Chocolate Day: చాకొలేట్ డే స్పెషల్ విషెస్ ఇవే.. ఆలస్యం చేయకుండా మీ క్రష్‌కు పంపేయండి!-here are the special wishes for chocolate day dont delay send them to your crush ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate Day: చాకొలేట్ డే స్పెషల్ విషెస్ ఇవే.. ఆలస్యం చేయకుండా మీ క్రష్‌కు పంపేయండి!

Chocolate Day: చాకొలేట్ డే స్పెషల్ విషెస్ ఇవే.. ఆలస్యం చేయకుండా మీ క్రష్‌కు పంపేయండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 09, 2025 05:30 AM IST

Chocolate Day: వాలెంటైన్స్ వీక్ మొదలైపోయింది. మూడో రోజైన చాకొలేట్ డే కూడా వచ్చేసింది. మరి మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు అందజేసేందుకు రెడీ అయిపోయారా? మీ కోసం ఇదిగోండి. ప్రత్యేకమైన మెసేజ్‌లు మీ కోసం.

చాకొలేట్ డే స్పెషల్ విషెస్ ఇవే.. ఆలస్యం చేయకుండా మీ క్రష్‌కు పంపేయండి!
చాకొలేట్ డే స్పెషల్ విషెస్ ఇవే.. ఆలస్యం చేయకుండా మీ క్రష్‌కు పంపేయండి!

చాకొలేట్‌ని ప్రేమ, ఆనందానికి ప్రతీకగా పరిగణిస్తాం. ఏ మాత్రం సంతోషకరమైన పరిస్థితి అయినా, ప్రేమపూర్వకమైన బంధమైనా చాకొలేట్ ఇచ్చే శుభాకాంక్షలు చెబుతాం. మరి వాలెంటైన్స్ వీక్‌లోని చాకొలేట్ డే సందర్భంగా చాకొలేట్ ఇచ్చి విష్ చేయడానికి రెడీగా ఉన్నారా.. కేవలం చాకొలేట్ ఇచ్చి సరిపెట్టుకోకుండా, ప్రత్యేకమైన మెసేజ్ కూడా తెలిపితే అది ఒక మధుర జ్ఞాపకంగా మారి గుర్తుండిపోతుంది.రండి మీకోసం ఈ ప్రత్యేకమైన మెసేజ్‌లు రెడీగా ఉన్నాయి.

1. "మీ జీవితం ప్రతి రోజు చాకొలెట్‌ ఉండేంత తీపిగా, తినడం వల్ల వచ్చేంత పసందుగా ఉండాలి! హ్యాపీ చాకొలెట్ డే!"

2. "చాకొలెట్ తినేటప్పుడు మిగతా ప్రపంచాన్ని ఎలా మరిచిపోతారో, అలాంటి స్నేహం జీవితమంతా కావాలని కోరుకుంటున్నా! హ్యాపీ చాకొలెట్ డే!"

3. "నీతో నా స్నేహం చాకొలెట్‌‌లా మంచిగా, మధురంగా, మరపురానిదిగా ఉండాలి! హ్యాపీ చాకొలెట్ డే!"

4. "మీ లైఫ్‌లో చాకొలెట్‌ వంటి మధురమైన క్షణాలను సృష్టించాలని ఆశిస్తూ, హ్యాపీ చాకొలెట్ డే!"

5. "చాకొలెట్ వలన కలిగే ఆనందం, ప్రేమ, స్నేహం మీకు జీవితంలో తీపి క్షణాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను!"

6. "నా జీవితంలో మాధుర్యాన్ని నింపినందుకు ధన్యవాదాలు. చాక్లెట్ డే శుభాకాంక్షలు!"

7. "నువ్వు నా జీవితంలో చాక్లెట్ వంటి దానివి, ఎల్లప్పుడూ తియ్యదనం వంటి సంతోషాన్ని తీసుకొస్తావు. చాక్లెట్ డే శుభాకాంక్షలు!"

8. "ఈ రోజు మీ జీవితంలో అద్భుతమైన సంతోషకర క్షణాలు నిండాలని, చాలా తీపి కబుర్లు ఉండాలని కోరుకుంటున్నాను. చాక్లెట్ డే శుభాకాంక్షలు!"

9. "మీరు నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తి. చాక్లెట్ డే శుభాకాంక్షలు!"

10. "చాక్లెట్ డే సందర్భంగా మీకు నా ప్రేమ, ఆప్యాయతను తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను."

ఫిబ్రవరి 14తో ముగిసిపోయే వాలెంటైన్స్ వీక్ లో చివరి రోజును వాలెంటైన్స్ డే అంటాం. మరి ఈ వారం మొత్తం ఉండే రోజుల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటే..

  • ఫిబ్రవరి 7 – ఫ్లవర్స్ డే (Flowers Day)
  • ఫిబ్రవరి 8 – ప్రాంపస్ డే (Propose Day)
  • ఫిబ్రవరి 9 – చాకొలేట్ డే (Chocolate Day)
  • ఫిబ్రవరి 10 – ప్రపోజల్ డే (Propose Day)
  • ఫిబ్రవరి 11 – హగ్ డే (Hug Day)
  • ఫిబ్రవరి 12 – కిస్ డే (Kiss Day)
  • ఫిబ్రవరి 13 – హగ్ డే (Hug Day)
  • ఫిబ్రవరి 14 – వాలెంటైన్స్ డే (Valentine's Day)

Whats_app_banner

సంబంధిత కథనం