టీ విషయానికొస్తే, ప్రతిఒక్కరి మైండ్‌లో ఉండేది మసాలా టీ, జింజర్ టీ, గ్రీన్ టీ, హైబిస్కస్ టీ లాంటివి తిరుగుతుంటాయి. కానీ, పైనాపిల్ టీ గురంచి తెలిసిన తర్వాత దీన్ని కూడా మీ లిస్ట్ లోకి చేర్చేసుకుంటారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ టీని పైనాపిల్ తొక్కతో తయారుచేస్తారట. కొన్నిసార్లు పండులోని గుజ్జును కూడా వాడతారు. వాస్తవానికి పైనాపిల్ తోలులో చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సీ లాంటి పోషకాలు శరీరానికి అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ తోలులో బ్రోమెలైన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం చేత ఇతర టీల కంటే బెటర్ గా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ సమ్మర్ డ్రింక్‌ను కచ్చితంగా తోలుతోనే చేయాలనేం లేదు. పైనాపిల్ లోపలి గుజ్జుతో కూడా తయారుచేసుకోవచ్చు. కానీ, పైనాపిల్ తోలుతో చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అల్లం, దాల్చినచెక్కలను ఫ్లేవర్ కోసం యాడ్ చేసి టీ తయారుచేసుకుంటారు.
పైనాపిల్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్నింటిని తెలుసుకుందాం.
పైనాపిల్‌లో 0.23 శాతంబ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గించి వాపు సమస్య రాకుండా చేస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారిపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది.
బ్రొమెలైన్ అనేది ప్రొటిలైటిక్ ఎంజైమ్. ఇది ప్రొటీన్లు బ్రేక్ అవకుండా చేస్తుంది. ఇవి అరుగుదల పెంచి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి పేగులను కాపాడుతుంది.
పోషకాలు అధికంగా ఉండే పైనాపిల్ తోలులో విటమిన్ సీ, కాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ఫైబర్ లతో పాటు నీటి శాతం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవడంతో పాటు శరీరానికి హాని కలిగించే ర్యాడికల్స్ సమస్యను తగ్గిస్తుంది.
పైనాపిల్ పండులో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్, విటమిన్ సీలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోతుంది.
పైనాపిల్ టీ చర్మానికి కూడా ఎంతో మేలు కలుగజేస్తుంది. ఇందులో యాసిడ్ ను శోషించుకునే గుణాలున్నాయి. అది కొలాజెన్ సింథసిస్ ప్రక్రియకు కీలకంగా ఉంటుంది. ఇది మొఖంపై వచ్చే వృద్దాప్య లక్షణాలను దరిచేరనీయదు. అంతేకాకుండా చర్మం తీరును మెరుగుపరుస్తుంది.
పైనాపిల్ లో ఉండే విటమిన్ సీ కేవలం రోగనిరోధక శక్తి, ఆరోగ్యవంతమైన చర్మం కోసమే కాదు. దీనికి శక్తి స్థాయిలతో కూడా సంబంధముంది. విటమిన్ సీ తక్కువ స్థాయిలో తీసుకునే వారిలో శక్తి స్థాయిలు తక్కువగా, బలహీనంగా ఉన్నట్లు పలు స్టడీల్లో తేలింది. బ్రొమెలైన్, విటమిన్ సీ కాంబినేషన్ ప్రొటీన్ సరఫరాకు అంతరాయం రాకుండా చేసి గ్లూకోజ్ గా మార్చే ప్రక్రియకు తోడ్పడతాయి. ఆ విధంగా శక్తిస్థాయిల్ని బూస్ట్ చేస్తుంది.
సంబంధిత కథనం