Chia Seeds: బరువు తగ్గించే చియా సీడ్స్‌తో చక్కటి బ్రేక్ ఫాస్ట్, రెసిపీ ఇదే-healthy and tasty chia seed pudding weight loss breakfast recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chia Seeds: బరువు తగ్గించే చియా సీడ్స్‌తో చక్కటి బ్రేక్ ఫాస్ట్, రెసిపీ ఇదే

Chia Seeds: బరువు తగ్గించే చియా సీడ్స్‌తో చక్కటి బ్రేక్ ఫాస్ట్, రెసిపీ ఇదే

Ramya Sri Marka HT Telugu
Dec 27, 2024 06:30 AM IST

Chia Seeds: చియా విత్తనాలతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. సునాయాసంగా బరువును తగ్గించే ఈ విత్తనాలతో చక్కటి వంటకం తయారుచేసుకోవచ్చు. ఈ సింపుల్ పదార్థాలను వాడి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. రెసిపీ కూడా చాలా ఈజీ

బరువు తగ్గించే చియా సీడ్స్‌తో చక్కటి బ్రేక్ ఫాస్ట్, రెసిపీ ఇదే
బరువు తగ్గించే చియా సీడ్స్‌తో చక్కటి బ్రేక్ ఫాస్ట్, రెసిపీ ఇదే

బరువు తగ్గడం కోసం చాలా టిప్స్ పాటించి బోర్ కొట్టేసిందా.. మీ బ్రేక్ ఫాస్ట్ గేమ్‌కు కాస్త బ్రేక్ ఇవ్వండి. హాయిగా కడుపు నిండా చియా విత్తనాలతో తయారుచేసిన బ్రేక్ ఫాస్ట్ తిన్నప్పటికీ కూడా మీ బరువు అస్సలు పెరగదు. అదేంటి అంత చిన్న చిన్న గింజలతో బ్రేక్ ఫాస్ట్ ఏంటి.. అవేం బలాన్నిస్తాయని తక్కువగా చూస్తున్నారా.. వాటిల్లోఉండే ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మరే విత్తనాల్లోనూ దొరకవు. పైగా ఇవి తీసుకోవడం వల్ల కడుపునిండినట్లుగా త్వరగానే అనిపించడంతో పాటు కొద్దిగంటల వరకూ ఆకలి అన్నమాటే అనిపించదు. పైగా వీటితో బ్రేక్ ఫాస్ట్ తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ.

yearly horoscope entry point

షుగర్ ఉండే పదార్థాలను పక్కకుపెట్టేసి అద్భుతమైన, బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ తెలుసుకోవడానికి రెడీ అవ్వండి. ఇది రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల టేస్టీ ఫుడ్ అనిపించుకోవడంతో పాటు మీ బరువును కూడా తగ్గించేస్తుందని మీరే ఒప్పుకుంటారు.

కావాల్సిన పదార్థాలు:

  • పావు కప్పు చియా విత్తనాలు
  • ఒక కప్పు నిండా బాదం పాలు (మీ ఛాయిస్ ని బట్టి ఏ పాలనైనా వాడుకోవచ్చు)
  • అర టీ స్పూన్ వెన్నిలా క్రీమ్
  • టేబుల్ స్పూన్ తేనె ( ఆప్షనల్)
  • స్ట్రా బెర్రీలు లేదా ఏదైనా పండు పొడవాటి ముక్కలు

తయారుచేసే విధానం:

  1. ఒక గిన్నె తీసుకుని అందులో చియా విత్తనాలు, బాదం పాలు, వెన్నిలా క్రీమ్, తేనె వేసి బాగా కలపండి.
  2. ఆ ద్రావణంలో చియా విత్తనాలు బాగా కలిసిపోయేంత వరకూ కలుపుతూనే ఉండండి.
  3. ఆ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకూ అలాగే ఉంచండి.
  4. ఆ తర్వాత మరోసారి ద్రావణం మొత్తాన్ని కలియతిప్పి 2 నుంచి 3 గంటల సేపు ఫ్రిడ్జ్ లో దాచి పెట్టండి.
  5. ఉదయం ఆ మిశ్రమంలో మరికొన్ని బాదంపాలు వేసుకుని పలచగా చేసుకున్న ద్రావణాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి.
  6. అలంకరణ కోసం ద్రావణం పైన బెర్రీస్ గానీ లేదా ఏదైనా పండు పొడవాటి ముక్కను గానీ ఉంచుకుని టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసేయండి.

చియా విత్తనాలతో కలిగే ప్రయోజనాలు:

  • చియా విత్తనాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలతో సమానంగా చియా విత్తనాల్లోనూ కాల్షియం నిల్వలు ఉండి ఎముకలను బలపరుస్తాయి.
  • ఇందులో ఉండే ప్రొటీన్ కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. చిన్నారుల ఎదుగుదలలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
  • ఫైబర్ గుణాలు ఎక్కువగా ఉండటం చేత మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
  • పేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి రోగనిరోధక వ్యవస్థను మెరుగుచేస్తుంది.
  • మెరిసే చర్మం కోసం, ఆరోగ్యకరమైన జుట్టుకోసం చియా విత్తనాలను డైలీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
  • శక్తికి కేంద్రంగా ఉండే చియా విత్తనాలు రోజూ తినడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకూ శక్తి స్థాయిలు మెరుగవుతాయి.
  • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరించే చియా విత్తనాలు గుండెకు మేలు చేస్తాయి.
  • చియా గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం