World's Most Laziest Country: సోమరిపోతు దేశాల జాబితా ఇదిగో, మన దేశం ఏ స్థానంలో ఉందంటే...
World's Most Laziest Country: సోమరిపోతు దేశాలు అంటే సోమరిపోతులను ఎక్కువగా కలిగి ఉన్న దేశాలు అని అర్థం. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకారం సోమరిపోతు దేశాల జాబితా ఇక్కడ ఇచ్చాము.
World's Most Laziest Country: ఏటా ఎన్నో అధ్యయనాలు, నివేదికలు విడుదలవుతూ ఉంటాయి. తాజాగా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ఫలితం విడుదలైంది. ఇది గ్లోబల్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పై చేశారు. అంటే ఏ దేశాల్లోని ప్రజలు శారీరకంగా, చురుగ్గా ఉంటారు... అనే విషయంపై అధ్యయనం జరిగింది. దాదాపూ 46 దేశాలలోని ఏడు లక్షల మంది వ్యక్తుల డేటాను సేకరించి ఈ అధ్యయనాన్ని పూర్తి చేశారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు నేచర్ జర్నల్ లో ప్రచురించారు. ఆ అధ్యయన ఫలితాల్లో దేశాల జాబితాను కూడా విడుదల చేశారు. అంటే శారీరకంగా పనిచేయడానికి, చురుగ్గా ఉండడానికి ఇష్టపడని ప్రజలను ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను విడుదల చేశారు. ఇందులో మన దేశం కూడా ఉంది.
అత్యధిక సోమరిపోతు దేశం
ప్రపంచంలో అత్యధిక శాతం సోమరిపోతులను కలిగి ఉన్న దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఇండోనేషియాలోని ప్రజలు రోజులో కేవలం 3513 అడుగులు మాత్రమే వేస్తారు. అంటే తక్కువగా నడిచే ప్రజలను కలిగి ఉన్న దేశం ఇది. ఈ దేశం రద్దీగా ఉంటుంది. మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. ఇండోనేషియాలలో వాకింగ్, శారీరక శ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
రెండో స్థానంలో
ఇండోనేషియా తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఉంది. సోమరిపోతుల దేశంలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. సౌదీ అరేబియాలోని ప్రజలు 3807 అడుగులు మాత్రమే రోజుకు వేస్తారు. వేడి వాతావరణం కలిగిన ఈ సౌదీ అరేబియాలో తక్కువ శారీరక శ్రమ చేస్తూ ఉంటారు అరేబియన్.లు చాలామంది సౌదీలో ఇంటి లోపల ఉండడానికి ఇష్టపడతారు. మండే వేసవి నెలలో వారు ఎలాంటి వ్యాయామాలు కానీ, వాకింగ్ కానీ చేయడానికి ఇష్టపడరు. ఇండోర్ వ్యాయామ సౌకర్యాలను కూడా కల్పించుకునేందుకు ప్రయత్నించరు. దీని వల్ల వారి ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.
మూడో స్థానంలో
సోమరిపోతుల దేశాలలో మలేషియా మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశ ప్రజలు రోజులో 3963 అడుగులు వేస్తారు. పట్టణీకరణ ఎక్కువ కావడం, మోటారు రవాణా ప్రాధాన్యత పెరగడంతో నడిచే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. కౌలాలంపూర్, సేవాంగ్ వంటి నగరాలు అధిక ట్రాఫిక్ రద్దీని కలిగి ఉన్నాయి. ఇక్కడ నడిచే వారి సంఖ్య కూడా చాలా తక్కువ.
నాలుగో స్థానంలో
ఫిలిప్పీన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రజలు సగటున రోజుకు 4008 అడుగులు మాత్రమే నడుస్తారు. తక్కువ చురుకైన ప్రజలను కలిగి ఉన్న దేశాలలో ఇది ఒకటి. పట్టణీకరణ, సామాజిక అంశాలు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనీలా, సెబు వంటి నగరాలు అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా పరిమిత పాదచారులకే కారణం అవుతున్నాయి. ప్రజా రవాణా మెరుగుపరచడంతో పాటు నడకా, సైక్లింగ్ కు ప్రోత్సహించేలా ఫిలిప్పీన్స్ లో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
అయిదో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. రోజుకు 4105 అడుగులు మాత్రమే నమోదు చేస్తోంది. ఆ తర్వాత ఈజిప్టు, బ్రెజిల్ దేశాలు నిలిచాయి. ఇక భారతదేశంలోని ప్రజలు రోజుకు 4297 అడుగులు వేస్తున్నట్టు అధ్యయనం తెలిసింది. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులు కారణంగా... ఇంత తక్కువ నడకను ప్రజలు నడుస్తున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో నడిచేంత వీలు రోడ్లపై ఉండదు. నడకకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి. భారతదేశంలో శారీరక శ్రమను ప్రోత్సహించడానికి అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉందని డేటా సూచిస్తుంది. ఇలా సోమరిపోతుల దేశాల జాబితాలో మన దేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది. మన తర్వాత మెక్సికో, అమెరికా దేశాలు నిలిచాయి. ఈ దేశాల్లోని ప్రజలు కూడా శారీరక శ్రమ చేసేందుకు చాలా తక్కువగా ఇష్టత చూపిస్తున్నారు.
సోమరితనం ఎందుకు పెరుగుతుంది
అనేక దేశాల్లో సామర్థ్యం స్థాయిలో పెరుగుతున్నట్టు గుర్తించారు ఆధునిక సాంకేతికత పెరగడం సౌకర్యాలు అధికంగా మారడం శారీరక శ్రమ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి ఇది నిశ్చల జీవనశైలకి కారణం అవుతున్నాయి డిజిటల్ వినోదం సోషల్ మీడియా కూడా శారీరక శ్రమణం దూరం చేస్తున్నాయి అధిక స్థాయి ఒత్తిడి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి వాటికి కారణం అవుతున్నాయి ఎంతగా శారీరక శ్రమను చేస్తే ఆరోగ్యం అంతగా బాగుంటుందని చెబుతున్నారు వైద్యనిపుణులు