గంటలపాటు కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల మీకు వచ్చే 10 ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో-here are 10 dangerous diseases you can get from sitting and working for long hours ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గంటలపాటు కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల మీకు వచ్చే 10 ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో

గంటలపాటు కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల మీకు వచ్చే 10 ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో

Haritha Chappa HT Telugu

ఆఫీసులోనైనా, ఇంట్లోనైనా ప్రతి రెండు గంటలకు ఒకసారి పది నిమిషాలు నడుస్తూ ఉండాలి. అలా కాకుండా గంటలు తరబడి కూర్చుంటే మీకు తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

గంటల కొద్దీ కూర్చుని పనిచేస్తే వచ్చే వ్యాధులు ఇవే (Pixabay)

ప్రతి ఉద్యోగంలో పనిగంటలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో చేసినా, ఆఫీసులో చేసినా గంటల కొద్దీ కదలకుండా కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ పని గంటలు అనేవి ఉత్పాదకతను పెంచుతున్నప్పటికీ మనిషి ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తున్నాయి. వారి వృత్తిగత, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ వ్యక్తి శరీరం మనసు ఆత్మ కూడా బలహీనంగా మార్చేస్తున్నాయి. ఎక్కువ గంటల పాటు కదలకుండా కూర్చుని పనిచేసే వారికి భవిష్యత్తులో వచ్చే పది తీవ్రమైన వ్యాధులు జాబితా ఇక్కడ ఉంది.

ఎక్కువ గంటలు కదలకుండా పనిచేయడం అనేది ఆ వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం తీవ్రమైన ఒత్తిడి అలసటకు గురవుతుంది. ఇది మానసిక పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమోహం వచ్చే ప్రమాదం కూడా పెరిగిపోతుంది.

ఎక్కువ గంటల పని వల్ల వచ్చే పది రోగాలు ఇవే

మానసిక సమస్యలు

ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల మాత్రమే తగ్గిపోతుంది. మానసికంగా తీవ్రంగా అలసిపోతారు. దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు. నిర్ణయాలు తీసుకోలేరు. దీర్ఘకాలం ఇలా ఉండడం వల్ల మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

రోగనిరోధక వ్యవస్థ బలహీనత

శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా బలహీన పడిపోతుంది. ఇది అనేక వ్యాధులు వచ్చేలా చేస్తుంది. ఎక్కువసేపు పనిచేయడం అనేది నా రోగనిరోధక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేది రోగనిరోధక శక్తి బలహీనపడేలా చేస్తుంది.

నిద్ర రుగ్మతలు

ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి విపరీతంగా పెరిగిపోతుంది. పగటిపూట అలసటతో పాటు అనేక నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగిపోతారు.

గుండె సంబంధిత వ్యాధులు

ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పాటు అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్లే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కీళ్ల సమస్యలు

ఒకే చోట కదలకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల కండరాల్లో, కీళ్లల్లో సమస్యలు వస్తాయి. వెన్నునొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉంది.

జీర్ణ సమస్యలు

కదలకుండా కూర్చుని పని చేస్తే ఇది ఇరిటబుల్ సిండ్రోమ్, అల్సర్లు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఒత్తిడి కారణంగా సరైన ఆహారం తీసుకోలేరు. శారీరక శ్రమ కూడా ఉండదు. కాబట్టి జీర్ణ సమస్యలు అధికంగా మారిపోతాయి.

మూడ్ స్వింగ్స్

ఎక్కువ పని గంటలు మీ మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మీలో నిరాశ, ఆందోళన వంటివి పెరుగుతాయి. నిరంతరం పనిచేయడం వల్ల అలసట, చిరాకు వంటివి ఎక్కువ అవుతాయి. ఇది సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.

డయాబెటిస్

ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తారో వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుదీర్ఘ పని గంటలు అనేవి మధుమేహ రోగం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం ఆహారాన్ని సరిగా తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం అనేవి మధుమేహం రాకను వేగవంతం చేస్తుంది.

పునరుత్పత్తి సమస్యలు

ఎక్కువ గంటలు పని చేయడం అనేది సంతా నసమస్యలకు కారణం అవుతుంది. లేదా మహిళల్లో గర్భస్రావం కావడం లేదా పుట్టబోయే బిడ్డలో లోపాలు రావడం వంటివి కనిపిస్తాయి. ఎక్కువ పని గంటలు మీకు తెలియకుండానే ఒత్తిడిని కారణమవుతాయి. ఇవి హార్మోన్లు అసమతుల్యతకు దారితీస్తుంది. దీనివల్ల మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు మహిళల్లో గర్భధారణకు సంబంధించిన సమస్యలు అధికంగా కనిపిస్తాయి.

అకాల వృద్ధాప్యం

ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల మీ చర్మం త్వరగా ముసలిది అయిపోతుంది. జుట్టు నెరిసిపోతుంది. వయసు సంబంధిత వ్యాధులు వస్తాయి. ఒత్తిడి కారణంగా వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అయిపోతుంది. మీ వయసుకు తగ్గట్టు కాకుండా మీ వయసుకు మించిన వారిలా కనిపించడం మొదలవుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

సంబంధిత కథనం