గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోండి!-hearthealthy diet this foods prevent heart disease ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Heart-healthy Diet This Foods Prevent Heart Disease

గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోండి!

HT Telugu Desk HT Telugu
May 28, 2022 02:13 PM IST

శరీరంలో LDL-కొలెస్ట్రాల్‌ కనిష్ట స్థాయిలో ఉండాలి. లేదంటే గుండె జబ్బులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బరువు తగ్గించే క్రమంలో చాలా మంది ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు ఇది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు

Heart
Heart

సరైన ఆహారాన్ని అనుసరించడం అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో మాత్రమే కాకుండా ఎప్పుడు, ఎంత అనేది కూడా ముఖ్యం. పోషకాహారలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు ఇతర ప్రమాద కారకాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతాయి. శరీరంలో LDL-కొలెస్ట్రాల్‌ కనిష్ట స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఇది గుండె జబ్బులను పెంచుతుంది. బరువు తగ్గించే క్రమంలో చాలా మంది ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు ఇది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

ట్రాన్స్ కొవ్వులను తగ్గించండి

కొవ్వులను తగ్గించడానికి సులభమైన మార్గం వంటలో మోనోఅన్‌శాచురేటెడ్ లేదా పాలీఅన్‌శాచురేటెడ్ నూనెలను ఉపయోగించడం. గింజలు, అవకాడోలు ట్రాన్స్ కొవ్వులను తగ్గిస్తాయి.

పండ్లు, కూరగాయలను తినండి

నారింజ, ఎరుపు మిరియాలు, టమోటాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్రౌన్ రైస్ వంటి కొన్ని తృణధాన్యాలు తీసుకోండి. స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీస్, పీచెస్, పర్పుల్ ప్లమ్స్, గ్రీన్ సెలెరీ, లెట్యూస్, కివీ, అరటిపండ్లు మొదలైనవి హార్ట్ హెల్త్‌గా ఉండడంలో సహాయసడుతాయి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

ప్రోటీన్‌

చిక్కుళ్ళు, విత్తనాలలో అధిక ప్రోటిన్స్ ఉంటాయి. ఈ ఆహారాలు ఆరోగ్యానికి తగినంత పోషకాలను అందిస్తూనే బరువు తగ్గడంలో సహాయపడే మంచి కొవ్వులను కలిగి ఉంటాయి! . కూరగాయలు లేదా ధాన్యాలతో తయారు చేసిన వాటిని తీసుకోండి. అవి హృదయానికి చాలా మంచివి

తృణధాన్యాలు

తృణధాన్యాలు తినడం ద్వారా ఎక్కువగా ఫైబర్‌ లభిస్తుంది. తృణధాన్యాలు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి! బ్రౌన్ రైస్,బార్లీ రోజువారిగా తీసుకునే ప్రయత్నం చేయండి. వోట్‌మీల్‌తో పాటు అల్పాహారం కోసం పండ్లను తీసుకోవడం ద్వారా అధిక ఆకలినికి కంట్రోల్‌లో ఉంచవచ్చు.

స్వీట్లు, డెజర్ట్‌లు, సోడాలను తగ్గించండి

మీరు తినే ఆహారంలో చక్కెర పరిమాణాన్ని పరిమితం చేయడం ద్వారా మీ గండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బరువు పెరగడం వల్ల మధుమేహానికి దారితీయవచ్చు, ముఖ్యంగా పిండి పదార్థాలు లేదా కొవ్వులు ఎక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోవాలి

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్