Healthy Papaya Drink | కడుపు ఉబ్బరంతో ఏ పనిపైనా ఏకాగ్రత పెట్టలేము. దీనిని ఇట్టే తగ్గించుకునేందుకు మా దగ్గర ఓ ఉపాయం ఉంది. ఇది చిటికలో మీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఏ కషాయమో చెప్తాము అనుకుంటున్నారేమో.. కాదండోయ్.. రుచికరమైన హెల్తీ డ్రింక్‌నే మీ ముందుకు తీసుకువచ్చాము. దీనిని తయారు చేసుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టదు.
ఈ డ్రింక్ మొత్తం పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతే కాదండోయ్ దీనిని తాగడం వల్ల మీరు యవ్వనంగా కూడా కనిపిస్తారు. బరువును అదుపులో ఉంచేందుకు కూడా ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. కావాల్సిన పదార్థాలు ఉంటే ఒక్క నిమిషంలో మీరు దీనిని తయారుచేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* బొప్పాయి- 50 గ్రాములు (తొక్క తీసి.. ముక్కలు కోసి పెట్టుకోవాలి)
* నీళ్లు- 1 కప్పు
* మిరియాలు- 4 లేదా 5
* పసుపు- చిటికెడు
* ఉప్పు- తగినంత
* జీలకర్రపొడి- కొద్దిగా
* చియా సీడ్స్- కొన్ని
మిక్సిలో బొప్పాయి, నీళ్లు, పసుపు, మిరియాలు వేసి గ్రైండ్ చేయాలి. ఒక గ్లాసులో ఉప్పు, జీలకర్రపొడి వేసి.. దానిలో బొప్పాయి మిశ్రమాన్ని వేయాలి. పైన చియా సీడ్స్ వేసుకుంటే చాలు. అంతే సింపుల్ హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయినట్టే.
కానీ ఈ డ్రింక్‌ను కొందరు తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. గర్భిణీలు, అలెర్జీలు ఉన్నవారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, హైపోగ్లైకోమా ఉన్నవారు, హృదయ సమస్యలు ఉన్నవారు ఈ డ్రింక్‌ను తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు. మిగిలిన వారు హ్యాపీగా ఈ డ్రింక్‌ను తమ డైట్లో కలిపి తీసుకోవచ్చు.
సంబంధిత కథనం