భానుడు భగభగమంటున్నాడు. వేడికి ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బయట అడుగు పెట్టాలంటేనే భయమేస్తోంది. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు ముఖ్యమైన పనుల రిత్యా వెళ్లక తప్పడం లేదు. ఇలాంటప్పుడు వేడి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి. అంటే నిండైన దుస్తులు, కళ్లకు అద్దాలు, క్యాప్ స్కార్ప్ వీటన్నింటినీ ధరించాలి. ఇది అందిరికీ తెలిపిన విషయమే. చాలా మందికి తెలియని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం వేసుకునే దుస్తుల రంగు ద్వారా కూడా మనం వేడి నుంచి తప్పించుకోవచ్చట. ఎండ వేడిని ఎదుర్కోవడానికి ఇదొక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుందట.
అవును వేసవిలో కొన్ని రంగుల దుస్తులు వేసుకోవడం వల్ల శరీరం ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. అలాగే కొన్నింటిని వేసుకోవడం వల్ల వేడి ప్రభావాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అంటే కొన్ని రంగులు సూర్యుడి వేడిని స్పాంజ్‌లా పీల్చుకుంటే, మరికొన్ని దానిని తిప్పి పంపిస్తాయి. ఈ వేసవిలో మీరు హాయిగా చల్లగా ఉండాలంటే ఏ రంగులను దుస్తులను ఎంచుకోవాలో తెలుసుకోవాలో తెలుసుకుందాం రండి.
తెలుపు రంగు అన్ని రంగుల్లోకెల్లా చాలా మంచిది. తెలుపు రంగు మీద సూర్యకిరణాలు పడితే అది వాటిని వెనక్కి పంపిస్తుంది (రిఫ్లెక్ట్ చేస్తుంది). అందుకే వేసవిలో కాలంలో తెలుపు రంగు బట్టలు వేసుకుంటే మన శరీరం వేడెక్కదు, చల్లగా ఉంటుంది. చాలా సౌకర్యంగా ఉంటాయి.
లేత నీలం రంగు కూడా తెలుపు రంగులాగే చాలా వరకు సూర్యుడి వేడిని వెనక్కి పంపిస్తుంది. ఈ రంగు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. వేసుకుంటే హాయిగా అనిపిస్తుంది.
ప్రకృతికి దగ్గరగా ఉండే లేత ఆకుపచ్చ రంగు కంటికి కూడా చల్లగా ఉంటుంది. వేడిని అంతగా పీల్చుకోదు కాబట్టి వేసవి కాలంలో ఇది కూడా మిమ్మల్ని వేడి నుంచి కాపాడుతుంది.
లేత గులాబీ రంగు కూడా చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే వేడిని ఎక్కువగా పీల్చుకోదు. అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ బాగుంటుంది.
ఇది సూర్యుడి రంగులా ఉన్నా కూడా వేడిని అంతగా పీల్చుకోదు. వేసుకుంటే కాస్త బ్రైట్‌గా, ఉత్సాహంగా అనిపిస్తుంది. వేసవిలో మీకు కంఫర్టబుల్‌గా ఉంటుంది.
లేత గోధుమ రంగు కూడా వేడిని తక్కువగా పీల్చుకునే రంగుల్లో ఒకటి. ఇది చాలామందికి నచ్చే రంగు కూడా. వేసవిలో ఇది మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది.
నలుపు, ముదురు నీలం, ముదురు ఆకుపచ్చ, ఎరుపు లాంటి ముదురు రంగులు సూర్యుడి వేడిని చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి. మనం ఎండలో ఉన్నప్పుడు సూర్యుడి వేడి ఈ రంగుల బట్టల మీద పడి, ఆ వేడిని బట్టలు లోపలికి లాక్కుంటాయి. అందుకే ముదురు రంగుల బట్టలు వేసుకుంటే మనకు చాలా వేడిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.
కేవలం రంగు మాత్రమే కాదు మనం వేసుకునే బట్టలు ఏ మెటీరియల్‌తో తయారయ్యాయో కూడా ముఖ్యం. కాటన్, లెనిన్ లాంటివి గాలిని బాగా రానిస్తాయి, చెమటను పీల్చుకుంటాయి. అందుకే ఈ రంగుల్లో ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది. టైట్‌గా ఉండే బట్టల కంటే వదులుగా ఉండే బట్టలు వేసుకుంటే గాలి బాగా ఆడుతుంది, వేడి త్వరగా బయటకు పోతుంది.