Anxiety Signs । మీలోని ఆందోళన మీ ప్రవర్తనను మార్చగలదు, సంకేతాలు ఇవే!
Anxiety Signs: ఆందోళన మన దైనందిన జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రవర్తనా మార్పులకు కూడా కారణం కావచ్చు. కొన్ని సంకేతాలు ఎలా ఉంటాయో చూడండి.
Anxiety Signs: ఆందోళన అనేది మీలోని భయాలు, మీ గత అనుభవాలకు సంబంధించిన బాధలు, భవిష్యత్తు గురించి బెంగ వంటి సంకేతాలను సూచించగలిగే ఒక భావోద్వేగం. ఈ ఆందోళన అనేది స్వల్పకాలికం లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. మీకు ఆందోళనగా అధికంగా ఉన్నప్పుడు చెమటలు పట్టడం, భయభ్రాంతులకు గురవడం, సరిగ్గా నిద్రపోకవడం, విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలు కనబరుస్తారు. ఈ ఆందోళన మన దైనందిన జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రవర్తనా మార్పులకు కూడా కారణం కావచ్చు. ఇతరులను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించడం కూడా ఆందోళన సంకేతాలలో ఒకటి. మనం ఎవరినైనా లేదా ఏదైనా పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనం సాధారణంగా దాని గురించి సరైన అవగాహన లేకుండా ఉంటాము.
మీరు ఎవరినైనా నియంత్రించడం, ఒత్తిడికి గురిచేయడం లేదా ఏదైనా విషయాన్ని మార్చాలనుకోవడం వంటివి చేయడం లేదని భావిస్తారు. కానీ, మీరు ఆందోళనలో ఉన్నప్పుడు అప్రయత్నంగానే మీరు మీ నియంత్రణ కోల్పోతారని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఇది మీరు ఏదైనా పరిస్థితితో పోరాడే లక్షణాన్ని సూచిస్తుందన్నారు. ఆందోళనకు సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా ఉంటాయో చూడండి.
ఓవర్ ప్రొటెక్టివ్
మీరు మీకు ఇష్టమైన వారి కోసం చాలా కేర్ తీసుకుంటారు, ఇతరులు చూపించడంపై అసూయగా ఉంటారు. ఈ క్రమంలో వారి గురించి ఆందోళన చెందుతారు.
మైక్రోమేనేజింగ్
మనం ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని ప్రయత్నిస్తాము, అన్ని పనులు చక్కబెడుతూ అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటాము, ఇందులో ఎదురయ్యే ఇబ్బందులతో ఆందోళన చెందుతాము.
పనులు పంచుకోకపోవడం
మీరు మీకు సంబంధించిన ఏ పనులలో ఇతరుల జోక్యాన్ని సహించరు. అన్నీ మీరే సొంతంగా పూర్తిచేయాలని, దాని పూర్తి క్రెడిట్ మీకే దక్కాలని భావిస్తారు. ఇతరులు మీ పనులు పంచుకోవాలని చూస్తే అది చెడిపోతుందేమోనని ఆందోళనకు గురవుతారు.
అతిగా ఆలోచించడం
ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం, పదేపదే ఏదైనా పరిస్థితి లేదా సంఘటనను తలుచుకుంటూ ప్రణాళికలు వేసుకోవడం చేస్తారు, ఎలా జరుగుతుందో, ఏమిటోనని ఆ విషయం గురించి భయాందోళనలకు గురవుతారు.
ఇతరులను మార్చడం
తరచుగా ఆందోళనతో పోరాడుతూ మనం ఇతరులనే ఒప్పించడానికి, వారిని మార్చడానికి ప్రయత్నిస్తాము లేదా విషయాలు మరోలా జరిగేలా ప్రయత్నాలు చేస్తారు. ఇది ఆందోళనతో చేసేదే.
మీరు అనుభవించిన బాధలు, గాయపడిన పరిస్థితులు, మీ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని మీరు చేసే ప్రయత్నాలు మీలో ఆందోళనలు పెంచుతాయి. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే మార్గాలు వెతకండి, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సంబంధిత కథనం