దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం ముకేశ్ అంబానీది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వపు వ్యాపారాన్ని మరింత విజయ బాటలో నడిపించారు ముఖేష్. ఆసియాలోనే సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అతను చాలా సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు.
ముఖేష్ అంబానీ చాలా వినయంతో ఉంటారు. స్వభావరీత్యా ఫ్యామిలీ మ్యాన్ కూడా. ముఖేష్ అంబానీ విజయం గురించి మాట్లాడితే, దాని వెనుక ఉన్న రహస్యం అతను పాటించే కొన్ని పద్ధతులు, నమ్మకాలు. మీరు కూడా మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, మీ దినచర్యలో ముకేశ్ అంబానీ లవాట్లను పాటించడం నేర్చుకోండి.
ముఖేష్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఏదో ఒకటి సాధించి తీరుతానని ఎప్పుడూ తనను తాను నమ్మేవాడు. దాని ఫలితమే నేడు మనందరి ముందుంది. అతను తన ముందుకు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకునేవాడు. దానిని సాధించడానికి కష్టపడటానికి ప్రయత్నించాడు. తన లక్ష్యాలను సాధించాలనే తపన ఆయనకు ఎప్పుడూ ఉండేది.
ముకేశ్ అంబానీ టీమ్ వర్క్ ను నమ్ముతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయానికి అతిపెద్ద రహస్యం టీమ్ వర్క్ అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. తమ ఉద్యోగులు ఉత్తమ బృందం అని మెచ్చుకుంటూ ఉంటారు.
మీరు ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మిమ్మల్ని మీరు ముందుకు నమ్మాలని ముకేశ్ అంబానీ నమ్ముతారు. పని గురించి సానుకూలంగా ఆలోచిస్తేనే ఏదైనా సాధించగలరని అనేవారు. అందుకే ప్రతి సందర్భంలోనూ పాజిటివ్ గా ఉండటానికి ఇష్టపడతారు. తన తండ్రి వల్లే ఆయనకు ఈ లక్షణం వచ్చిందన్నారు.
ఎంత విజయవంతమైన వ్యక్తి అయినా ఎప్పుడూ ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తేనే విజయం త్వరగా దక్కుతుందని ముఖేష్ చెబుతూ ఉంటారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి ఈ క్వాలిటీ ఎక్కువగానే ఉంది. దానివల్లే నేడు ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మీరు కూడా జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే, అంబానీ చెప్పిన ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీ జీవితంలో చేర్చండి.
సమస్యలకు పరిష్కారం వెతకడం వల్ల ఉపయోగం లేదని ఆ సమస్యకు మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలని ముఖేష్ అంబానీ నమ్ముతారు. సమస్య మూలం తెలిస్తే పరిష్కారం మరింత సులువుగా మారుతుందని ఆయన అంటారు. అది వృత్తిపరమైన జీవితమైనా, వ్యక్తిగతమైనా… సమస్యకు మూలాన్ని కనుగొనడం అత్యవసరమని చెబుతారాయన.