DIY Strawberry Face Scrub । మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఈ స్ట్రాబెర్రీ స్క్రబ్ ట్రై చేయండి!-here is a homemade diy strawberry brown sugar face scrub recipe to get glowing skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Strawberry Face Scrub । మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఈ స్ట్రాబెర్రీ స్క్రబ్ ట్రై చేయండి!

DIY Strawberry Face Scrub । మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఈ స్ట్రాబెర్రీ స్క్రబ్ ట్రై చేయండి!

HT Telugu Desk HT Telugu
Jul 09, 2023 08:00 AM IST

DIY Strawberry Brown Sugar Scrub Recipe: మెరిసే మేనిఛాయను పొందాలనుకుంటున్నారా? ఇక్కడ ఇంట్లోనే తయారుచేసే ఫేస్ స్క్రబ్ రెసిపీని తెలియజేస్తున్నాం.

DIY Strawberry Brown Sugar Scrub Recipe
DIY Strawberry Brown Sugar Scrub Recipe (istock)

Monsoon Skin Care: మీరు అందంగా, యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? ప్రకాశవంతమైన, మెరిసే మేనిఛాయను సాధించడానికి ఎల్లప్పుడూ ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు అవసరం లేదు. కొన్నిసార్లు, మీకు కావలసిందల్లా మీ వంటగదిలోని కొన్ని సాధారణ పదార్థాలు. వీటితోనే మీ చర్మంపై మ్యాజిక్ చేయవచ్చు. మిమ్మల్ని మీరు అందంగా కనిపించేలా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు స్ట్రాబెర్రీలు, బ్రౌన్ షుగర్‌ను కలిపి ఇంట్లోనే తయారుచేసే ఫేస్ స్క్రబ్ రెసిపీని తెలియజేస్తున్నాం. ఈ సహజమైన ఫ్రూట్ ఫేస్ స్క్రబ్ మీ చర్మంపై అద్భుతాలు చేస్తుంది.

ఇది వర్షాకాలం, ఈ వాతావరణం మీ చర్మాన్ని జిడ్డుగా మార్చవచ్చు, మొటిమలు, మచ్చలను కలిగించవచ్చు. అయితే ఈ స్ట్రాబెర్రీ- బ్రౌన్ షుగర్ ఫేస్ స్క్రబ్ మీ చర్మానికి గొప్ప మేలు చేస్తుంది. ఈ నేచురల్ ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్ చర్మంపై మృతకణాలను తొలగించడమే కాకుండా మీ చర్మానికి మంచి పోషణ ఇస్తుంది, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. అంతేకాకుండా అందమైన మెరుపును అందిస్తుంది.

DIY Strawberry Brown Sugar Scrub Recipe

కావలసినవి:

* 3-4 పండిన స్ట్రాబెర్రీలు

* 2 టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్

* 1/2 టీస్పూన్ పసుపు పొడి

స్ట్రాబెర్రీ- బ్రౌన్ షుగర్ ఫేస్ స్క్రబ్ ఎలా చేయాలి?

1. స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడగాలి, కాండం తొలగించండి.

2. ఒక గిన్నెలో స్ట్రాబెర్రీలు గుజ్జులా తయారయ్యే వరకు మాష్ చేయండి.

3. మెత్తని గుజ్జులా మార్చిన స్ట్రాబెర్రీలో బ్రౌన్ గ్రాన్యులేటెడ్ షుగర్ వేయండి, ఆపై పసుపు పొడిని వేసి బాగా కలపండి.

4. ఇప్పుడు మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి, తడిగా ఉన్న ముఖానికి స్క్రబ్‌ని మెల్లగా అప్లై చేయండి, కంటి ప్రాంతాన్ని నివారించండి.

5. వృత్తాకార కదలికలలో, స్క్రబ్‌ను మీ ముఖం, మెడపై 1-2 నిమిషాలు మసాజ్ చేయండి, అదనపు ఎక్స్‌ఫోలియేషన్ అవసరమయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టండి.

6. దీనిలోని పోషకాలు చర్మంలోకి చొచ్చుకుపోయేలా చేయడానికి మీ ముఖంపై అప్లై చేసిన స్క్రబ్‌ను 5 నిమిషాలు అలాగే ఉంచండి.

7. అనంతరం గోరువెచ్చని నీటితో స్క్రబ్‌ను కడిగి, మీ చర్మాన్ని మెత్తని టవల్ తో అద్దుతూ నీటిని తీసేయండి.

చివరగా మీ చర్మంలో ఈ తేమను నిలిపి ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.

సంబంధిత కథనం