలంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ-హైపర్పిగ్మెంటేషన్, మాయిశ్చరైజర్, డీమెథైల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ-ప్రురిటిక్, సహజ సన్ స్క్రీన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ సూర్యరశ్మి, కాలుష్యం నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
కుంకుమాది నూనె చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతూ కోల్పోయిన సహజ ప్రకాశాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఈ మ్యాజికల్ ఆయిల్ వృద్ధాప్య సంకేతాలను నివారించడం ద్వారా చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.
హైపర్ పిగ్మెంటేషన్
కుంకుమాది తైలం అనేది ఒక రకమైన మూలికా చికిత్స. ఇది ప్రతి చర్మ రకంపై ఉపయోగించవచ్చు. ఈ నూనె ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా సురక్షితమైనది. సహజమైనది. మీకు స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలు ఉంటే, ఈ సమస్యను అధిగమించడానికి కుంకుమాది తైలం ఒక ప్రభావవంతమైన మార్గం. నూనెలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు ముఖం రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖంపై మచ్చలు ఉంటే ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే రెండు మూడు రోజుల్లో మాయమవుతాయి.
చర్మాన్ని మెరిసేలా…
కుంకుమాది తైలం చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఉపయోగించవచ్చు. భారతదేశంలో, వేలాది సంవత్సరాలుగా చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మార్చడంలో ఇది ముందుంటుంది. ఈ నూనెను సమాన పరిమాణంలో బాదం నూనెతో కలిపి తీసుకుంటే తక్షణ ఫలితాలు లభిస్తాయి.
ముఖానికి కుంకుమాది నూనెను ఎలా ఉపయోగించాలి?
కుంకుమాది నూనెను నేరుగా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. దీని కోసం, మొదట మీ ముఖాన్ని బాగా కడిగిన తర్వాత తుడుచుకోవాలి. ఆ తర్వాత కుంకుమాది తైలాన్ని ముఖానికి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు ఆ నూనెను ముఖానికి పట్టించి 2 గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాల ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
టాపిక్