Chana dosa: మినప్పప్పు వాడకుండా.. శనగలతో క్రిస్పీ దోశ..-healthy breakfast dosa with chana dal and rice in detailed steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chana Dosa: మినప్పప్పు వాడకుండా.. శనగలతో క్రిస్పీ దోశ..

Chana dosa: మినప్పప్పు వాడకుండా.. శనగలతో క్రిస్పీ దోశ..

Chana dosa: శనగలు, బియ్యం నానబెట్టి చేసుకునే దోశ రుచిలో భిన్నంగా బాగుంటుంది. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

శనగలతో దోశ

అల్పాహారంలోకి దోసెలుంటే కడుపు నిండి పోతుంది. కానీ వారానికి ఒక్కసారి తినగలుగుతాం. అలాంటప్పుడు రుచిలో భిన్నంగా ఉండే ప్రొటీన్ ఎక్కువుండే శనగలతో దోశ చేసుకుని చూడచ్చు. దీనికి మినప్పప్పు కూడా అవసరం లేదు. పిండి పులియబెట్టకున్నా కూడా దోసె వెంటనే వేసుకోవచ్చు. పులిసిన పిండిన వేసుకుంటే రుచి ఇంకాస్త పెరుగుతుంది. తయారీ ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల బియ్యం

1 కప్పు నల్ల శనగలు

1 కరివేపాకు రెబ్బ

2 పచ్చిమిర్చి

చిన్న అల్లం ముక్క

2 చెంచాల పచ్చి కొబ్బరి

సగం టీస్పూన్ మెంతులు

తగినంత ఉప్పు

2 చెంచాల నూనె

తయారీ విధానం:

  1. ముందుగా పెద్ద గిన్నెలో శనగలు, బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కుని, మునిగే అంత నీళ్లు పోయాలి. అందులోనే మెంతులు కూడా వేసుకోవాలి. వీటిని 8 గంటల పాటు నాననివ్వాలి.
  2. తర్వాత మిక్సీ జార్ లో బియ్యం, శనగలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు, అల్లం ముక్క వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  3. పెనం పెట్టుకుని వేడెక్కాక దోశెల్లాగా వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె పోసుకుని కాల్చుకోవాలి.
  4. రెండు వైపులా రంగు మారేదాక దోశ కాల్చుకుంటే చాలు. దీన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.