Diwali Sweets: దీపావళికి సింపుల్‌గా అయిపోయే స్వీట్స్ ఇవిగో, కాజు హల్వా వేరుశనగ లడ్డు రెసిపీలు-here are the simple sweets for diwali cashew halwa peanut laddu recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Sweets: దీపావళికి సింపుల్‌గా అయిపోయే స్వీట్స్ ఇవిగో, కాజు హల్వా వేరుశనగ లడ్డు రెసిపీలు

Diwali Sweets: దీపావళికి సింపుల్‌గా అయిపోయే స్వీట్స్ ఇవిగో, కాజు హల్వా వేరుశనగ లడ్డు రెసిపీలు

Haritha Chappa HT Telugu
Published Oct 24, 2024 05:30 PM IST

Diwali Sweets: దీపావళికి స్వీట్ ఏం చేయాలనే ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీలను ఇక్కడ అందించాము. కాజు హల్వా, వేరుశెనగ లడ్డూను ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతాయి.

దీపావళి స్వీట్ రెసిపీలు
దీపావళి స్వీట్ రెసిపీలు

దీపావళికి ప్రతి ఇంట్లో స్వీట్స్ ఉండాల్సిందే. ఎక్కువ మంది స్వీట్ షాపుల్లో కొని తెచ్చేస్తూ ఉంటారు. బయట చేసే స్వీట్లు శుచిగాచేయకపోవచ్చు ఇంట్లోనే స్వీట్లు చేసుకోవడం ఉత్తమం. ఇక్కడ మేము రెండు స్వీట్ రెసిపీలను అందించాము. ఈ రెండిటినీ ప్రయత్నించి చూడండి. ఇవి చాలా సులువుగా అరగంటలోనే తయారవుతాయి. కాజు హల్వా, వేరుశెనగ లడ్డూ ఎలా చేయాలో తెలుసుకోండి.

జీడిపప్పు హల్వా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

జీడిపప్పులు - ఒక కప్పు

గోధుమ పిండి - అర కప్పు

పంచదార - ఒక కప్పు

కుంకుమపువ్వు రేకులు - నాలుగు

నెయ్యి - ఒక కప్పు

నీరు - సరిపడినంత

బాదం తరుగు - ఒక స్పూను

యాలకుల పొడి - అర స్పూను

జీడిపప్పు హల్వా రెసిపీ

1. మిక్సీలో జీడిపప్పులను వేసి మెత్తగా పొడి చేయండి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నీరు వేయండి.

3. ఆ నీటిని అధికమంట మీద మూడు నిమిషాల పాటు మరిగించండి.

4. ఆ తర్వాత పంచదారని వేసి బాగా కలపండి. అధికమంట మీద మూడు నిమిషాలు మరిగిస్తే పంచదార త్వరగా కరుగుతుంది.

5. ఆ సమయంలోనే కుంకుమ పువ్వు రేకులను కూడా వేసి ఒక నిమిషం పాటు అధికమంట మీద మరిగించండి.

6. తర్వాత కళాయితో పాటు ఆ చక్కెర మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోండి.

7. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టండి.

8. అందులో నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక గోధుమపిండి, జీడిపప్పు పొడిని వేసి బాగా కలపండి.

9. చిన్న మంట మీద మాడిపోకుండా కలపడం అవసరం. గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకోండి.

10. పంచదార మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి.

11. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి.

12. యాలకుల పొడిని బాదం తరుగును కూడా వేసి బాగా కలపాలి.

13. అది హల్వాలాగా దగ్గరగా అవుతుంది. అంతే టేస్టీ కాజు హల్వా రెడీ అయినట్టే. దీన్ని మీరు చాలా సింపుల్ గా అరగంటలో చేసేయొచ్చు.

.............…………………………………………..................

వేరుశెనగ లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు

బెల్లం తురుము - పావు కప్పు

పల్లీలు - ఒక కప్పు

వేరుశెనగ లడ్డు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశనగలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. పైన పొట్టును తీసి వాటిని మిక్సీలో వేసి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

3. అందులోనే బెల్లం తురుముని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు ఈ రెండింటిని లడ్డూల్లా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాల్లో దాచుకోవాలి.

5. అంతే టేస్టీ పల్లీల లడ్డు రెడీ అయినట్టే. ఇది ఎంతో బలాన్ని ఇస్తుంది.

6. రోజుకు ఒక లడ్డూ తిన్నా చాలు ఆ రోజంతా మీరు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు. శక్తి నిరంతరం అందుతూనే ఉంటుంది. దీపావళికి ఈ రెండు రెసిపీలు ప్రయత్నించి చూడండి. సింపుల్ గా పూర్తవుతాయి.

Whats_app_banner