Children Breakfast : పిల్లల కోసం ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు చేయండి
Breakfast For Children : ఉదయం పూట.. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలని తల్లిదండ్రులు తికమక పడుతుంటారు. సరైన పోషకాహారం వాళ్లకు అందిస్తేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రోజులో యాక్టివ్ గా ఉండాలంటే.. మంచి ఫుడ్ తప్పనిసరి.
పిల్లలు తినేటప్పుడు.. మారం చేయడం సహజం. ఇది తినను, అది తినను అని చెబుతుంటారు. కానీ వారికి పోషకాహారం ఇవ్వడం అనేది బాధ్యత. చిన్న వయసులో సరైన తిండి(Food) తింటేనే.. ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు ఆరోగ్యకరమైన భోజనం, సమతుల్య ఆహారాన్ని అందించడం సవాలుగా ఉంటుంది. కానీ వారికి మంచి బ్రేక్ ఫాస్ట్(Breakfast) అనేది కచ్చితంగా పెట్టాలి. మీ పిల్లలు తినగలిగే కొన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఇక్కడ ఉన్నాయి.
మీ పిల్లల రోజును ప్రారంభించడానికి ఓట్స్ ఆరోగ్యకరమైన ఎంపిక. మీరు మీ పిల్లలకు ఇష్టమైన పండ్లు(Fruits), చెర్రీలు, స్ట్రాబెర్రీల వంటి పండ్లను కూడా అల్పాహారంలో జోడించొచ్చు. తేనెతో బాదం, పిస్తాలను కూడా ఇవ్వొచ్చు. ఓట్స్ దోస, ఇడ్లీ, ఉప్మా కూడా తయారు చేయవచ్చు.
గుడ్లు(Eggs) ముఖ్యమైన అల్పాహారం. ప్రోటీన్, పోషకాలతో నిండి ఉంటాయి. గుడ్లలో లభించే ప్రోటీన్లు పిల్లలలో కండరాలు, కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. మీరు ఆమ్లెట్, ఉడికించిన గుడ్డు, గుడ్డును శాండ్‌విచ్‌లతో సహా వివిధ మార్గాల్లో మీ పిల్లలకు అందించవచ్చు.
అత్యధిక పోషకాలు కలిగిన ఆహారాలు ఆకుకూరలు. మీ పిల్లలు ఇష్టపడే బచ్చలికూర, క్యాబేజీ వంటి కొన్ని ఆకుపచ్చ కూరగాయలను వేయించి.., టోస్ట్‌తో కలపండి. అల్పాహారం(Breakfast)గా అందించడానికి ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక. కూరగాయలను ఎక్కువగా ఉడికించవద్దు. ఎందుకంటే అధిక వేడి కారణంగా కూరగాయలలో ఉండే పోషకాలను కోల్పోవచ్చు.
మీ పిల్లలు ముఖ్యంగా చలికాలంలో తాజా పండ్లను తినడం చాలా ముఖ్యం. సహజంగా పండిన పండ్లను అందించాలి. నారింజ, బెర్రీలు, దానిమ్మపండ్లులాంటివి ఇవ్వాలి. ఫైబర్(Fiber), యాంటీఆక్సిడెంట్ల ఉండే పండ్లు, కూరగాయలను బ్రేక్ ఫాస్టులో తినిపించాలి. ఉసిరికాయలాంటిది ఇస్తే.. యాంటీఆక్సిడెంట్, విటమిన్ సీ అందుతుంది.
ఉప్మా ఎక్కువ కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. పని చేసే మహిళలు.., అల్పాహారం సమయంలో తమ పిల్లలకు ఉప్మా తయారు చేయడం సులభంగా ఉంటుంది. ఉప్మాలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్, పిండి పదార్థాలు ఉంటాయి. ఉప్మాలోని పోషకాలు మూత్రపిండాలు, గుండె, ఎముకలు, రోగనిరోధక వ్యవస్థ స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బఠానీలు, క్యారెట్లు, బీన్స్ వంటి సాధారణ కూరగాయలను(Vegetables) కూడా ఉప్మాలో వేసుకోవచ్చు.