Heart attacks on monday: సోమవారం రోజున హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువట.. కారణం ఇదే..
Heart attacks on monday: వారం మొదట్లోనే ఎక్కువ శాతం గుండె పోటు భారిన పడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకోండి.
గుండెపోటుకీ, వారానికీ ఏం సంబంధం అనిపిస్తోంది కదూ. కానీ తాజాగా చేసిన ఒక సర్వే ప్రకారం అదే నిజమని తేలింది.
ట్రెండింగ్ వార్తలు
మాంచెస్టర్ లో జరిగిన బ్రిటీష్ కార్డియోవాస్కులర్ కాన్ఫరెన్స్‌లో కొన్ని విషయాలు వెళ్లడించారు. తీవ్రమైన గుండెపోటు మిగతా రోజులతో పోలిస్తే వారం మొదట్లో అంటే పనిదినాలు మొదలయ్యే మొదటి రోజుల్లోనే, ముఖ్యంగా సోమవారం రోజు ఎక్కువగా నమోదవుతున్నట్లు దీంట్లో తేలింది.
ఐర్లాండ్ లో బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌కు చెందిన డాక్టర్లు ఐస్లాండ్, ఐర్లాండ్ లో (7112 రిపబ్లిక్ ఐర్లాండ్, 3416 మంది నార్తర్న్ ఐర్లాండ్ కు చెందినవారు) దాదాపు 10,528 మంది మీద ఈ పరిశోధన జరిపారు. 2013 నుంచి 2018 సంవత్సరాల మధ్యలో ఆసుపత్రిలో చేరిన వారిని గమనించారు. వారిలో చాలా మంది STEMI అంటే.. ST-సెగ్మెంట్ ఎలివేషన్ మయో కార్డియల్ ఇన్పార్క్షన్ అనే కారణంతోనే ఆసుపత్రిలో చేరుతున్నారు. అంటే కరోనరీ ధమని పూర్తిగా కూరికుపోవడం వల్ల గుండె పోటు రావడం.
ఈ STEMI గుండె పోటు వస్తున్నవారి సంఖ్య వారం మొదట్లోనే ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా సోమవారం రోజున ఈ సంఖ్య ఎక్కువని తేలింది. శాస్త్రవేత్తలు కూడా సోమవారం ఈ సమస్య ఎక్కువగా ఎందుకుంటుందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ ఇదివరకటి కొన్ని సర్వేల ప్రకారం దానికి కారణం సర్కేడియన్ రిధమ్ అని చెబుతున్నారు. అంటే జీవగడియారంలో మార్పులు రావడం. నిద్ర, తిండి విషయంలో జరిగే మార్పులు.
యూకే లో దాదాపు ప్రతి యేటా 30,000 మంది STEMI గుండె పోటు వల్ల ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీనికి తక్షణ చికిత్స అవసరం. లేదంటే గుండె దెబ్బతినే ప్రమాదం ఎక్కువవుతుంది.
బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిలేష్ సమానీ ప్రకారం.. తీవ్రమైన గుండెపోటుతో యూకేలో ప్రతి 5 నిమిషాలకు ఒకరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ కారణం తెలుసుకోడానికి మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయనన్నారు.
సోమవారానికీ, STEMI గుండెపోటుకీ కారణం ఉందని ఈ పరిశోధనలో కనుక్కున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఇదివరకు జరిగిన పరిశోధనల ప్రకారం సర్కాడియన్ రిధమ్ లో మార్పులు అంటే నిద్ర పోయే సమయం, తినే సమయం, పనుల్లో మార్పులు రావడం కారణం కావచ్చు అని తేలింది.
టాపిక్