Ayurvedic Remedies for Wounds। శరీరంపై గాయాలైతే, ఈ ఆయుర్వేద మూలికలతో నయం చేసుకోవచ్చు!-here are wonderful ayurvedic remedies to treat wounds naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurvedic Remedies For Wounds। శరీరంపై గాయాలైతే, ఈ ఆయుర్వేద మూలికలతో నయం చేసుకోవచ్చు!

Ayurvedic Remedies for Wounds। శరీరంపై గాయాలైతే, ఈ ఆయుర్వేద మూలికలతో నయం చేసుకోవచ్చు!

HT Telugu Desk HT Telugu
Aug 08, 2023 05:14 PM IST

Ayurvedic Remedies for Wounds: మీకెప్పుడైనా దెబ్బలు తగిలినపుడు, చిన్న గాయాలు, కోతలు అనుభవిస్తుంటే తక్షణ ఉపశమనం కోసం, ప్రథమ చికిత్స అందించటానికి సహాయపడే కొన్ని ఆయుర్వేద పరిష్కారాలు ఇక్కడ చూడండి.

Ayurvedic Remedies for Wounds
Ayurvedic Remedies for Wounds (istock)

Ayurvedic Remedies for Wounds: మన ఆరోగ్యంతో పాటు ప్రమాదాలు జరగకుండా మన శరీరాన్ని జాగ్రత్త కాపాడుకోవడం చాలా అవసరం. మనం ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారమైనా అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరగవచ్చు, గాయాలపాలు కావచ్చు. ఇక, రోజువారీ జీవితంలో దెబ్బలు తగలడం, చిన్నచిన్న గాయాలవడం, చర్మం కోసుకోవడం వంటి గాయాలను మనం తరచుగా ఎదుర్కొంటాము. వీటి కోసం వైద్యులను సంప్రదించడం, ఆపై ఫార్మసీలో ఎక్కువగా మందులు కొనుక్కోవడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. అయితే వైద్యుల వద్దకు వెళ్లడం సరైన చర్యే అయినప్పటికీ వెంటనే ప్రథమ చికిత్స అందించడం కూడా చాలా ముఖ్యం.

మీకెప్పుడైనా దెబ్బలు తగిలినపుడు, చిన్న గాయాలు, కోతలు అనుభవిస్తుంటే తక్షణ ఉపశమనం కోసం, ప్రథమ చికిత్స అందించటానికి ఆయుర్వేద మూలికలు సమర్థవంతమైన నివారణలుగా పనిచేస్తాయి. ఇవి సహజమైనవి కాబట్టి వీటివల్ల ఫార్మసీ మందుల వలన కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైద్యుని అవసరం లేకుండానే మీ చిన్న గాయాలను నయం చేయగలవు. ఆయుర్వేద నివారణలు ఏమిటో చూడండి.

మీకెప్పుడైనా దెబ్బలు తగిలినపుడు, చిన్న గాయాలు, కోతలు అనుభవిస్తుంటే తక్షణ ఉపశమనం కోసం, ప్రథమ చికిత్స అందించటానికి ఆయుర్వేద మూలికలు సమర్థవంతమైన నివారణలుగా పనిచేస్తాయి. ఇవి సహజమైనవి కాబట్టి వీటివల్ల ఫార్మసీ మందుల వలన కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైద్యుని అవసరం లేకుండానే మీ చిన్న గాయాలను నయం చేయగలవు.

గాయాలకు సహజమైన, ఆయుర్వేద నివారణలు

గాయం చిన్నదే అయినపుడు అది మరింత పెద్దది కాకుండా ప్రథమ చికిత్సలా సహాయపడే కొన్ని ఆయుర్వేద పరిష్కారాలు ఇక్కడ చూడండి.

పసుపు

పసుపు మనకు ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం, పసుపు కేవలం వంటలలో వాడటానికే కాదు, మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపులో శక్తివంతమైన కర్కుమిన్ సమ్మేళనం ఉంటుంది, ఇది దాని యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల కారణంగా, పసుపు గాయం వలన కలిగే నొప్పిని తగ్గించడమే కాకుండా, వేగవంతమైన చికిత్సను అందిస్తుంది.

కొబ్బరి నూనె

ఈ నూనె రక్తస్రావాన్ని నియంత్రించడంలో, చికిత్సను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గాయంపై దుమ్ము, ధూళి చేరకుండా రక్షణ కవచాన్ని అందిస్తుంది. దీని యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు గాయాలను మరింతగా రక్షిస్తాయి.

తేనే

తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది బాక్టీరియాను నిర్జలీకరణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.గాయాలపై తేనేను వర్తించినప్పుడు అది గాయం నుండి మీ చర్మాన్ని సంరక్షిస్తుంది, అంటువ్యాధులను నివారిస్తుంది. గాయాన్ని కడిగే ముందు కూడా నేరుగా గాయంపై తేనెను పూయడం ద్వారా గాయాన్ని తేలికపరుస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి యాంటీమైక్రోబయల్, యాంటీబయాటిక్ లక్షణాలు రక్త ప్రవాహాన్ని ఆపడానికి, నొప్పిని తగ్గించడానికి, వైద్య ప్రక్రియను సులభతరం చేయడానికి వేగవంతమైన సహాయకారిగా పనిచేస్తుంది. అదనంగా, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం పోరాడటానికి రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గాయాలైనపుడు వాటిపై కొన్ని వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి రసాన్ని పూయండి, త్వరగా నయం అవుతుంది.

వేప

వేపలో క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇది గాయాలకు ఒక యాంటీసెప్టిక్ ఔషధంగా పనిచేస్తుంది. వేప ఆకుల రసం గాయాలపై రక్షిత పొరను అందిస్తుంది, అంటువ్యాధులను నివారిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. వేపలోని ఈ విశేషమైన లక్షణాలు చిన్న గాయాల నుండి త్వరగా లోలుకునేలా చేస్తాయి.

సంబంధిత కథనం