New Year 2025 Events: హైదరాబాద్‌లో సెలెబ్రిటీలు పాల్గొనే న్యూ ఇయర్ ఈవెంట్స్ ఇవిగో, టికెట్స్ ధర ఎంతంటే-find 2025 new year events in hyderabad where celebrities participates know the tickets cost ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year 2025 Events: హైదరాబాద్‌లో సెలెబ్రిటీలు పాల్గొనే న్యూ ఇయర్ ఈవెంట్స్ ఇవిగో, టికెట్స్ ధర ఎంతంటే

New Year 2025 Events: హైదరాబాద్‌లో సెలెబ్రిటీలు పాల్గొనే న్యూ ఇయర్ ఈవెంట్స్ ఇవిగో, టికెట్స్ ధర ఎంతంటే

Haritha Chappa HT Telugu
Dec 11, 2024 09:40 AM IST

New Year Events: న్యూ ఇయర్ వచ్చిందంటే పార్టీలు ఎక్కడ చేసుకోవాలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. హైదరాబాద్ లో సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈవెంట్స్ జాబితా ఇదిగో.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఈవెంట్లు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఈవెంట్లు (Bookmyshow)

కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేందుకు ముందుగానే ప్లాన్ లు వేసుకుంటారు ఎంతో మంది. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఛిల్ అయ్యేందుకు మంచి డెస్టినేషన్‌ల కోసం వెతుకుతూ ఉంటారు. హైదరాబాద్ లో న్యూఇయర్ కోసం ఎన్నో రకాల ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. సెలెబ్రిటీలు వచ్చి ఆడి పాడే ఈవెంట్లు కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ ఇచ్చాము. ఈ ఈవెంట్లకు వెళ్లాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి.

సింగర్ కార్తీక్ ఈవెంట్

సింగర్ కార్తీక్, సింగర్ సునీత అయిదు గంటల పాటూ తమ పాటలతో మిమ్మల్ని ఉర్రూతలూగించే ఈవెంట్ జరగబోతోంది. ఇది డిసెంబర్ 31 రాత్రి ఏడుగంటలకు గచ్చిబౌలిలోని బోల్డర్ హిల్స్ లో జరగబోతోంది. ఈ ఈవెంట్ కు వెళ్లాలంటే ఒక్కో వ్యక్తి 1699 రూపాయలు చెల్లించాలి. దాదాపు అయిదున్నర గంటల పాటూ ఈ కార్యక్రమం సాగుతుంది.

డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈవెంట్

కిస్సిక్ పాటతో కుర్రాళ్ల మనసు దోచుకున్న శ్రీలీల డ్యాన్సును లైవ్ లో చూడాలనుకుంటే నోవోటెల్ లో జరిగే ఈవెంట్ కు వెళ్లండి. శ్రీలీల డ్యాన్సుతో పాటూ అద్భుతమైన పాటలు పాడే లైవ్ బాండ్ కూడా పాల్గొనబోతోంది. టాటూ జోన్, మ్యాజిక్ షో వంటివి కూడా ఉన్నాయి. దీనికి టిక్కెట్ ధర 1499 రూపాయలు.

రామ్ మిరియాల ఈవెంట్
రామ్ మిరియాల ఈవెంట్ (Bookmyshow)

రామ్ మిరియాల ఈవెంట్

డీజే టిల్లూ పాటతో అందరి మనసులు దోచుకున్న సింగ్ రామ్ మిరియాల. అతను ఏ పాట పాడినా హిట్ కొట్టడం ఖాయం. న్యూ ఇయర్ ఈవెంట్ తో అభిమానుల మందుకు వచ్చేస్తున్నాడు.గౌలిదొడ్డిలో ఉండే ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. దీని టిక్కెట్ ధర 2499 రూపాయలు. రామ్ మిరియాలతో పాటూ డీజేలు కూడా ఇందులో పాల్గొంటారు. సాఫ్ట్ డ్రింక్స్, మాక్ టైల్స్, కాక్ టైల్స్, లిక్కర్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

మోహన భోగరాజు ఈవెంట్
మోహన భోగరాజు ఈవెంట్ (Bookmyshow)

మోహనా భోగరాజు ఈవెంట్

ఈ ఈవెంట్ కాస్త ఖరీదైన ఈవెంట్. దీనికి 4,999 రూపాయలు చెల్లించాలి. ఇందులో సింగ్ మోహనా భోగరాజు లైవ్ షోతో పాటూ నాన్ స్టాప్ మ్యూజిక్, డ్యాన్స్ ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఇందులో పాల్గొనగలరు. రాత్రి 8కి మొదలయ్యే ఈ షో కొత్త ఏడాది వచ్చేవరకు సాగుతుంది. మాదాపూర్ లో ఉన్న రాస్తాలో ఈ ఈవెంట్ జరుగబోతోంది. రకరకాల ఆహారాలు కూడా అన్ లిమిడెట్ గా ఇక్కడ ఉంటాయి. స్నేహితులతో వెళ్లేందుకు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.

ఎక్కడ బుక్ చేసుకోవాలి?

మీరు పైన చెప్పిన ఏ ఈవెంట్ కు వెళ్లాలనుకున్నా కూడా ముందుగానే బుక్ మై షో వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వీటిని కొంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. యువత ఈ ఈవెంట్లకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Whats_app_banner