Pregnancy in Summer: వేసవిలో గర్భిణులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు, తినకూడని పదార్థాల జాబితా ఇదిగో-here is a list of foods that pregnant women should eat and should not eat during summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy In Summer: వేసవిలో గర్భిణులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు, తినకూడని పదార్థాల జాబితా ఇదిగో

Pregnancy in Summer: వేసవిలో గర్భిణులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు, తినకూడని పదార్థాల జాబితా ఇదిగో

Haritha Chappa HT Telugu

Pregnancy in Summer: వేసవిలో పిల్లలతో పాటు వృద్ధులు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు వేసవిలో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వేసవిలో గర్భిణులు ఏం తినాలి? (istock)

Pregnancy in Summer: గర్భంతో ఉన్న సమయం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. శారీరక భావోద్వేగాలలో ఎత్తు పల్లాలు చూడాల్సి వస్తుంది. గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక అత్యంత అందమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. అయితే వేసవిలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవడమే కాదు, పోషకాహారాన్ని తీసుకొని బిడ్డ ఆరోగ్యాన్ని, తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

గర్భిణులు వేసవికాలంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు, సహజ చక్కెరలు నిండి ఉన్న ఆహారాలలో అధికంగా తినాలి. వీటిని తినడం వల్ల జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణ క్రియను, పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. డైటీషియన్లు చెప్పిన ప్రకారం గర్భిణీలు వేసవిలో తప్పకుండా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎలాంటి పదార్థాలను దూరంగా పెట్టాలో తెలుసుకోండి.

ఏం తినాలి?

గర్భిణులు వేసవిలో పుచ్చకాయలను ప్రతిరోజూ తినాలి. ఈ పండ్లు డీహైడ్రేషన్ రాకుండా అడ్డుకుంటాయి. శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచుతాయి. నిమ్మకాయ రసం, కివీ పండ్లు, జామ, పీచ్, రేగు పండ్లు అధికంగా తింటూ ఉండాలి. వీటన్నింటిలో కూడా ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఐరన్, ఫైబర్ అధికంగా ఉండే ఆపిల్ పండ్లు ప్రతిరోజూ రెండు తినడం చాలా అవసరం. అలాగే రోజుకో అవకాడో పండు తింటే మంచిది. దీనిలో మంచి కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇక రోజుకు రెండు అరటిపండ్లు కూడా తినాలి. మామిడి పండ్లు తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అలాగే నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. లస్సీ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి అధికంగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఏం తినకూడదు?

గర్భిణీలు ఇంట్లో తయారుచేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బయట దొరికే మిల్క్ షేక్స్ వంటి చక్కెర పానీయాలను తక్కువగా తినాలి. పంచదార కలిపిన పానీయాలకు, ఆహారాలకు దూరంగా ఉండాలి. సోడాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు. పంచదారతో చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. పంచదారలో జీరో క్యాలరీలు ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. కాఫీ, టీలు కూడా పూర్తిగా మానేయడమే మంచిది. వేసవిలో కాఫీ, టీలు శరీరాన్ని డిహైడ్రేషన్‌కు గురయ్యేలా చేస్తాయి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను పూర్తిగా మానేయడం మంచిది.