Kids Health: మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 4 డ్రింక్స్ ఇవిగో, వీటిని తాగకుండా చూసుకోండి-here are 4 drinks that can harm your childs health and make sure to avoid them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Health: మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 4 డ్రింక్స్ ఇవిగో, వీటిని తాగకుండా చూసుకోండి

Kids Health: మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే 4 డ్రింక్స్ ఇవిగో, వీటిని తాగకుండా చూసుకోండి

Haritha Chappa HT Telugu
Jan 23, 2025 08:56 AM IST

Kids Health: చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో కొన్ని రకాల డ్రింకులను పిల్లలకు అందిస్తారు. అవి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి నాలుగు పానీయాలు ఉన్నాయి. వీటిని తాగకూడదు.

పిల్లలు తాగకూడని పానీయాలు
పిల్లలు తాగకూడని పానీయాలు (shutterstock)

పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో పిల్లలకు కొన్ని అనారోగ్యకరమైన డ్రింక్స్ తాగేందుకు ఇస్తారు. పిల్లలు వాటిని కొనమని పేరెంట్స్ ను అడుగుతూ ఉంటారు. అవి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి బదులుగా పాడు చేస్తాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి నాలుగు పానీయాల గురించి ఇక్కడ ఇచ్చాము.

yearly horoscope entry point

పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేసే పానీయాలలో అధిక చక్కెర, కెఫిన్ ఉండే జ్యూసులు ఉంటాయి. ఇది పిల్లలలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా దంత క్షయం, ఊబకాయం, డయాబెటిస్ కు కారణమవుతుంది.

ఫ్లేవర్డ్ సోడా

ఫ్లేవర్డ్ సోడాలో చక్కెర అధికంగా ఉండటం వల్ల ఇది పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. సోడాలో ఉండే షుగర్, యాసిడ్ పిల్లల దంతాలను పాడు చేసి ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఎనర్జీ డ్రింక్స్

మార్కెట్లో ఎనర్జీ డ్రింక్ష్ ఎన్నో ఉన్నాయి. పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో హానికరం. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదని సిఫార్సు చేస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రింక్స్

స్పోర్ట్స్ డ్రింక్స్ తాగే వారి సంఖ్య బయట ఎక్కువగానే ఉంది. పిల్లలు కూడా వాటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇందులో ఉండే షుగర్, సోడియం, కెఫిన్, కృత్రిమ రంగులు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇవి బరువు పెరగడం, దంత క్షయం, హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తాయి.

రుచిగల పాలు

ఇవి పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంపికలు కావు. ఈ రకమైన పాలలో అధిక మొత్తంలో చక్కెర, రుచిని అందిస్తుంది. ఇవి కొన్నిసార్లు పిల్లలకు ఊబకాయానికి కారణమవుతాయి.

పిల్లలకు కచ్చితంగా తాగించాల్సిన పానీయాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

నీరు

నీరు పిల్లలకు అవసరమైన పానీయం. చక్కెర లేదా కేలరీలు జోడించకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీరు సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే పిల్లల చేత ఒక గ్లాసు నీళ్లు తాగించండి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, నీరు త్రాగటం శరీరానికి తగినంత మొత్తంలో ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ఇది కీళ్ళను లూబ్రికేషన్ చేస్తుంది. చర్మాన్ని తేమ చేస్తుంది.

పాలు

కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి మంచి మూలం. ఇది పిల్లల ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. మీ పిల్లలకి లాక్టోస్ అలెర్జీ ఉంటే, మీరు ప్రత్యామ్నాయంగా బాదం పాలు లేదా వోట్స్ పాలను కూడా చేర్చవచ్చు.

తాజా జ్యూస్

షుగర్ లేకుండా ఫ్రూట్ జ్యూస్ తో తయారు చేసిన జ్యూస్ పిల్లల ఆరోగ్యానికి మంచి ఎంపిక. పండ్ల రసాలలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి పిల్లల ఆరోగ్యాన్నిఆరోగ్యానికి సహాయపడతాయి.

హెర్బల్ టీ

చేమంతి పూలు, పుదీనా వంటి హెర్బల్ టీలను పిల్లలకు ఎలాంటి తీపి పదార్థాలు లేకుండా వేడివేడిగా తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner