Cabbage Egg Fry: క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? బ్రెడ్ నుంచి రోటీల వరకూ అన్నింటికీ సెట్ అయే కర్రీ ఇది!-healthy and tasty cabbage egg fry a quick and delicious recipe for your breakfast and lunch ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Egg Fry: క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? బ్రెడ్ నుంచి రోటీల వరకూ అన్నింటికీ సెట్ అయే కర్రీ ఇది!

Cabbage Egg Fry: క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? బ్రెడ్ నుంచి రోటీల వరకూ అన్నింటికీ సెట్ అయే కర్రీ ఇది!

Ramya Sri Marka HT Telugu
Published Feb 07, 2025 06:30 AM IST

Cabbage Egg Fry: మీరు గుడ్లతో ఇప్పటివరకూ చాలా రకాల రెసిపీలను ట్రై చేసి ఉంటారు. కానీ క్యాబేజీ ఎగ్ డిష్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా? బ్రెడ్ నుంచి అన్నం, రోటీల వరకూ అన్నింటికీ సెట్ అయ్యే కర్రీ ఇది. క్యాబేజీ ఎగ్ ఫ్రై కర్రీ రుచిగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా చాలా మంచిది.

క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా?
క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? (Shutterstock)

‘ఆదివారం అయినా, సోమవారం అయినా రోజూ గుడ్లు తినండి’ అంటూ సరదాగా అనే ఈ మాట గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను బాగా వివరిస్తుంది. ఉదయం ఉపహారం అయినా లేదా భోజనం అయినా, గుడ్డుతో తయారుచేసిన వంటకాలు అద్భుతమైన ఎంపిక. పోషకాలతో నిండిన గుడ్డు మన ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు, రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. దీనితో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేయవచ్చు.

ఉదాహరణకు - ఎగ్ బుర్జీ, ఆమ్లెట్, ఎగ్ పరాటా, ఎగ్ ఫ్రై మొదలైనవి. వీటన్నింటితో మీ ట్రై చేసి ఉంటారు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకునే వారి కోసం మేము ఈరోజు చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన గుడ్డు రెసిపీని తీసుకొచ్చాం. క్యాబేజ్, గుడ్డుతో తయారుచేసే ఈ ఉపహారం వేగంగా తయారవుతుంది. దీన్ని బ్రెడ్, పరోటాలు, అన్నం, చపాతీలు ఇలా అన్నింటికీ సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి, క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

క్యాబేజ్ ఎగ్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

మూడు గుడ్లు,

రెండు ఉల్లిపాయలు,

ఒక టమాటో,

పచ్చిమిర్చి,

జీలకర్ర,

ఎర్ర మిర్చి (ఒక టీస్పూన్),

కొత్తిమీర పొడి (అర టీస్పూన్),

గరం మసాలా (అర టీస్పూన్),

ఉప్పు (రుచికి సరిపోయేంత),

నూనె (మూడు టీస్పూన్లు),

కొత్తిమీర.

రుచికరమైన, ఆరోగ్యకరమైన క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలి?

క్యాబేజ్ ఎగ్ ఫ్రై తయారు చేయడానికి, ముందుగా గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి, దానిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి.

నూనె వేడి అయ్యాక దాంట్లో జీలకర్ర వేయండి.

జీలకర్ర కాస్త వేయించిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయండి.

ఉల్లిపాయలను మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించండి. ఇవి లేత గులాబీ రంగులోకి మారగానే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేయండి.

క్యాబేజ్‌ను కూడా మూడు నుండి నాలుగు నిమిషాల పాటు నూనెలో వేయించండి.

అవి కాస్త ఉడికి మెత్తగా అయ్యాక, పొడవుగా, సన్నగా తరిగిన టమాటోలను వేయండి.

అన్ని కూరగాయలు చక్కగా నూనెలో వేగి మెత్తబడే వరకు ఉడికించండి.

మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత, కూరగాయలు బాగా మెత్తగా అయ్యాక, గ్యాస్ ఫ్లేమ్‌ను తగ్గించండి.

ఇప్పుడు అందులో ఎర్ర మిర్చి పొడి, కొత్తిమీర పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలపండి.

అన్ని మసాలాలను ఒకటి నుండి రెండు నిమిషాల పాటు ఉడికించండి.

ఈలోపు మరో స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి దానిలో నూనె వేసి గ్యాస్ మీద వేడి చేయండి.

నూనె వేడి అయ్యాక దాంట్లో గుడ్లు పగలగొట్టి వేయండి. గుడ్లను బాగా కలుపుతూ చిన్న చిన్న ముక్కలుగా అంటే బుర్జీలా ఉడికించాలి.

గుడ్డు బుర్జీ సిద్ధమైన వెంటనే, దాన్ని ఉడుకుతున్న క్యాబేజ్ మిశ్రమంలో కలపండి.

రెండింటినీ రెండు నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి, కొత్తిమీర వేసి అలంకరించండి.

ఈ రుచికరమైన క్యాబేజ్ ఎగ్ ఫ్రైని రొట్టె, పరాటా లేదా బ్రెడ్‌ లేదా అన్నంతో కలిపి తినవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం