Children's day wishes 2024: మీ చక్కటి పిల్లలకు చిల్డ్రన్స్ డే స్పెషల్ విషెస్ చెప్పండి ఇలా
Children's day wishes 2024: చిల్డ్రన్స్ డే రోజు పిల్లలు ఆట పాటలతో సందడి చేస్తారు. ప్రతి ఏడాది జవహర్ లాల్ నెహ్రూ గౌరవార్థం నవంబర్ 14న మనం బాల దివస్ నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా మీ చక్కటి పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండి.
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
ఇంటికి అందం పిల్లలే. దేశానికి భవిష్యత్తు ఆ పిల్లలే. నేటి బాలలే రేపటి పౌరులని అందుకనే చెప్పారు. ఆ పౌరులని ఇప్పటినుంచే ఆశావహ దృక్పథంతో పెంచడం చాలా అవసరం. ఈ బాలల దినోత్సవం సందర్భంగా మన దేశ రేపటి పౌరులైన మీ చక్కటి పిల్లలకు ఈ అందమైన శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ మేము కొన్ని విషెస్, కోట్‌లు తెలుగులో అందించాము. వీటిని మీ పిల్లలకు చదివి వినిపించండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి.
బాలల దినోత్సవ శుభాకాంక్షలు 2024
1. నేటి పిల్లలే రేపటి నవభారత నిర్మాతలు
వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం
బాలల శ్రేయస్సు లక్ష్యంగా
భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
2. బాలలు పూరేకులు
అల్లరి, ఆటలే వారి లోకం
ఆకలి, అమ్మే వారికి ముఖ్యం
ప్రేమను పంచే విశాల దాతలు
కుతంత్రాలు ఎరుగని శాంతి కపోతాలు
రేపటి భావి బంగారు పౌరులందరికీ
బాలల దినోత్సవం శుభాకాంక్షలు
3. నేటి బాలలే రేపటి భవిష్యత్తు జాతి సంపదలు
పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
4. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే
చదువును అశ్రద్ధ చేయొద్దని పిల్లల్ని కోరుకుంటూ
హ్యాపీ చిల్డ్రన్స్ డే
5. పిల్లలను మంచిగా మార్చడానికి
ఉత్తమ మార్గం వారిని సంతోషంగా ఉంచడమే
పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే
6. ఈ బాలల దినోత్సవం సందర్భంగా
మీ కలలు, నవ్వులు, అమాయకత్వం
ఈ ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటూ
హ్యాపీ చిల్డ్రన్స్ డే
7. పిల్లలు ఈ ప్రపంచాన్ని
అందమైన ప్రదేశంగా మారుస్తారు
అలాంటి పిల్లలందరికీ
హ్యాపీ చిల్డ్రన్స్ డే
8. భూమ్మీద ఉన్న వారిలో
అత్యంత విలువైన వారు పిల్లలే
వారి భవిష్యత్తుకు మనమే బంగారు బాటలు వేద్దాం
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
9. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నా చిన్నారికి
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను
10. పిల్లల జీవితం అంతులేని ఆనందంతో
నిండిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
11. నేటి బాలలే
రేపటి దేశ భవిష్యత్తును మార్చే నాయకులు
హ్యాపీ చిల్డ్రన్స్ డే
12. తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డకు
ప్రతిరోజు నవ్వడం, ఆడడం, పాడడం, నేర్చుకోవడం,
శాంతిగా జీవించడం, సంతోషంగా ఉండడం నేర్పండి.
అతను జీవితాంతం మనస్పూర్తిగా జీవిస్తాడు
13. దేశ పురోభివృద్ధికి మీరే ఆసరా,
చదువుకోవడం ద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి,
మంచి విద్య మీకు ఉపయోగపడుతుంది,
మీ మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది.
హ్యాపీ చిల్డ్రన్స్ డే 2024