హెల్తీ స్పైసీ పాలకూర చట్నీ ఇలా చేశారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు-healthy spicy palak chutney made like this everyone will love it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  హెల్తీ స్పైసీ పాలకూర చట్నీ ఇలా చేశారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు

హెల్తీ స్పైసీ పాలకూర చట్నీ ఇలా చేశారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు

Haritha Chappa HT Telugu

Palakura Pachadi: పాలకూర ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. కానీ పాలకూరని ఇష్టంగా తినే వారి సంఖ్య తక్కువ. ఎందుకంటే దాని నుంచి వచ్చే వాసన నచ్చదు. ఇక్కడ మేము పాలకూర పచ్చడి రెసిపీ ఇచ్చాము.

పాలకూర స్పైసీ చట్నీ రెసిపీ

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో వండిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ పిల్లలు పాలకూర ఆహారాన్ని తినరు. దాని నుంచి వచ్చే పచ్చి వాసనా వారికి నచ్చదు. ఇలా పచ్చివాసన రాకుండా పాలకూర పచ్చడిని చేసి పెట్టారంటే ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇలా పాలకూరను పచ్చడిగా చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు కూడా శరీరంలో పూర్తిగా చేరుతాయి. ఇంకెందుకు ఆలస్యం పాలకూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి.

పాలకూర చట్నీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలకూర - రెండు కట్టలు

నూనె - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

ఎండు మిర్చి - ఆరు

మెంతులు - పావు స్పూను

జీలకర్ర - అర స్పూను

ఆవాలు - అర స్పూను

మినపప్పు - ఒక స్పూను

చింతపండు - ఉసిరికాయ సైజులో

ధనియాలు - ఒక స్పూను

మినపప్పు - ఒక స్పూను

పచ్చి శెనగపప్పు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - అయిదు

పాలకూర చట్నీ రెసిపీ

1. పాలకూరను సన్నగా తరిగి నీళ్లల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో ధనియాలు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

4. పాలకూర పచ్చివాసన పోయి ఉడికే వరకు అలా ఉంచాలి.

5. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, మినప్పప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

6. ఆ తర్వాత పాలకూర మిశ్రమాన్ని కూడా వేసి తగినంత నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

7. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి దీనికి తాళింపు పెట్టుకోవాలి.

8. తాలింపు కోసం స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.

9. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు కరివేపాకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి వాటిని పచ్చడిపై వేసుకోవాలి.

10. అంతే టేస్టీ పాలకూర పచ్చడి రెడీ అయినట్టే.

11. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశలతో కూడా టేస్టీగా ఉంటుంది.

పాలకూరలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పోలేట్, క్లోరోఫిల్ వంటివి కూడా నిండి ఉంటాయి. ఇవి మనకు అత్యవసరమైనవి పాలకూర తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీర బరువు అదుపులో ఉంటుంది. రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది. అప్పుడప్పుడు పాలకూరని తినడం వల్ల ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎముకలను బలోపేతం చేసే శక్తి కూడా పాలకూరకు ఉంది. కాబట్టి మహిళల పిల్లలు కచ్చితంగా పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా ఇది ముందుంటుంది. గర్భధారణ సమయంలో ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పాలకూర ముందుస్థానంలో ఉంటుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం