Heel Pain Home Remedies। మడమ నొప్పితో నడవలేకపోతున్నారా? ఇలా ఉపశమనం పొందండి!
Heel Pain Home Remedies: మడమ నొప్పి ఉన్నప్పుడు నడవడం కష్టంగా ఉంటుంది, దీనిని నిర్లక్ష్యం చేస్తూ పాదాలకు శ్రమ కలిగించడం వలన మడమ నొప్పి మరింత తీవ్రం అవుతుంది. నివారణలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Heel Pain Home Remedies: మడమ నొప్పి అనేది ఎలాంటి అంతర్లీన వ్యాధికి సంబంధించినది కాకపోవచ్చు. సాధారణంగా ఇది సరిపోని బూట్లు ధరించడం, హైహీల్స్ ధరించండం, పాదాలపై ఎక్కువసేపు భారం ఉంచడాం, ఎక్కువసేపు నడవడం లేదా మారథాన్‌లు చేయడం, కాలు బెణకడం, గాయం అవడం మొదలైన కారణాల వలన మడమల నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు ఊబకాయం, అధిక బరువు, అర్థరైటిస్, తదితర అనారోగ్య సమస్యలు కూడా మడమనొప్పికి దారితీయవచ్చు. మడమ నొప్పి ఉన్నప్పుడు నడవడం కష్టంగా ఉంటుంది, దీనిని నిర్లక్ష్యం చేస్తూ పాదాలకు శ్రమ కలిగించడం వలన మడమ నొప్పి మరింత తీవ్రం అవుతుంది, అరుదైన సందర్భాల్లో సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు.
ట్రెండింగ్ వార్తలు
అయితే, పరిస్థితి తీవ్రంకాక ముందే మడమ నొప్పికి కొన్ని ఇంటి నివారణలు ఉపశమనాన్ని అందిస్తాయి. మడమ నొప్పి నుండి ఉపశమనం కలిగించే ఆ ఇంటి నివారణలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
1. అలోవెరా
అలోవెరాలో బయోయాక్టివ్ కాంపోనెంట్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ప్లాంటార్ ఫాసిటిస్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది క్రమంగా, మడమ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటి టబ్ లో అలోవెరా జెల్ వేసి కనీసం 20 నిమిషాలు మీ పాదాలను నానబెట్టండి. మడమనొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
2. విటమిన్ డి
అరికాలి ఫాసిటిస్ ఉన్న రోగులలో విటమిన్ డి లోపం కారణంగా మడమ నొప్పి రావచ్చు. విటమిన్ డి తగినంత మోతాదులతో సప్లిమెంట్ చేయడం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలు, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని ఎదుర్కోవటానికి మీరు వాటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
3. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ నొప్పి తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెలో ఒకటి నుండి రెండు చుక్కల లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మీ పాదాల అడుగు భాగంలో మసాజ్ చేయవచ్చు. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మీరు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల లావెండర్ నూనెను కూడా వేసి మీ పాదాలను అందులో నానబెట్టవచ్చు.
4. విల్లో బార్క్
కొండ గన్నేరు చెట్టు బెరడు లేదా విల్లో బార్క్ అరికాలి ఫాసిటిస్ వల్ల కలిగే నొప్పిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. నీటిలో విల్లో బెరడు వేసి ఐదు నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆపై 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టండి, అనంతరం ఈ నీటిని వడకట్టి టీ రూపంలో తీసుకోండి. రోజూ రెండు కప్పుల టీ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
5. అల్లం
ప్లాంటార్ ఫాసిటిస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. అల్లం మడమ నొప్పిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చు.
సంబంధిత కథనం