Healthy Breakfast: ఉదయాన్నే మీరు ఎలాంటి టిఫిన్లు తింటున్నారు? ఇవైతే ఎలాంటి ప్రయోజనం కలిగించవట చూస్కోండి మరి!-healthy breakfast what kind of tiffins are you eating in the morning lets see what benefits it brings ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Breakfast: ఉదయాన్నే మీరు ఎలాంటి టిఫిన్లు తింటున్నారు? ఇవైతే ఎలాంటి ప్రయోజనం కలిగించవట చూస్కోండి మరి!

Healthy Breakfast: ఉదయాన్నే మీరు ఎలాంటి టిఫిన్లు తింటున్నారు? ఇవైతే ఎలాంటి ప్రయోజనం కలిగించవట చూస్కోండి మరి!

Ramya Sri Marka HT Telugu

Healthy Breakfast: రోజూ ఉదయం మీరు తినే టిఫిన్లు మీ ఆరోగ్యానికి ఎంత వరకూ మేలు చేస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజూ ఇడ్లీ, దోస వంటివి తినడం మంచిదేనా? ఆరోగ్యకరమైన టిఫిన్లు అంటే ఏంటి ప్రముఖ సిద్ధవైద్య నిపుణులు కే.శివరామన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఎలాంటి ఆహారాలు తినాలి (pexels)

ఉదయం లేవగానే చక్కటి సాంబార్‌తో ఇడ్లీ తింటున్నారా? లేదా ఒకటి రెండు రకాల చట్నీలతో దోసెలు వేసుకుని తింటున్నారా? వీటితో పాటు ఉప్మా, చపాతీలు, పూరీలు, బోండాలు, పునుగులు అంటే రకరకాల పదార్థాలు తింటున్నారా? ఇవన్నీ రుచికరమైనవే. వీటిని కొన్ని ఆరోగ్యానికి కూడా మేలు చేసేవే. అయినప్పటికే వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ తినాలి అనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? కలిగితే ఇది కథనం మీ కోసమే. ప్రతిరోజూ ఇడ్లీ, దోస వంటివి తినడం మంచిదేనా? ఆరోగ్యకరమైన టిఫిన్లు అంటే ఏంటి అనే విషయాలను ప్రముఖ సిద్ధవైద్య నిపుణులు కే.శివరామన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

ఇడ్లీలు, దోసలు, చపాతీలు వంటి ఆరోగ్యానికివి మంచివే. అలాగని ఒకేసారి పిండి రుబ్బి ఫ్రిజ్‌లో పెట్టుకుని వారం రోజులు ఉదయం, సాయంత్రం తినలేం కదా. ఒకవేళ తిన్నా ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. ఇడ్లీ, దోసెలు లేదా ఇతర టిఫెన్లు వారానికి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే సరిపోతుంది. అలా తినడమే ఆరోగ్యానికి మంచిది కూడా.

మరి మిగిలిన రోజుల్లో ఏం తినాలి?

ఉదయం టిఫెన్ చేయడం చాలా అవసరం. అలాగని ఏది పడితే అది తినడం వల్ల ఎలాంటి లాభం ఉండదని శివరామన్ చెబుతున్నారు.

ఇడ్లీ, దోస వంటి పులియబెట్టిన ఆహారాలు మంచివే. కానీ వీటిని వారంలో రెండు లేదా మూడు రోజులకు మించి తినకూడదంటున్నారు. మరేం ఉదయాన్నే తినగలిగే ఆరోగ్యకరమైన ఆహారాలు ఏంటి అంటే..

  1. ఒక కప్పు ఉడికించిన శనగలు,
  2. రెండు అరటిపండ్లతో పాటు గ్లాసెడు పాలు
  3. ప్రోటీన్ అవసరం కాబట్టి గుడ్లను తీసుకోవాలి. రెండు ఉడికించిన గుడ్లు లేదా రెండు గుడ్లతో వేసిన ఆమ్లెట్లు.
  4. ఒక పెద్ద కప్పు వరకూ కూరగాయల తీసుకుని వాటిని సూప్ చేసుకొని త్రాగవచ్చు.
  5. బాదం 10, అంజీర్ 1, డ్రై గ్రేప్స్ వంటివి పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
  6. ఉడికించిన చికెన్(100 గ్రాములు)
  7. రాగి జావ

ఇటువంటి పోషకాలు, విటమిన్లతో కూడిన ఆహారాలను ఉదయన్నే బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకున్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరో విషయం ఏంటంటే వీటిని తినడానికి ఎక్కువ శ్రమ కూడా అవసం లేదు. ముందు రోజు నానబెట్టడం, మిక్సీ పట్టడం నుంచి సింక్ నిండా పేరుకుపోయే అంట్ల వరకూ అన్నింటా కష్టం తగ్గుతుంది.

మళ్లీ ఆకలేస్తే ఏం చేయాలి?

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తో వచ్చిన చిక్కు ఏంటంటే.. వీటిని తిన్న కొన్ని గంటల్లోనే మళ్లీ ఆకలి వేస్తుంది. ఆకలి వేయాలి కూడా. ఎందుకంటే అలా ఆకలి వేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉందని అర్థం. ఇలాంటప్పుడు మీరు సపోటా, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లు తినవచ్చు. లేదా పెద్ద కప్పులో బ్లాక్ టీ త్రాగవచ్చు. వేసవి కాలం అయితే మజ్జిగ త్రాగవచ్చు ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే అని డాక్టర్ కు. శివరామన్ తెలిపారు.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం