Hair on upper lip: పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా పై పెదవి మీద వెంట్రుకలను ఇలా సులువుగా తొలగించుకోండి
కొంతమంది మహిళలకు పై పెదవి మీద వెంట్రుకలు వస్తూ ఉంటాయి. వాటిని పార్లర్‌కి వెళ్లా తొలగించుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లోనే నొప్పి లేకుండా తొలగించే సులభమైన ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి. ఆ పద్ధతులేవో తెలుసుకోండి.

అవాంఛిత రోమాలు పెరగడం అనేది మహిళలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. పురుషులకు గడ్డం, మీసాలు వారి గౌరవ చిహ్నాలు. కానీ ఒక మహిళ ముఖం మీద ఇలాంటి వెంట్రుకలు కనిపిస్తే, అది వారికి ఇబ్బందులకు దారితీస్తుంది. మహిళల ముఖం మీద వెంట్రుకలు హార్మోన్ల సమస్యలు లేదా జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయి. ఇవి ఉండే చూసేందుకు ముఖం అందంగా కనిపించదు.
ఈ అవాంఛిత రోమాల వల్ల మహిళలు ఎగతాళికి గురయ్యేందుకు, అవమానకరమైన వ్యాఖ్యలు బారిన పడేందుకు ఇవి కారణం అవుతాయి. ఈ సమస్య నుండి బయటపడటానికి, చాలా మంది మహిళలు ప్రతి 15 రోజులకు పార్లర్‌కు వెళ్లి వాటిని తొలగించుకుంటారు. అక్కడ ఎక్కువ డబ్బు చేయాల్సి వస్తుంది.
మీరు కూడా పై పెదవి మీద వెంట్రుకలతో ఇబ్బంది పడుతున్నారా? వాటిని నొప్పి లేకుండా తొలగించే పద్ధతి కోసం వెతుకుతున్నారా? అయితే ఈ ఇంటి నివారణలు మీకు సహాయపడతాయి. మీ ఇంట్లోనే ఉన్న పదార్థాలతో మీరు వీటిని సులభంగా తొలగించుకోవచ్చు. ఈ పద్ధతులన్నీ పై పెదవి మీద వెంట్రుకలను సురక్షితంగా తొలగించడమే కాకుండా, నొప్పిని కూడా కలిగించవు.
బొప్పాయి, పసుపు
ఈ పద్ధతిని అనుసరించడానికి, 2 పెద్ద చెంచాల బొప్పాయి గుజ్జును తీసుకొని, అర చెంచా పసుపుతో కలిపి మెత్తగా చేయండి. ఆ తర్వాత, ఈ మిశ్రమాన్ని పై పెదవి మీద 15 నిమిషాల పాటు అప్లై చేయండి. బొప్పాయిలో ఉన్న ఎంజైమ్స్ వెంట్రుకల మూలాలను విచ్ఛిన్నం చేసి, వెంట్రుకల పెరుగుదలను నిరోధిస్తాయి.
గుడ్డు, మొక్కజొన్న పిండి
గుడ్డులో ఉన్న ల్యూటీన్, జియాక్సంతిన్ చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు, పై పెదవి మీద వెంట్రుకలను కూడా తొలగిస్తాయి. ఈ పద్ధతిని అనుసరించడానికి, గుడ్డు తెల్లసొనలో కార్న్ ఫ్లోర్, తేనె కలిపి పై పెదవి మీద అప్లై చేయండి. ఈ పద్ధతి అనవసరమైన వెంట్రుకలను తొలగించడంలో సహాయపడుతుంది.
పాలు, శెనగపిండి
పై పెదవి మీద వెంట్రుకలను తొలగించడానికి శెనగపిండిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడానికి, ఒక గిన్నెలో శెనగపిండిని, పాలు కలిపి, మందపాటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పై పెదవి మీద వెంట్రుకలకు అప్లై చేసి, ఆరబెట్టండి. పేస్ట్ ఆరిపోయాక, మెల్లగా స్క్రబ్ చేయండి.
తేనె, పొడి చక్కెర
పై పెదవి మీద వెంట్రుకలను తొలగించడానికి ఇది కూడా ఒక ప్రభావవంతమైన పద్ధతి. తేనెలో చక్కెర కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. వెంట్రుకలను బయటకు లాగడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని పై పెదవి మీద అప్లై చేసి, ఆరబెట్టండి. ఆ తర్వాత, మెల్లగా స్క్రబ్ చేయండి. ఈ పద్ధతి వెంట్రుకలను మూలాల నుండి తొలగించడంలో సహాయపడుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్