Holi Wishes telugu: అందమైన హోలీ విషెస్ కోసం వెతుకుతున్నారా? తెలుగులోనే రంగుల పండుగకు శుభాకాంక్షలు చెప్పేయండి-heres how to wish your friends and relatives holi in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi Wishes Telugu: అందమైన హోలీ విషెస్ కోసం వెతుకుతున్నారా? తెలుగులోనే రంగుల పండుగకు శుభాకాంక్షలు చెప్పేయండి

Holi Wishes telugu: అందమైన హోలీ విషెస్ కోసం వెతుకుతున్నారా? తెలుగులోనే రంగుల పండుగకు శుభాకాంక్షలు చెప్పేయండి

Haritha Chappa HT Telugu
Published Mar 14, 2025 05:00 AM IST

Holi Wishes telugu: హోలీ సందర్భంగా అద్భుతమైన సందేశాలను ప్రియమైన వారికి పంపేందుకు అందరూ సిద్ధమవుతారు. ఇక్కడ మేము హోలీ విషెస్ తెలుగులో అందించాము. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని పంపండి.

హోలీ పండుగ శుభాకాంక్షలు
హోలీ పండుగ శుభాకాంక్షలు (Pixabay)

హోలీ విషెస్ కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము అర్థవంతమైన, అందమైన సందేశాలను ఇచ్చాము. వీటిని మీ ప్రియమైన వారికి పంపిస్తే వారు ఎంతో ఆనందిస్తారు. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండుగను నిర్వహించుకుంటారు. ఈ అందమైన రంగుల పండుగ మీ జీవితంలో కూడా రంగులను నింపాలని, ఆనందాన్ని నింపాలని మేము కోరుకుంటున్నాం. పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రియమైన వారికి ప్రత్యేక హోలీ విషెస్ ను తెలియజేసేందుకు ఇక్కడ మేము కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము. ఇది మీకు కచ్చితంగా నచ్చుతాయి. మీకే కాదు మీరు పంపే మీ ప్రియమైన వారికి కూడా ఇవే నచ్చుతాయి.

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుగులో

1. బృందావనంలోని అందం

రాధలోని ఆరాధన

కృష్ణుడి ప్రేమ

అన్నీ కలగలిపిన పండుగే హోలీ

మీకు మీ కుటుంబ సభ్యులకు

హోలీ పండుగ శుభాకాంక్షలు

2. మీకు అడుగడుగునా ఆనందమే దక్కాలి

ఎప్పుడూ దుఃఖం ఎదురవకూడదు

మీ జీవితంలోని ప్రతిక్షణం సంతోషంతో ఆశీర్వదించాలి

మీకు హోలీ శుభాకాంక్షలు

3. హోలీ అంటే ఆనందపు రంగులతో

ముందుకు సాగాల్సిన సమయం

మీకు ప్రకాశవంతమైన ఈ పండుగ వేళ

అంతా మంచే జరగాలని కోరుకుంటూ

హ్యాపీ హోలీ శుభాకాంక్షలు

4. అందమైన క్షణాలు, జ్ఞాపకాలతో నిండిన

హోలీ పండుగ శుభాకాంక్షలు అందుకోండి

5. హోలీ అంటే గత బాధలను

మనోవేధనలను వదిలేసి

ప్రేమ, స్నేహంతో కొత్తగా ఆరంభించే జీవితం

మీకు మీ కుటుంబ సభ్యులకు

హోలీ పండుగ శుభాకాంక్షలు

6. సప్త వర్ణాలు చిరుజల్లులుగా మారి

దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ

ఆత్మీయులతో ప్రేమానుబంధాలు

వసంతంలా వికసించాలా చేసే సంబరం హోలీ

రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోలీ

అందరికీ అందమైన హోలీ పండుగ శుభాకాంక్షలు

7. సుఖం, దుఃఖం, సంతోషం, విచారం

అన్నీ కలిసిన రంగులే ఈ హోలీ

అందరికీ రంగుల పండుగ హోలీ శుభాకాంక్షలు

8. సప్తవర్ణాల శోభితమైన పండుగ

సలక్షణమైన పండుగ

వసంత శోభతో పరిఢవిల్లే నూతన వేడుక హోలీ

ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

9. అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం

అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం

అందరికీ హోలీ శుభాకాంక్షలు

10. రంగుల పండుగ వచ్చింది

అందరిలో ఆనందాన్ని తెచ్చింది

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

11. హోలీ రోజున ఒకరికొకరు చల్లుకునేవి

రంగులు కాదు అనురాగ ఆప్యాయతలు

పన్నీటి సుగంధాలు

మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ హోలీ

12. చెడు, నిరాశ, నిరుత్సాహాన్ని...

హోలీకా దహనంలో వేసి

మీ జీవితంలో సంతోషాన్ని రంగులతో ఆహ్వానం పలకండి

హోలీ శుభాకాంక్షలు

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం