Morning Protein Diet | కండరాలు దృఢంగా మారేందుకు.. గ్లూటన్​ ఫ్రీ స్మూతి-heres recipe for gluten free smoothie for muscle building ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here's Recipe For Gluten Free Smoothie For Muscle Building

Morning Protein Diet | కండరాలు దృఢంగా మారేందుకు.. గ్లూటన్​ ఫ్రీ స్మూతి

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 11, 2022 09:47 AM IST

మార్నింగ్ ప్రొటీన్​ డైట్​లో భాగంగా కండరాలు దృఢంగా మార్చే స్మూతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే దీనిని సేవించడం వల్ల మీ ఆకలి తీరుతుంది. పైగా పూర్తి ప్రోటీన్లతో నిండి ఉన్న ఈ స్మూతి రోజూ తీసుకుంటే మీ కండరాలు దృఢంగా మారుతాయి. పైగా ఇది గ్లూటన్ ఫ్రీ కూడా. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కండరాలు దృఢంగా మారేందుకు స్మూతి
కండరాలు దృఢంగా మారేందుకు స్మూతి

Morning Protein Diet | ఈ కాలంలో చాలా మందిలో కండరాల బలహీనత కామన్ అయిపోయింది. వీరంతా కండరాలు బలంగా చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారంలో లేదా ఆహారంతో పాటుగా కొన్ని రకాల ఆహారపదార్థాలను జతచేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే తీసుకోవాల్సిన ఈ స్మూతిలోనే కండరాలను దృఢంగా చేసే అన్ని ప్రోటీన్లు ఉంటాయి అంటున్నారు. ఆ స్మూతి తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ కండరాల బలహీనతకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసులో వారికైనా ఎప్పుడైనా ఇది రావొచ్చు. కొందరు తేలకపాటి లక్షణాలతో ఎక్కువ కాలం ఇబ్బందులు పడతారు. మరికొందరు సరిగా నడవలేరు. మాట్లాడలేరు, ఏ పని చేయలేరు. అలాంటి వారే కాకుండా అందరూ కండరాల బలం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ స్మూతీని మీ ముందుకు తీసుకొచ్చాం. దాని తయారీ ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

* వేయించిన శెనగలు- 2 టేబుల్​ స్పూన్స్

* వేయించిన పల్లీలు-2 టేబుల్​ స్పూన్స్

* పుచ్చకాయ గింజలు- 1 టేబుల్ స్పూన్

* ఓట్స్- 2 టేబుల్ స్పూన్స్

* ఖర్జూరం-1

* పాలు-1 కప్పు

* అరటిపండు-100 గ్రాములు (ముక్కలుగా కోయాలి)

* చియా సీడ్స్-2 టేబుల్ స్పూన్స్ (నానబెట్టాలి)

తయారీ విధానం

ముందుగా వేయించిన శెనగలు, వేయించిన వేరుశెనగలు, పుచ్చకాయ గింజలు, ఓట్స్, ఖర్జూరాన్ని మిక్సీ జార్​లో వేసి పౌడర్​లా చేసుకోవాలి. దానిలో పాలు వేసి.. అరటిపండును వేసి.. మరోసారి మిక్సీ చేయాలి.

ఇప్పుడు ఒక గ్లాస్​లో నానబెట్టిన చియా సీడ్స్ వేసుకుని.. మిక్సీలోని స్మూతీని దానిలో వేసుకోవాలి. మీకు నచ్చిన నట్స్​తో దానిని గార్నిష్ చేసుకుని.. లేదా మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే కండరాలను దృఢంగా చేసే స్మూతీ రెడీ.

మరిన్ని వివరాలు

* మొత్తం కేలరీలు- 580 గ్రాములు

* మొత్తం ప్రొటీన్-20.6 గ్రాములు

* మొత్తం ఫ్యాట్- 23.7 గ్రాములు

* మొత్తం కార్బ్స్-71.6 గ్రాములు

* మొత్తం ఫైబర్- 8.1 గ్రాములు

రోజూ ఉదయాన్నే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యానికి చాలామంచిది. అంతేగాకుండా బరువు పెరగాలనుకునే వారు కూడా దీనిని ట్రై చేయవచ్చు.

WhatsApp channel