Holiday Trip: వేసవిలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవిగో, సమ్మర్ హాలీడేస్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోండి-here are the places where it snows even in summer plan a trip in summer holidays ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holiday Trip: వేసవిలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవిగో, సమ్మర్ హాలీడేస్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోండి

Holiday Trip: వేసవిలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవిగో, సమ్మర్ హాలీడేస్ లో ట్రిప్ ప్లాన్ చేసుకోండి

Haritha Chappa HT Telugu

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. ఉత్తర భారతదేశంలో మళ్ళీ తేలికపాటి చలి తిరిగి వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో భారీ మంచు కురుస్తున్నందున మరియు తుఫానులు వస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో మంచును ఆస్వాదించడానికి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.

వేసవిలో మంచు కురిసే ప్రాంతాలు

వేసవి సెలవులు వచ్చాయంటే ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసే వారు ఎంతో మంది ఉంటారు. ముఖ్యంగా మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లని మంచు నగరాలనే ఎంపిక చేసుకుంటారు. అలాంటి నగరాల గురించి ఇచ్చాము.

భారతదేశంలోని అనేక ప్రాంతాల సీజన్ ను బట్టి వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. పర్వత ప్రాంతాల్లో భారీ మంచు కురుస్తోంది. మంచుతో కప్పిన పర్వతాలను చూడటానికి చాలా మంది ప్రజలు మంచుతో కూడిన ప్రదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా మంచు కురుస్తున్న దృశ్యాలను చూడాలనుకుంటే, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోండి.

1) కాశ్మీర్

కాశ్మీర్ అనే పేరు వినగానే మనసులో అందమైన లోయలు, మంచుతో కప్పిన పర్వతాలు, దేవదారు చెట్లు, మెరుస్తున్న సరస్సుల అందమైన దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. కాశ్మీర్ హిమాలయాలు, పీర్ పంజాల్ పర్వతాలతో చుట్టు ముట్టి ఉంటాయి. అందమైన లోయలతో పాటు, పర్యాటకులు ఇక్కడ పారాగ్లైడింగ్, బంజీ జంపింగ్, రాఫ్టింగ్ వంటి కార్యక్రమాలను ఆనందించవచ్చు. ఈ రోజుల్లో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇక్కడ మంచు కురుస్తున్న దృశ్యాలను చూడవచ్చు.

2) సోనమార్గ్

ఆకర్షణీయమైన హిమానీనదాలు, అందమైన సరస్సులతో చుట్టుముట్టిన సోనమార్గ్ మంచుతో కప్పి ఉంటుంది. ఈ రోజుల్లో ఇక్కడ మంచును ఆస్వాదించవచ్చు. పురాతన పర్వత సరస్సుల దగ్గర భాగస్వామితో కొంత రొమాంటిక్ క్షణాలను గడపడానికి సోనమార్గ్ మంచి ప్రదేశం. సోనామార్గ్ అనేది కాశ్మీర్ ను టిబెట్ తో కలిపే పురాతన సిల్క్ రోడ్ వే. ఇదొక హిల్ స్టేషన్. ఇక్కడికి వెళితే స్వర్గంలా అనిపించడం ఖాయం.

3) మనాలి

హిమాచల్‌లోని మనాలి అనేది ఒక హిల్ స్టేషన్. ఇక్కడ మీరు నగరాల శబ్దం, ట్రాఫిక్ చికాకులు, కాలుష్యం నుండి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపవచ్చు. నివేదికల ప్రకారం, వేసవిలో వెళ్లినా కూడా ఇక్కడ మంచు కురుస్తూ ఉంటుంది. ఇంకెందుకాలస్యం ఈ వేసవికి మనాలి ట్రిప్ ప్లాన్ చేసేయండి.

4) ఉత్తరాఖండ్‌లోని ప్రాంతాలు

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌లలో వంటి ప్రాంతాల్లో కూడా నిరంతరం మంచు కురుస్తూనే ఉంటుంది. ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేయవచ్చు. కచ్చితంగా మీ మనసు రిఫ్రెష్ అవుతుంది.

గమనిక- మీరు ఈ ప్రదేశాలలో ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటే, ముందుగా మార్గాల గురించి సమాచారం తెలుసుకోండి. వాస్తవానికి, భారీ మంచు, నిరంతర వర్షాల కారణంగా చాలా మార్గాలను మూసివేశారు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం