Dahi Kebab Recipe : పైన క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే దహీ కబాబ్స్..-healthy and tasty dahi kebab recipe here for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Healthy And Tasty Dahi Kebab Recipe Here For Breakfast

Dahi Kebab Recipe : పైన క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే దహీ కబాబ్స్..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 26, 2022 07:01 AM IST

Dahi Kebab Recipe : మీరు కొంచెం తిన్నా.. కడుపు నిండుగా ఉండాలని అనుకుంటున్నారా? బరువు తగ్గడానికి ఇది ఓ సింపుల్ చిట్కా. మీరు కూడా ఇలాంటి ఓ రెసిపీ కోసం ఎదురుచూస్తుంటే.. దహీ కబాబ్ బెస్ట్ ఆప్షన్. వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. పైగా టేస్ట్ కూడా అదిరిపోద్ది.

దహీ కబాబ్
దహీ కబాబ్

Dahi Kebab Recipe : దహీ కబాబ్ అనేది శాఖాహార అల్పాహారంగా చెప్పవచ్చు. దీనిని ప్రత్యేకమైన సందర్భాలలో తయారు చేసుకుంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసేది ఎప్పుడైతే ఏముంది వండుకోవడానికి. పైగా ఇవి పైన క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ ఇష్టపడతారు. తయారు చేయడం కూడా సింపుల్. అంతేకాకుండా మంచి టేస్ట్ ఉంటుంది. మరి వీటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పెరుగు - అరకప్పు

* శనగపిండి - పావు కప్పు

* కొత్తిమీరు - 1 టేబుల్ స్పూన్

* పచ్చిమిర్చి - 1 టీస్పూన్ (సన్నగా తరిగినది)

* ఉల్లిపాయలు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి)

* ఉప్పు - తగినంత

* నట్స్ - 2 టీస్పూన్లు (పొడి)

* నూనె - ఫ్రై చేయడానికి తగినంత

తయారీ విధానం

ముందు శనగపిండి.. గోధుమరంగు వచ్చే వరకు పొడిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నూనె తప్పా అన్ని పదార్థాలను ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపండి. ఒక గంట ఫ్రిజ్లో పెట్టండి. ఈ మిశ్రమాన్ని తీసుకుని.. ఫ్లాట్ రౌండ్‌లుగా (టిక్కీస్ లాగా) చేసుకోండి. వాటిని మీడియం వేడి మీద.. రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అయితే ఈ కబాబ్‌లు చాలా మెత్తగా ఉంటాయి. కాబట్టి.. మీరు వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేదంటే విరిగిపోయే అవకాశముంది. దీనిని గ్రీన్ చట్నీతో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్