World Cancer Day 2025: ఇండియాలో పెరుగుతున్న 5 రకాల అరుదైన క్యాన్సర్లు ఇవిగో, వీటితో జాగ్రత్త
World Cancer Day 2025: క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పుట్టుకొచ్చింది. కొన్ని అరుదైన క్యాన్సర్లు కూడా మనదేశంలో పెరిగిపోతున్నాయి. అవేంటో వాటి లక్షణాలేంతో తెలుసుకోండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025: ప్రతి ఏడాది ఫిబ్రవరి 4 న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించుకుంటారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక ఆ వ్యాధిపై అవగాహన పెంచడమే ముఖ్య ఉద్దేశం. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో క్యాన్సర్ అధికంగా కనిపిస్తోంది. ప్రపంచంలో 1.3 బిలియన్ల జనాభా ఉంటే అందులో 18 శాతం జనాభా భారతదేశంలోనే ఉంది. వచ్చే దశాబ్దంలో భారత్ లో కోటి మంది క్యాన్సర్ తో బాధపడతారని వైద్యులు అంచనా వేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, కాలేయం, నోటి కుహరం, కడుపు, గర్భాశయ క్యాన్సర్ గురించి చాలా మందికి తెలుసు. ఇవి సాధారణ రకాల క్యాన్సర్. కానీ కొన్ని అరుదైన క్యాన్సర్లు కూడా ఇప్పుడు మన దేశంలో విస్తరిస్తున్నాయి.

అరుదైన క్యాన్సర్లు ప్రతి 10,000 జనాభాలో 6 మందికి వస్తాయి. అందుకే వాటిని అరుదన క్యాన్సర్లు అంటారు. సాధారణ క్యాన్సర్ల విషయంలో రోగ నిర్ధారణ, చికిత్స వంటివి మెరుగుపడినప్పటికీ, అరుదైన క్యాన్సర్ల విషయంలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ అరుదైన వ్యాధులు ఆలస్యంగా గుర్తించడమే ఇందుకు కారణం. అరుదైన క్యాన్సర్లు చాలా అధునాతన దశకు చేరుకున్న తర్వాత మాత్రమే లక్షణాలను ప్రదర్శిస్తాయి.
అంతేకాకుండా, వాటి చికిత్సకు సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా లేవు. చికిత్స ఖర్చు ఎక్కువగా మారడం, బీమా కవరేజీ లేకపోవడం క్యాన్సర్ చికిత్స సవాళ్లను పెంచుతోంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో కనిపించే అరుదైన క్యాన్సర్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మెలనోమా
మెలనోమా అనేది చర్మ క్యాన్సర్. ఇది కణుపుల నుండి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఇది వర్ణద్రవ్యం కలిగి ఉంటుంది. శరీరంలోని చేతులు, కాళ్లు వంటి అవయవాల చివరి భాగంలో వర్ణద్రవ్యం పోగుపడినట్టు కనిపిస్తుంది. అలాగే మ్యూకోకటానియస్ జంక్షన్ వద్ద కనిపిస్తుంది. ఈ వ్యాధి దశను బట్టి శస్త్రచికిత్స, కీమో ఇమ్యునోథెరపీతో చికిత్స పొందుతుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్
ప్యాంక్రియాస్ అనేది మన పొట్ట లోపలి భాగంలో ఉన్న ఒక అవయవం. ఇది హెపాటోబిలియరీ వ్యవస్థతో అనుసంధానించి ఉంటుంది. తరచుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అధునాతన దశలో పట్టుబడుతుంది, దాని లక్షణాలు ప్రారంభ దశలో కనిపించవు. వ్యాధి తీవ్రంగా మారిన తరువాత, ఈ వ్యాధి కామెర్ల రూపంలో కొంతవరకు తన ఉనికిని చాటుకుంటుంది. అధునాతన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సకు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు.
మృదు కణజాల సార్కోమా
ఈ కణితులు సాధారణంగా మెసెన్కైమల్ కణజాలాన్ని (ఎముక, కండరాలు, స్నాయువులు, ఫాసియా) ప్రభావితం చేస్తాయి. శరీరంలోని కొవ్వు, కండరాలు, నరాలు, రక్తం, శోషరస కణుపులు, రక్తంలోని మృదుకణజాలంలో రావచ్చు. 40 శాతం వరకు చేతులు, కాళ్లలో సంభవిస్తుంది. దీనికి చికిత్స చేయడానికి శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీని ఉపయోగిస్తారు.
లింఫోమా
ఇది మెడ, చంకలు, ఉదరంలోని శోషరస కణుపుల దగ్గర వస్తుంది. వీనికి కీమోథెరపీతో చికిత్సను అందిస్తారు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది, కానీ వ్యాధి తరచుగా వస్తుంటుంది. దీనికి ఎముక మజ్జ మార్పిడి అవసరం.
థైమిక్ కార్సినోమా
ఇది స్టెర్నమ్ ఎముక వెనుక ఛాతీలో ఉన్న థైమస్ గ్రంథికి వచ్చే క్యాన్సర్ ఇది. ఇది ఇమేజింగ్, బయాప్సీ సహాయంతో నిర్ధారణ అవుతుంది. వ్యాధి ప్రారంభ దశలో కనిపెడితే దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. అయితే వ్యాధి ముదిరాక గుర్తిస్తే కీమోరేడియేషన్ సహాయం తీసుకుంటారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం