బ్యూటీ పార్లర్లలో ఫేషియల్ చేయించుకోవడానికి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ధరలకు భయడమే చాలా మంది వాటికి వెళ్లడం లేదు. నిజానికి బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీరు చర్మాన్ని మెరిపించుకోవచ్చు. ఇంటి దగ్గర స్టీమ్ ఫేషియల్ ప్రయత్నించవచ్చు. ఇది చర్మానికి మంచి ఫలితాలను ఇస్తుంది. మురికిని తొలగించి మెరిపిస్తుంది.
ఉద్యోగినులు, కాలేజీ అమ్మాయిలు మెరిసే చర్మం పొందాలనుకుంటారు. అందుకోసం పార్లర్ కు వెళ్లి ఫేషియల్స్, బ్లీచింగ్ వంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇవి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వాటికి చెల్లించే డబ్బులను భరించడం మాత్రం అందరితరం కాదు.
అంతేకాదు చర్మాన్ని మెయింటైన్ చేయడానికి రకరకాల క్రీములు, లోషన్లు కూడా ఉపయోగిస్తుంటారు.ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. అయితే వాటిని అధికంగా వాడడం కూడా మంచిది కాదు. అలాగే ఇలాంటి వాటిని కొనేందుకు అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది.
పార్లర్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్ చేయాలనుకునేవారు తులసి ఆకులకు వేపాకులు, గ్రీన్ టీని ఎంపిక చేసుకోవచ్చు. వీటితో మీ చర్మానికి నేచురల్ గ్లో పొందవచ్చు. చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన, సహజమైన మార్గం. స్టీమ్ ఫేషియల్ లోపలి నుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది.
మీరు తాగి వదిలేసిన గ్రీన్ టీ బ్యాగుల్లోని మిగతా అవశేషాలు, తులసి ఆకులు, వేపాకులు వంటివి మెత్తగా పేస్టులా చేసుకుని అప్పుడు ఈ ఫేషియల్ చేసుకోవాలి. ఈ ఫేషియల్ చేయసుకోవడం వల్ల చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
స్కిన్ లైటనింగ్: ఈ ఫేషియల్ ముఖానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది చర్మానికి నేచురల్ గ్లో ఇస్తుంది. ఆవిరి చర్మం లోపలికి చేరిన తర్వాత చర్మం చాలా రిఫ్రెష్ గా మారుతుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
మొటిమలు తగ్గుతాయి: మొటిమలు, నల్ల మచ్చలు ఉన్నవారికి ఆవిరి ఫేషియల్ ఉపయోగపడుతుంది. మీ ముఖాన్ని ఇక్కడిచ్చిన మూడు పదార్థాలు కలిపి రాయడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది రంధ్రాలలోని బ్యాక్టీరియాను శుభ్రపరుస్తుంది. మొటిమలు, నల్ల మచ్చల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మాయిశ్చరైజింగ్ : చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడిబారడం, దురద నుండి రక్షిస్తుంది. తేమవంతంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది.
వృద్ధాప్యాన్ని నివారిస్తుంది: కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఈ ఫేషియల్ చేయించుకున్నాక ఆవిరి పట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు. ఇది ముడతలను తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: ముఖానికి ఫేషియల్ చేసుకున్నాక, ఆవిరి పట్టడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. చర్మంలో టెన్షన్ తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల శరీరం, మనస్సు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గం ఇది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
.
సంబంధిత కథనం
టాపిక్